ETV Bharat / crime

పోలీసుల వేధింపులకు అన్నదమ్ములు ఆత్మహత్యాయత్నం.. ఎక్కడంటే..!

author img

By

Published : Nov 21, 2022, 10:10 PM IST

Brothers suicide attempted: పోలీసుల ఆగడాలను ప్రశ్నించడమే వారు చేసిన నేరం.. పోలీసుల దుర్భాషలను వారి సెల్​ ఫోన్​లో బంధించడమే వారు చేసిన తప్పు.. చివరకు పోలీసులు చేసిన తీరుతో మనస్తాపానికి గురైనా ఇద్దరు అన్నదమ్ములు ఆత్మహత్యాయత్నం వరకు దారి తీశారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండల వాసులను ఎంతో కంటతడిపెట్టించింది.

Brothers suicide attempted
Brothers suicide attempted

Brothers suicide attempted: పోలీసుల వేధింపులు తట్టుకోలేక అన్నదమ్ములు ఇద్దరు ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలో జరిగింది. మండల కేంద్రంలోని అంబేడ్కర్​ చౌరస్తా వద్ద ఇదే మండలం బల్వంతాపూర్​ గ్రామానికి చెందిన రవీందర్​రెడ్డి, రాజేశ్వర్​రెడ్డి ఇద్దరు పురుగులు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. బాధితుడు తెలిపిన వివరాలు ప్రకారం అన్నదమ్ములైన రవీందర్​రెడ్డి, రాజేశ్వర్​రెడ్డి ద్విచక్ర వాహనంపై​ వెళ్తుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు.

అందులో వికలాంగుడైన అన్నయ్యను పోలీసులు దుర్బాషలు ఆడగా తమ్ముడు సెల్​ ఫోన్​లో వీడియో తీసే ప్రయత్నం చేశాడు. దీంతో పోలీసులు వారి బైక్​ను, సెల్​ ఫోన్​ను స్టేషన్​కు తీసుకొని వెళ్లిపోయారు. అప్పటి నుంచి వారిని రోజూ మానసిక ఆవేదనకు గురిచేస్తున్నారని బాధితులు వాపోయారు. పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేస్తున్న కనీసం పట్టించుకోవడం లేదని వారు కంటతడిపెట్టారు. దీంతో చివరికి ఆత్మహత్యాయత్నం చేసుకోవాల్సి వచ్చిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు. బాధితులు ఇద్దరు ఆసుపత్రిలో కోలుకుంటున్నారు.

"నా పేరు రాజేశ్వర్​రెడ్డి.. నేను మా తమ్ముడు బైక్​పై పోతుంటే పోలీసులు వచ్చి మాపై దుర్బాషలు ఆడారు. దీంతో మా తమ్ముడు సెల్​ ఫోన్​లో వీడియో తీశాడు. అప్పుడు వారు మా సెల్​ ఫోన్​తో పాటు మా బైక్​ కూడా పోలీసు స్టేషన్​కు తీసుకుపోయారు. మా ఫిర్యాదు తీసుకోవడం లేదు. అందుకే మేము ఈ పని చేశాం."- రాజేశ్వర్​రెడ్డి, బాధితుడు

పోలీసుల వేధింపులకు అన్నదమ్ములు ఆత్మహత్యాయత్నం..

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.