ETV Bharat / crime

రూ.11.63 కోట్ల విలువైన 25 కిలోల బంగారం స్వాధీనం

author img

By

Published : Mar 24, 2021, 4:07 PM IST

Updated : Mar 24, 2021, 5:10 PM IST

DRI officials 25 kg's gold seized at pathangi toll plaza in yadadri bhuvanagiri district
రూ.11.63 కోట్ల విలువైన బంగారు బిస్కట్లు స్వాధీనం

16:02 March 24

రూ.11.63 కోట్ల విలువైన బంగారు బిస్కట్లు స్వాధీనం

రూ.11.63 కోట్ల విలువైన బంగారు బిస్కట్లు స్వాధీనం

హైదరాబాద్ నగర శివారుల్లో పెద్ద మొత్తంలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో రూ.11.63కోట్లు విలువైన 25కిలోల గోల్డను పట్టుకున్నామని డీఆర్‌ఐ అధికారులు వెల్లడించారు. ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. గౌహతి నుంచి హైదరాబాద్‌కు తరలిస్తుండగా నగర శివారుల్లోని యాదాద్రి జిల్లా పతంగి టోల్‌ ప్లాజా వద్ద సోదాలు నిర్వహించి స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.  

ఎలాంటి అనుమానం రాకుండా కారులో డ్యాష్‌ బోర్డులో బంగారాన్ని దాచారు.  స్వాధీనం చేసుకున్నదంతా విదేశీ బంగారమని అధికారులు తెలిపారు.  జర్మనీ, యూరోప్‌ దేశాలకు చెందిన బంగారంగా గుర్తించారు. మయన్మార్‌ నుంచి  గువాహటి మీదుగా హైదరాబాద్‌ తరలిస్తున్నట్లు ప్రాథమికంగా నిర్థరించారు.  ముగ్గురు నిందితులు ఉత్తరప్రదేశ్‌ వాసులుగా గుర్తించారు. హైదరాబాద్‌లోని బంగారం దుకాణాలకు చేరవేసేందుకు పసిడి తెస్తున్నట్లుగా గుర్తించామని అధికారులు తెలిపారు

ఇదీ చదవండి: పాలేరు నుంచి బరిలో దిగుతా.. ఖమ్మం నేతలతో షర్మిల

Last Updated : Mar 24, 2021, 5:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.