ETV Bharat / entertainment

రిలీజ్​ డేట్​తో నాగశౌర్య.. 'అంటే సుందరానికి!' అప్డేట్​

author img

By

Published : Apr 18, 2022, 3:27 PM IST

Movie Updates: సినీ అప్డేట్స్​ వచ్చేశాయి. ఇందులో నాగశౌర్య 'కృష్ణవ్రింద విహారి', వెంకటేష్​- వరుణ్​తేజ్​ 'ఎఫ్​3', నాని 'అంటే సుందరానికి!' సంబంధించిన సంగతులు ఉన్నాయి.

CINEMA UPDATES
CINEMA UPDATES

Nagashourya Krishna Vrinda Vihari Release Date: యంగ్​ హీరో నాగశౌర్య నటించిన 'కృష్ణ వ్రింద విహారి' రిలీజ్​ డేట్​ను ఖరారు చేసుకుంది. ఈ ఏడాది మే 20న థియేటర్లలో విడుదల కానుంది. ఐరా క్రియేషన్స్​ సంస్థ రూపొందించిన ఈ సినిమాకు అనీష్​ ఆర్​.కృష్ణ దర్శకత్వం వహించారు. షెర్లీ సేతియా హీరోయిన్​గా నటించింది. ఉషా మూల్పూరి నిర్మిస్తున్నారు. శంకర్‌ ప్రసాద్‌ మూల్పూరి సమర్పకులు. సీనియర్‌ నటి రాధిక ముఖ్యభూమిక పోషిస్తుండగా, వెన్నెల కిషోర్‌, రాహుల్‌ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రలు పోషస్తున్నారు. ఇప్పటికే విడుదల అయిన టీజర్​ ఫ్యామిలీ ఆడియన్స్​ను విశేషంగా ఆకట్టుకుంది.

నాగశౌర్య 'కృష్ణవ్రింద విహారి'
నాగశౌర్య 'కృష్ణవ్రింద విహారి'

Nani Antey Sundaraniki Trailer Release Date: నేచురల్​ స్టార్​ హీరో నాని, నజ్రియా జంటగా నటిస్తున్న కొత్త చిత్రం 'అంటే సుందరానికి!'. ఇందులో సుందర్ ప్రసాద్ అనే పాత్రలో నటిస్తున్నారు నాని. బ్రాహ్మణ యువకుడిగా కనిపించనున్నారు.​ తాజాగా ఈ సినిమాకు సంబంధించి కొత్త అప్డేట్​ వచ్చింది. హీరోహీరోయిన్ల ఫస్ట్​లుక్​ పోస్టర్​ను మేకర్స్​ విడుదల చేశారు. అందులో నాని, నజ్రియాలు సంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తున్నారు. ఇక, ఈ సినిమా టీజర్‌ను ఏప్రిల్​ 20న విడుదల చేయనున్నట్టు పోస్టర్‌లో వెల్లడించారు. కామెడీ ఎంటర్​టైనర్​గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. 2022 జూన్​ 10న ఈ సినిమా విడుదల కానుంది. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు.

నాని 'అంటే సుందరానికి!'
'అంటే సుందరానికి!'

F3 Movie Song Update: విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'ఎఫ్ 3' సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. తన ఎనర్జిటిక్ సాంగ్స్​తో సినిమా స్థాయిని పెంచుతున్నారు దేవి. కాగా ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్‌లలో భాగంగా, ఏప్రిల్ 22న రెండో సాంగ్​ను 'ఓ.. ఆ.. ఆహా ఆహా'ను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ పోస్టర్​ను కూడా విడుదల చేశారు. దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ నిర్మిస్తున్నారు.

వెంకటేష్​- వరుణ్​తేజ్​ 'ఎఫ్​3'
వెంకటేష్​- వరుణ్​తేజ్​ 'ఎఫ్​3'

ఇవీ చదవండి: 'కేజీఎఫ్​ 2': రాఖీభాయ్​దే హవా.. వరల్డ్​లోనే రెండో చిత్రంగా!

8 గంటలకు రూ.800.. ఆ ప్రశ్నకు సమంత​ రిప్లై!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.