ETV Bharat / entertainment

అడివి శేష్​కు మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్​- శ్రుతి హాసన్​కు జోడీగా

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 12, 2023, 12:16 PM IST

Updated : Dec 12, 2023, 12:48 PM IST

Adivi Sesh Pan India Movie : 'మేజర్'​తో పాన్ ఇండియా లెవెల్​లో గుర్తింపు పొందిన టాలీవుడ్​ స్టార్ హీరో అడివిశేష్​ మరో భారీ ప్రాజెక్ట్​కు సైన్​ చేశారు. ఇందులో ఆయనతో పాటు శ్రుతి హాసన్​ కూడా నటించనున్నారు. ఆ విశేషాలు మీ కోసం.

Adivi Sesh Pan India Movie
Adivi Sesh Pan India Movie

Adivi Sesh Pan India Movie : సినిమాల్లో తనదైన శైలిలో నటిస్తూ యాక్షన్​ చిత్రాలకు సరికొత్త డెఫినిషన్ ఇచ్చారు టాలీవుడ్ నటుడు అడివిశేష్​. 'హిట్', 'ఎవరు', 'గూఢచారి' లాంటి థ్రిల్లర్స్​తో ఆకట్టుకున్న ఈ స్టార్ హీరో ఇప్పుడు మరో యాక్షన్ మూవీలో నటించేందుకు సిద్ధమయ్యారు. ఈయనతో పాటు కోలీవుడ్ నటి శ్రుతి హాసన్​ కూడా ఈ ప్రాజెక్ట్​కు ఓకే చెప్పారు. ఈ విషయాన్ని మేకర్స్​ మంగళవారం అఫీషియల్​గా అనౌన్స్ చేశారు.

ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో నటి సుప్రియ యార్లగడ్డ ఈ చిత్రానికి నిర్మాణ బాధ్యతలు చేపట్టనున్నారు. 'క్షణం', 'గూడాచారి' లాంటి బ్లాక్ బస్టర్‌ సినిమాలకు ఫోటోగ్రఫీ డైరెక్టర్‌గా పనిచేసిన షనైల్ డియో ఈ సినిమాతో డైరెక్టర్​గా ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. ఇక ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో వేర్వేరుగా చిత్రీకరిస్తామని మూవీ టీమ్ తెలిపింది. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇప్పటికే జీ2 సినిమా షూటింగ్​లో బిజీగా ఉన్నశేష్​ త్వరలో ఈ సినిమా షెడ్యూల్​తో మరింత బిజీ కానున్నారని సమాచారం.

G2 Movie Shooting Update : ఇక తాజాగా 'జీ2' సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఇందులో భాగంగా ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. భారీ టెక్నాలజీతో అంతర్జాతీయ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు మూవీ టీమ్ తెలిపింది. అయితే తాజాగా షూటింగ్​ కోసం 5 అంతస్తుల లావిష్ గ్లాస్ సెట్‌ను చిత్ర బృందం నిర్మించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.

Goodachari Movie Cast : 'గూఢచారి 2' సినిమాకు అడివి శేష్‌ స్వయంగా స్టోరీ అందించారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దాదాపు ఐదు దేశాల్లో ఈ సినిమా చిత్రీకరణ జరగనుంది. ఇక ఈ సినిమాలో శేష్‌ సిక్స్‌ ప్యాక్‌లో కనిపించనున్నారు. బాలీవుడ్ బ్యూటీ బనితా సంధు ఈ సినిమాలో శేష్​కు జోడీగా నటిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల ఈ సినిమాకు మ్యూజిక్​ డైెరెక్టర్​గా వ్యవహరించనున్నారు.

మొన్న మహేశ్, అడవి శేష్.. నేడు నాగార్జున.. ఆ రేస్‌ కోసం వెయిటింగ్!

అడివి శేష్​పై ఫ్యాన్​ కంప్లైంట్​ - అలా చేయకపోతే!

Last Updated :Dec 12, 2023, 12:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.