ETV Bharat / entertainment

ఆదిపురుష్ 'హనుమాన్' మాస్ డైలాగ్స్​పై రచ్చ.. స్పందించిన రైటర్‌

author img

By

Published : Jun 17, 2023, 4:15 PM IST

Updated : Jun 17, 2023, 4:42 PM IST

Adipurush hanuman role : 'ఆదిపురుష్‌'లోని హనుమంతుడి డైలాగ్స్‌పై సోషల్​మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సదరు డైలాగ్స్‌ గురించి మాటల రచయిత మనోజ్ ముంతాషిర్ శుక్లా స్పందించారు. ఏం అన్నారంటే?

Adipurush Hanuman dialogues
ఆదిపురుష్ 'హనుమాన్' మాస్ డైలాగ్స్​పై రచ్చ.. స్పందించిన రైటర్‌

Adipurush hanuman role : పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్​ నటించిన 'ఆదిపురుష్‌'లోని హనుమాన్‌ పాత్ర సంభాషణలపై సోషల్‌మీడియాలో ఫుల్​ ట్రోలింగ్​ జరుగుతోంది. అయితే దీనిపై చిత్ర డైలాగ్‌ రైటర్‌ మనోజ్ ముంతాషిర్ శుక్లా మాట్లాడారు. ఎంతో శ్రద్ధ పెట్టి హనుమాన్‌ సంభాషణలు రాశానని తెలిపారు. "నేను హనుమాన్‌ సంభాషణలు తప్పుగా రాయలేదు. చాలా ఆలోచించాకే డైలాగ్స్‌ రాశాను. సినిమాలో చాలా పాత్రలు ఉన్నాయి. అందరూ ఒకేలా మాట్లాడరు. అందుకే పాత్రల మధ్య వ్యత్యాసం చూపించడం కోసం ఇలా డైలాగ్స్‌ను సరళీకరించాను. అయినా ఇలాంటి సంభాషణలను రాసిన మొదటి వ్యక్తిని నేను కాదు. అవి ఎప్పటి నుంచో అలానే ఉన్నాయి. కథావాచక్‌ (జానపద కళాకారులు)లు 'రామాయణం'ను వివరించేటప్పుడు హనుమంతుడికి సంబంధించిన సంభాషణలను ఇలాగే చెప్పేవారు. వాటినే నేను పరిగణలోకి తీసుకుని సంభాషణలను రాశాను." అని ఆయన తెలిపారు.

Adipurush first day collection : ఈ సినిమా శుక్రవారం థియేటర్‌లలో భారీ స్థాయిలో రిలీజ్ అయింది. ఈ సినిమా చూసిన వారు ఒక్కొక్కరూ ఒక్కో విధంగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది బాగుందని అంటుంటే మరికొందరు రామాయణాన్ని వక్రీకరించారని అంటున్నారు. అయితే ఈ చిత్రం మొదటి రోజే రూ.100కోట్లకు పైగా కలెక్షన్లను సాధించి రికార్డు సృష్టించింది. ఫస్ట్​ డే వరల్డ్​వైడ్​గా రూ.140కోట్లు (గ్రాస్‌) వసూలు చేసింది. హిందీలో మొదటి రోజు రూ.37.25కోట్ల (నెట్‌) వసూళ్లను అందుకుంది. ఇప్పటి వరకు ఓపెనింగ్ డే రూ.100 కోట్లకు పైగా వసూళ్లను అందుకున్న సినిమాలు ఆరు ఉన్నాయి. అందులో మూడు చిత్రాలు 'బాహుబలి 2', 'సాహో', 'ఆదిపురుష్‌'.. ప్రభాస్ ఖాతాలోనే ఉండటం విశేషం.

Adipurush OTT Rights : కొత్త సినిమా ఏది రిలీజ్ అయినా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతుందా? అని సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇప్పుడు 'ఆదిపురుష్‌' ఎక్కడ స్ట్రీమింగ్‌ కానుందో అని నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. అయితే ఈ చిత్రం ఓటీటీ రైట్స్‌ను అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో సొంతం చేసుకుంది. తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్‌ అవ్వనుంది. అయితే ఇది ఓటీటీలోకి వచ్చేందుకు దాదాపు 60 రోజులపైనే సమయం పట్టనుందని తెలుస్తోంది.

రామాయణానికి ఆధునిక హంగులను జోడించి దర్శకుడు ఓం రౌత్​ 'ఆదిపురుష్‌' సినిమాను తెరకెక్కించారు. రాఘవుడిగా ప్రభాస్‌, జానకిగా కృతిసనన్‌ నటించగా.. లంకేశ్‌గా సైఫ్‌ అలీఖాన్‌ కనిపించారు. 3డీలో విజువల్​ వండర్​గా ఈ సినిమా రిలీజ్ అయింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి :

Adipurush Movie : 'ఆదిపురుష్'​ ఓపెనింగ్స్​​.. ప్రభాస్ ఖాతాలో అరుదైన రికార్డ్​!​

'10 తలలు 2 వరుసల్లోనా.. అప్పట్లో టీషర్ట్​లూ ఉండేవా?'.. రావణుడి VFXపై ఫుల్​ ట్రోల్స్​​!

Last Updated : Jun 17, 2023, 4:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.