ETV Bharat / crime

Rape Attempt: నంద్యాల జిల్లాలో దారుణం.. బాలికపై అత్యాచారయత్నం

author img

By

Published : Jul 20, 2022, 8:46 PM IST

Rape Attempt: రోజురోజుకు ఆడపిల్లలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. చిన్నా,పెద్దా అన్న తేడా లేదు. అడపిల్ల అయితే చాలు.. మృగాళ్లలా మీదపడిపోతున్నారు కొందరు. తాజాగా నంద్యాల జిల్లాలో ఓ బాలికపై ముగ్గురు యువకులు అత్యాచారానికి యత్నించారు. తప్పించుకున్న బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Rape Attempt
బాలికపై అత్యాచారయత్నం

Rape Attempt: ఓ బాలికపై ముగ్గురు యువకులు అత్యాచారానికి యత్నించిన ఘటన నంద్యాల జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని వెలుగోడుకు చెందిన ఓ బాలిక, బాలుడు కలిసి ద్విచక్రవాహనంపై గ్రామ సమీపంలోని అడవిలోకి వెళ్లారు. వీరు ఉన్న ప్రదేశంలోకి ముగ్గురు యువకులు వెళ్లి వారిపై దాడి చేశారు. బాలికపై అత్యాచారానికి యత్నించారు. బాలిక, బాలుడు అక్కడి నుంచి తప్పించుకుని వచ్చారు. బాలిక వెలుగోడు పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

ఇవీ చదవండి: Superstitions: ఎదుగుదలను అడ్డుకుంటున్నాారని.. రాళ్లతో కొట్టి చంపాడు..

Live Video: టోల్​గేటు వద్ద అంబులెన్స్ బోల్తా.. ముగ్గురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.