ETV Bharat / entertainment

Adipurush Movie : 'ఆదిపురుష్'​ ఓపెనింగ్స్​​.. ప్రభాస్ ఖాతాలో అరుదైన రికార్డ్​!​

author img

By

Published : Jun 17, 2023, 11:16 AM IST

Updated : Jun 17, 2023, 2:35 PM IST

Adipurush Box Office Collection : ఇండియాలోనే కాదు ఓవర్సీస్​లోనూ సందడి చేస్తోంది ప్రభాస్​ 'ఆదిపురుష్'​ మూవీ. శుక్రవారం రిలీజైన ఈ సినిమా తొలిరోజు ఎంత వసూలు చేసిందంటే?

adipurush movie day 1 collections
prabhas adipurush movie day 1 collections

Adipurush Day 1 Collection : టాలీవుడ్ స్టార్ ప్రభాస్‌ రాఘవుడిగా తెరకెక్కిన మైథలాజికల్​ మూవీ 'ఆదిపురుష్‌'. కృతి సనన్​, దేవదత్త నాగే, సైఫ్​ అలీఖాన్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా జూన్​ 16న భారత్​తో సహా ఓవర్సీస్​లోనూ రిలీజైంది. భారీ అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 7,500 స్క్రీన్లలో రిలీజైన ఈ సినిమా ప్రస్తుతం మంచి టాక్ అందుకుంటోంది. బాక్సాఫీస్​ వద్ద మంచి ఓపెనింగ్స్​ను అందుకుంది. తొలి రోజు సుమారు రూ. 140 కోట్ల మార్క్‌ను అందుకుంది. ఈ విషయాన్ని సినిమా నిర్మాణ సంస్థ టీ సిరిస్​ అఫీషియల్​గా అనౌన్స్​ చేసింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

మరి కొన్ని లెక్కల ప్రకారం ఈ సినిమా నైజాంలో రూ.50 కోట్లు, సీడెడ్​లో రూ17.5 కోట్లు, వైజాగ్​లో రూ.12.5 కోట్లు, వెస్ట్​- రూ.7 కోట్లు, ఈస్ట్- రూ.8 కోట్లు, కృష్ణా- రూ.7.5 కోట్లు, గుంటూరు- రూ.9 కోట్లు, నెల్లూరు- రూ. 4 కోట్ల కలెక్షన్లు రాబట్టినట్లు సమాచారం. వీకెండ్స్​లో ఈ కలెక్షన్స్​ మరింత ఊపందుకునే అవకాశాలు ఉన్నాయట. శనివారం, ఆదివారం ఈ కలెక్షన్స్‌ రూ. 250 కోట్లకు కూడా చేరవచ్చని ట్రేడ్‌ వర్గాలు అంచనా. అయితే ఇప్పటి వరకు ప్రభాస్ గత చిత్రాలు బాహుబలి 2, సాహో మాత్రమే రూ. 100 కోట్లు వసూలు చేశాయి. దీంతో తాజాగా విడుదలైన 'ఆదిపురుష్' ఇప్పుడు ఆ కలెక్షన్స్​ను దాటడం పక్కా అంటూ అభిమానులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం హిందీలో పఠాన్ తర్వాత అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా 'ఆదిపురుష్' నిలిచింది.

ఇండియాతో పాటు అమెరికాలోనూ 'ఆదిపురుష్' సినిమా మంచి టాక్​ అందుకుంది. అక్కడ ఈ సినిమా తొలి రోజు దాదాపు మిలియన్​కు పైగా యూఎస్ డాలర్ల గ్రాస్ కలెక్ట్‌ చేసి.. రికార్డ్ క్రియేట్ చేసిందని ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్​ మీడియా ఫ్యాక్టరీ ట్వీట్​ చేసింది. ఈ క్రమంలో వీకెండ్ పూర్తయ్యేలోగా యూఎస్‌లో నాలుగు మిలియన్ల డాలర్లకు మేర కలెక్ట్ చేసేలా ఉందని విశ్లేషకుల అంచనా.

మరో అరుదైన రికార్డ్​!
Adipurush Box Office Collection : ఇక ఈ కలెక్షన్స్​తో ప్రభాస్​ మరో అరుదైన రికార్డును అందుకున్నారట. ఇప్పటి వరకు తొలి రోజు వంద కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాలు ఆరు ఉన్నాయి. అందులో ఆ మూడు ప్రభాస్ సినిమాలే కావడం విశేషం. ఇక తొలి రోజు వంద రూ. కోట్లు వసూలు చేసిన మొదటి సినిమా 'బాహుబలి 2' కాగా.. ఆ తర్వాత 'సాహో'తో మరోసారి ప్రభాస్​ ఈ రికార్డును అందుకున్నారు. ఇప్పుడు 'ఆదిపురుష్' సినిమాతో మరోసారి ఈ లిస్ట్​లో టాప్​ ప్లేస్​కు రానున్నారట.

Last Updated : Jun 17, 2023, 2:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.