ETV Bharat / entertainment

రాఘవేంద్రరావు పేరు వెనుక బీఏ ఎందుకో తెలుసా

author img

By

Published : Aug 24, 2022, 8:26 AM IST

raghvendrarao
raghvendrarao

తెలుగులో వందలాది చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకుల్లో రాఘవేంద్రరావు ఒకరు. తన ప్రతీ సినిమా టైటిల్స్​లో రాఘవేంద్రరావు పేరు చివర బీఏ అనే ట్యాగ్ కనిపించడం మనం చూస్తుంటాం. అలా ఎందుకు వేస్తారో ఆయన మాటల్లోనే.

Raghavendra Rao BA: ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించి దర్శకేంద్రుడిగా కీర్తిని గడించిన వ్యక్తి రాఘవేంద్రరావు. ఆయన చిత్రాల్లో ప్రతీ ఫ్రేమ్‌లోనూ భారీదనం కనపడుతుంది. అంతకుమించి కథానాయికలను అందంగా చూపించడంలో ఆయనకు సాటి మరెవ్వరూ లేరు. ఏకంగా 100కు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన రాఘవేంద్రరావు ప్రతి చిత్రంలో టైటిల్స్‌లో తన పేరు చివరిన బి.ఎ.అని వేసుకుంటారు. అలా ఎందుకు పెట్టుకుంటారోనని చాలామందికి అదొక భేతాళ ప్రశ్నలాగే ఉంది.

తన పేరు చివరిలో బి.ఎ. పెట్టుకోవడం వెనుక కారణాన్ని రాఘవేంద్రరావు ఒక సందర్భంలో చెప్పారు. 'దర్శకుడు కాకపోతే మీరు ఏమయ్యేవారు?' అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. "నేను డైరెక్టర్‌ కాకపోతే డ్రైవర్‌ అయ్యేవాడిని. ఎందుకంటే నాకు ఏమీ తెలియదు. అప్పట్లో బి.ఎ. చదివిన వాళ్లకు ఏం ఉద్యోగం వస్తుంది? కనీసం డ్రైవర్‌కు ఇచ్చే శాలరీ కూడా రాదు. మొదట్లో రెండు, మూడు చిత్రాలకు రాఘవేంద్రరావు బి.ఎ. అని టైటిల్‌ వేస్తే బాగా ఆడాయి. ఒక సినిమాలో నా పేరు వెనుక డిగ్రీని పెట్టలేదు. ఎందుకు పెట్టలేదో కూడా నేనూ అడగలేదు. ఆ సినిమా పోయింది. అప్పుడు సెంటిమెంట్‌ అనిపించి, పబ్లిసిటీ డిజైనర్‌ ఈశ్వర్‌గారికి గుర్తు చేశా. 'ఏవండీ నా కోరిక కాదు కానీ, సెంటిమెంట్‌గా అనిపించింది. తర్వాతి చిత్రంలో నా పేరు చివరిన బి.ఎ. యాడ్‌ చేయండి' అని చెప్పా. ఇక డైరెక్టర్‌ను కాకపోతే ఏమయ్యేవాడిని అని నన్ను నేను ప్రశ్నించుకున్నా. కనీసం చెక్‌ రాయడం రాదు.. టికెట్‌ కొనుక్కోవడం రాదు.. ప్రొడక్షన్‌ మేనేజర్లు, నిర్మాతలు నన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకునేవారు. అన్నీ వాళ్లే చూసేవారు. బి.ఎ. చదివిన వాళ్లకు రూ.5వేలకు మించి జీతం ఇవ్వరు. ఆ తర్వాత గుర్తుకొచ్చింది డ్రైవింగ్‌ బాగా చేస్తానని. అందుకు డ్రైవర్‌ అయ్యేవాడిని" అంటూ రాఘవేంద్రరావు చెప్పుకొచ్చారు.

ఇవీ చదవండి: ప్రొడ్యూసర్స్ గిల్డ్ కీలక నిర్ణయం, షూటింగ్స్​కు గ్రీన్​సిగ్నల్, ఆరోజు నుంచే షురూ

అలా చేయడం నచ్చదు, అందుకే ఈవెంట్ క్యాన్సిల్ అయితే ఆనందిస్తా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.