ETV Bharat / entertainment

'అనుమతి లేకుండా ఆయన పేరు వాడితే స్ట్రిక్ట్​ యాక్షన్'.. రజనీ లాయర్​ పబ్లిక్​ నోటీస్​..!

author img

By

Published : Jan 29, 2023, 2:26 PM IST

Updated : Jan 29, 2023, 3:21 PM IST

తమ అనుమతి లేకుండా పేరు, ఫొటోలు, వాయిస్ ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాంటూ సూపర్​ స్టార్​ రజనీకాంత్​ తరఫు న్యావవాదీ పబ్లిక్ నోటీసు జారీ చేశారు. ఆయకున్న ఇమేజ్​ను కొంతమంది వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారని వారిని కట్టడి చేసేందుకే ఇటువంటి చర్యలు తీసుకుంటున్నట్లు రజనీ లాయర్ స్పష్టం చేశారు.

actor rajinikanth advocate issues public notice
actor rajinikanth

ఇటీవలే అనుమతి లేకుండా తన పేరు, ఇమేజ్‌, వాయిస్​ను ఉపయోగించడాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తూ బాలీవుడ్‌ ప్రముఖ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ దిల్లీ హైకోర్టులో సివిల్‌ దావా వేశారు. అయితే ఇదే తరహాలో ఇప్పుడు మరో అగ్ర హీరో తన వ్యక్తిగత హక్కుల విషయమై కోర్టును ఆశ్రయించారు. ఆయనే తమిళ సూపర్​ స్టార్​ రజనీకాంత్​. తాజాగా ఈ విషయమై రజనీకాంత్​ తరఫు న్యావవాది పబ్లిక్​ నోటీసులు జారీ చేశారు. తమ అనుమతి లేకుండా పేరు, ఫొటోలు, వాయిస్ ఉపయోగిస్తే తగు చర్యలు తీసుకుంటామని అందులో పేర్కొన్నారు.

"సినీ ఇండస్ట్రీలో రజనీకాంత్ ఎన్నో భాషల్లో నటించారు. ఆయనకున్న ఇమేజే వేరు. కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్​తో పాటు పలు కంపెనీలు..రజనీ పేరు, వాయిస్, ఫొటోలతో పాటు ఆయన ఇమేజ్​ను ఉపయోగిస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. ఆయా కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇదంతా చేస్తున్నట్లుగా గుర్తించాం. ఇకపై ఎవరైనా తమ వ్యక్తిగత, వ్యాపార అవసరాలు కోసం రజనీ వాయిస్​ లేదా ఆయన ఇమేజ్​ను ఉపయోగించినట్లు తెలిస్తే వారిపై నోటీసులు జారీ చేస్తాం." అని రజనీకాంత్​ లాయర్​ వెల్లడించారు.

కాగా సూపర్​ స్టార్​ ప్రస్తుతం నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ తెరకెక్కిస్తున్న 'జైలర్‌' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో మల్లు సూపర్ స్టార్ మోహన్ లాల్​తో పాటు కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కూడా గెస్ట్​ రోల్​లో సందడి చేయనున్నారు. మరో వైపు సునీల్, తమన్నా, వినాయకన్, వసంత్ రవి, రమ్యకృష్ణలు సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

Last Updated : Jan 29, 2023, 3:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.