ETV Bharat / city

'అంగవైకల్యం కలగకుండా పోలియో చుక్కలు వేయించాలి'

author img

By

Published : Jan 31, 2021, 3:25 PM IST

అప్పుడే పుట్టిన చిన్నారుల నుంచి ఐదేళ్ల లోపు పిల్లలందరికీ బాధ్యతగా వారి తల్లిదండ్రులు పోలియో చుక్కలు వేయించాలని నిజామాబాద్​ కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని అర్బన్ హెల్త్ సెంటర్​లో పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

Nizamabad  Collector said that children must be vaccinated against polio
'అంగవైకల్యం కలగకుండా పిల్లలకు పోలియో చుక్కులు వేయించాలి'

భవిష్యత్​లో పిల్లలు అంగ వైకల్యంతో బాధ పడకూడదంటే వారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని నిజామాబాద్​ జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అన్నారు. ఈ మేరకు జిల్లాలోని దుబ్బ ప్రాంతంలో గల అర్బన్ హెల్త్ సెంటర్​లో ఏర్పాటు చేసిన పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

అప్పుడే పుట్టిన చిన్నారుల నుంచి ఐదేళ్ల లోపు పిల్లలందరికీ బాధ్యతగా వారి తల్లిదండ్రులు పోలియో చుక్కలు వేయించాలని కలెక్టర్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఈ సారి జిల్లాలో 1.83 లక్షల మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయడాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని తెలిపారు. ఇందుకు గాను 1700 కేంద్రాలు ఏర్పాటు చేశామన్న కలెక్టర్ సుమారు 4300 మంది సిబ్బంది ఈ విధులలో పాల్గొంటున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుదర్శనం, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి శివశంకర్, హెల్త్ ఎడ్యుకేటర్ వేణుగోపాల్, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: ట్రామాకేర్ సెంటర్‌గా శామీర్‌పేట్ ఆస్పత్రి : ఈటల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.