ETV Bharat / entertainment

అర్జున కల్యాణం ట్రైలర్​ డేట్​ ఫిక్స్.. హిందీ 'హిట్​' అప్డేట్

author img

By

Published : Apr 18, 2022, 5:40 PM IST

CINEMA UPDATES HIT, ASHOKA VANAM,
CINEMA UPDATES HIT, ASHOKA VANAM,

Movie Updates: మిమ్మల్ని పలకరించేందుకు మరోసారి సినీ అప్డేట్స్​ వచ్చేశాయి. ఇందులో విశ్వక్​ సేన్​ 'అశోకవనంలో అర్జున కల్యాణం', బిగ్​బాస్​ ఫేమ్​ సోహెల్​ 'బూట్ ​కట్​ బాలరాజు', హిందీ 'హిట్'​ సహా పలు చిత్రాల సంగతులు ఉన్నాయి.

AshokaVanamlo Arjuna Kalayanam Trailer Date: విశ్వక్‌సేన్‌ హీరోగా నటించిన రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ 'అశోకవనంలో అర్జున కల్యాణం'. 'మే 6న కొత్త మహుర్తం' అంటూ సినిమా రిలీజ్ డేట్​ను చిత్ర బృందం ఖరారు చేసింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో అప్డేట్​ను విడుదల చేసింది. ఏప్రిల్​ 20 తేదీ సాయంత్రం 4.05 గంటలకు ట్రైలర్​ను రిలీజ్​ చేయబోతున్నట్లు ప్రకటించింది. విద్యాసాగర్‌ చింత దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రుక్సర్‌ థిల్లాన్‌ కథానాయిక. బాపినీడు, సుధీర్‌ ఈదర నిర్మించిన ఈ సినిమాను బి.వి.ఎస్‌.ఎన్‌. ప్రసాద్‌ సమర్పిస్తున్నారు.

'అశోకవనంలో అర్జున కల్యాణం'
'అశోకవనంలో అర్జున కల్యాణం'

Hindi Hit Movie New Update: విశ్వ‌క్‌సేన్ హీరోగా శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం 'హిట్'. క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ చిత్రం తెలుగులో మంచి విజ‌యాన్ని సాధించడమే కాదు.. విమర్శకుల ప్రశంసలు సైతం పొందింది. ఇక ఈ చిత్రం హిందీ రీమేక్​లో రాజ్​కుమార్ రావ్, సన్యా మల్హోత్రా హీరోహీరోయిన్లుగా నటించారు. ఒరిజినల్​ను తీసిన శైలేష్ కుమార్.. రీమేక్​కూ దర్శకత్వం వహించారు. దిల్​రాజు, టి-సిరీస్ భూషణ్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. తాజాగా, ఈ సినిమా షూటింగ్​ను పూర్తి చేసుకున్నట్లు చిత్రబృందం తెలిపింది. కేక్​ కట్​ చేసి సంబరాలు జరుపుకుంది.

హిందీ 'హిట్​' మూవీ
హిందీ 'హిట్​' మూవీ

Karan Arjun Movie First Look: కేవలం మూడే పాత్రలతో ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగే కథాంశంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం 'కరణ్ అర్జున్'. రోడ్ థ్రిల్లర్ నేపథ్యంగా మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫస్ట్​లుక్​ను ప్రముఖ దర్శకుడు పరశురాం ఆవిష్కరించారు. కరణ్ అర్జున్ కథాంశం చాలా కొత్తగా ఉందని, ఈ రోజుల్లో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకునే సినిమాగా ఉండబోతుందని తెలిపారు. రెడ్ రోడ్ థ్రిల్లర్స్ ప‌తాకంపై నిర్మించిన ఈ చిత్రం ద్వారా అభిమన్యు, నిఖిల్ కుమార్, షిఫా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు.

'కరణ్ అర్జున్'
'కరణ్ అర్జున్' ఫస్ట్​లుక్​

Boot Cut Balaraju Glimpse: బిగ్​బాస్​ రియాల్టీ షో ద్వారా విశేష గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు సోహెల్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే సోహెల్ నటించిన మిస్టర్ ప్రెగ్నెంట్ విడుదల కావల్సి ఉండగా.. తాజాగా రాజేంద్రప్రసాద్​తో కలిసి ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో ఆర్గానిక్ మామ-హైబ్రిడ్ అల్లుడు చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నాడు. అలాగే లక్కీ మీడియా పతాకంపై బెక్కం వేణుగోపాల్ నిర్మాతగా శ్రీకోనేటి దర్శకత్వం వహించిన 'బూట్ కట్ బాలరాజు' చిత్రాన్ని పూర్తిచేశాడు. సోహెల్ పుట్టినరోజును పురస్కరించుకొని ఆ చిత్ర బృందం 'బూట్ కట్ బాలరాజు' గ్లిమ్స్​ను విడుదల చేసింది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగే గ్లిమ్స్​లో పూర్తిగా తెలంగాణ యాసలో సాగే సోహెల్ సంభాషణలు, నటన ఆకట్టుకుంటోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి: రిలీజ్​ డేట్​తో నాగశౌర్య.. 'అంటే సుందరానికి!' అప్డేట్​

Review: నివేదా పేతురాజ్​ 'బ్లడీ మేరీ' ఎలా ఉందంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.