ETV Bharat / crime

suicide: మహిళా వాలంటీర్‌ హత్య కేసు నిందితుడు ఆత్మహత్య

author img

By

Published : May 19, 2022, 1:03 PM IST

SUICIDE: వివాహేతర సంబంధం నేపథ్యంలో ఈ నెల 15న ఏపీలోని బాపట్ల జిల్లాలో హత్యకు గురైన వాలంటీర్​ హత్య కేసులో నిందితుడిగా ఉన్న పద్మారావు ఆత్మహత్య చేసుకున్నాడు. నిడుబ్రోలు రైల్వే స్టేషన్​లో రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

suicide: మహిళా వాలంటీర్‌ హత్య కేసు నిందితుడు ఆత్మహత్య
suicide: మహిళా వాలంటీర్‌ హత్య కేసు నిందితుడు ఆత్మహత్య

SUICIDE: ఆంధ్రప్రదేశ్​లోని బాపట్ల జిల్లా వేమూరు మండలం చావలిలో వాలంటీర్‌ శారద(27) హత్య కేసులో నిందితుడిగా ఉన్న పద్మారావు(35) ఆత్మహత్య చేసుకున్నాడు. పొన్నూరు పట్టణంలోని నిడుబ్రోలు రైల్వేస్టేషన్‌లో తిరుపతి నుంచి విశాఖ వెళ్తున్న డబుల్ డెక్కర్ రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. అతని జేబులో ఉన్న కార్డుల ఆధారంగా పోలీసులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న కుటుంబీకులు.. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి పద్మారావుగా గుర్తించారు. వాలంటీర్‌ హత్యకు సంబంధించి మనస్తాపంతోనే పద్మారావు ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

అసలేం జరిగిందంటే..? చావలి గ్రామానికి చెందిన శారదను అదే గ్రామానికి చెందిన వ్యక్తికి ఇచ్చి 2008లో వివాహం చేశారు. వీరికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. శారద స్థానికంగా వాలంటీర్‌గా పని చేసేది. అదే గ్రామానికి చెందిన ఎం.పద్మారావుతో ఆమెకు నాలుగేళ్ల క్రితం ఏర్పడిన పరిచయం.. సాన్నిహిత్యానికి దారి తీసింది. 6 నెలల క్రితం ఆమె ప్రవర్తనను అనుమానించిన పద్మారావు సచివాలయం వద్ద ఆమెపై చేయి చేసుకున్నాడు. ఆ విషయంపై అప్పట్లో సచివాలయం మహిళా పోలీస్‌ వేమూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అతడిని మందలించి వదిలేశారు. ఈ నేపథ్యంలో శారదపై ద్వేషం పెంచుకున్న పద్మారావు.. ఈ నెల 15న సాయంత్రం ఆమె ఇంటి ముందు శుభ్రం చేస్తున్న సమయంలో కత్తితో దాడి చేశాడు. తప్పించుకోబోయిన ఆమెను కొద్దిదూరం వెంటబడి మెడపై కోసి ద్విచక్ర వాహనంపై పరారయ్యాడు. ఆమె ఘటనా స్థలంలోనే మృతి చెందింది. ఈ ఘటన తర్వాత పద్మారావు పరారీలో ఉన్నాడు. ఈ తెల్లవారుజామున రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇవీ చదవండి..:

మహిళా వాలంటీర్​ దారుణ హత్య.. కారణమదేనా..?

దొంగ బాబా నిర్వాకం.. మంచి జరుగుతుందంటూ యువతి కాళ్లు, చేతులను నిప్పులపై పెట్టి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.