ETV Bharat / entertainment

జేమ్స్​ కామెరూన్​ సంచలన నిర్ణయం.. అలా జరిగితే అవతార్​ సీక్వెల్స్​ లేనట్టేనట

author img

By

Published : Nov 9, 2022, 3:34 PM IST

avatar sequels cameroon
avatar sequels cameroon

'అవతార్'​ సినిమా రూపంలో ప్రపంచ సినీ ప్రియులకు సరికొత్త ప్రపంచాన్ని చూపించిన దర్శకుడు జేమ్స్​ కామెరూన్..​ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అలా జరిగితే తదుపరి సీక్వెల్స్​ను తెరకెక్కించనని ప్రకటించారు. కామెరూన్​ తీసుకున్న ఈ నిర్ణయానికి అభిమానులు షాక్​ అవుతున్నారు.

Avatar Sequels James Cameron: ప్రపంచ సినీ ప్రేక్షకులకు ఓ కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసిన చిత్రం 'అవతార్‌'. హాలీవుడ్​ స్టార్​ దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ సృష్టించిన ఈ అద్భుతాన్ని ఇంకా ఇంకా చూడాలనుకున్నారు ప్రేక్షకులు. అందుకే ఈ సినిమాకు మరో నాలుగు సీక్వెల్స్‌ను ప్రకటించారు కామెరూన్‌. అందులో భాగంగానే రెండో సీక్వెల్‌గా 'అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌'ను తీర్చిదిద్దుతున్నారు. అలానే మూడో భాగం షూటింగ్​ కూడా పూర్తి చేశారు. అలా రెండో భాగానికి సంబంధించిన తొలి పోస్టర్‌ విడుదలైనప్పటి నుంచి ఎప్పుడెప్పుడు చూస్తామా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకే సినిమా ఎలా ఉండబోతుందో ట్రైలర్‌తో రుచి చూపించారు జేమ్స్​.

తాజాగా 'అవతార్'​ సీక్వెల్స్​పై దర్శకుడు జేమ్స్​ కామెరూన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో రిలీజ్​ కానున్న'అవతార్​-2' ఫ్లామ్​ అయితే మాత్రం తదుపరి సీక్వెల్స్​ 4,5 తెరకెక్కించనని ప్రకటించారు. చెప్పాలంటే ఇది సంచలన నిర్ణయమైనా.. కొన్ని పరిస్థితుల్లో తప్పదని వెల్లడించారు. కాగా, ఇప్పటికే 'అవతార్-3' సీక్వెల్‌ను 2024 డిసెంబర్​ 20న, 'అవతార్​-4'ను 2026 డిసెంబర్ 18న, అవతార్-5ను 2028 డిసెంబర్​ 22న రిలీజ్ చేయనున్నట్టు కామెరూన్​ ప్రకటించారు. కానీ కామెరూన్ తాజా వ్యాఖ్యలతో 'అవతార్' అభిమానులంతా షాక్ అవుతున్నారు. కఠిన నిర్ణయమే తీసుకున్నారని అభిప్రాయపడుతున్నారు.

ఇటీవలే విడుదలైన 'అవతార్​-2' ట్రైలర్​కు ప్రపంచవ్యాప్తంగా విశేషమైన స్పందన లభిస్తోంది. దర్శకుడు చూపించిన అందాల్ని, అద్భుతాల్ని చూసి సినీప్రియులు అవాక్కవుతున్నారు. సముద్ర గర్భంలో సాగే సన్నివేశాలు కట్టిపడేసేలా ఉన్నాయంటూ నెటిజన్లు అంటున్నారు. అయితే ఈ సన్నివేశాల చిత్రీకరణ కోసం కామెరూన్‌ అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించారట. మరోవైపు 'అవతార్-2' చిత్రాన్ని ఎన్నడూ లేని విధంగా ఏకంగా 160 భాషల్లో డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా మేకర్స్​ విడుదల చేయనున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.