ETV Bharat / city

'అగ్నిపథ్‌'పై హైదరాబాద్ ఆగ్రహం.. రణరంగంలా సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్​

author img

By

Published : Jun 17, 2022, 10:11 AM IST

Updated : Jun 17, 2022, 12:23 PM IST

agnipath scheme
agnipath scheme

agnipath scheme : కేంద్ర సర్కార్ తీసుకొచ్చిన కొత్త సర్వీస్ అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ ఆందోళన సెగ ఇవాళ హైదరాబాద్‌ను తాకింది. అగ్నిపథ్‌ను రద్దు చేయాలంటూ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో యువకులు ఆందోళన చేపట్టారు. మరోవైపు అగ్నిపథ్ పథకంపై స్పందిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. కేంద్ర సర్కార్‌.. అప్పుడేమో రైతులను ఇబ్బంది పెట్టి.. ఇప్పుడు సైనికులను గందరగోళానికి గురిచేస్తోందని మండిపడ్డారు.

భాగ్యనగరానికి 'అగ్నిపథ్' సెగ

agnipath scheme : సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ సర్వీసును దేశవ్యాప్తంగా వ్యతిరేకిస్తుండగా... ఆ నిరసన సెగ ఇప్పుడు హైదరాబాద్‌కు తాకింది. అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తూ... సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో నిరసనకారులు ఆందోళనకు దిగారు. రైలు బోగిలకు నిప్పుపెట్టడంతోపాటు... స్టేషన్‌ బయట ఉన్న ఆర్టీసీ బస్సులపై దాడులు చేశారు. ఆందోళనకారుల నిరసనలతో... సికింద్రాబాద్ ప్రాంగణం అట్టుడికిపోయింది.

agnipath scheme
భాగ్యనగరానికి 'అగ్నిపథ్' సెగ

అగ్నిపథ్‌ గురించి ప్రకటన వచ్చినప్పటి నుంచి ఆందోళనకారులు నిరసనకు ప్రణాళిక వేసినట్లు తెలిసింది. తెలంగాణలో వివిధ జిల్లాల నుంచి యువకులు రాత్రే హైదరాబాద్‌ వచ్చినట్లు సమాచారం. వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా సమాచారాన్ని ఆందోనకారులు యువతకు చేరవేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. జిల్లాల వారీగా ఆందోనకారులు వాట్సాప్ గ్రూప్‌లు ఏర్పాటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో నిరసనకు ఆందోళనకారులు నిన్న రాత్రే వచ్చినట్లు వెల్లడించారు. స్టేషన్ బయట ఓ బస్సు అద్దాలు పగుల గొట్టి.. ఉదయం 9 గంటల వేళ ఒక్కసారిగా స్టేషన్లోకి దూసుకొచ్చినట్లు చెప్పారు.

agnipath scheme
అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా సికింద్రాబాద్‌లో యువత ఆందోళన

protest against agnipath scheme : కేంద్రం తీసుకొచ్చిన కొత్త సర్వీస్ అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. అగ్నిపథ్‌ను రద్దు చేయాలంటూ ఇప్పుడు హైదరాబాద్‌లోనూ నిరసనకారులు గళమెత్తారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకున్న ఆందోళనకారులు... రైలుకు నిప్పుపెట్టి నిరసన తెలిపారు. సికింద్రాబాద్‌ నుంచి బయల్దేరే ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌కు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఒక్కసారిగా యువకులు ఆందోళనకు దిగడంతో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

అంతకముందు రైలు పట్టాలపై పార్సిల్ సామాన్లను కాల్చివేసి... నిరసన తెలిపారు. ఒక్కసారిగా రైలు పట్టాలపై చేరి కేంద్రసర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. అగ్నిపథ్‌ను రద్దు చేసి యథావిధిగా నియామక ప్రక్రియ కొనసాగించాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేశారు. నిరసనకారుల నినాదాలతో రైల్వేస్టేషన్‌ ప్రాంగణం హోరెత్తింది.

agnipath scheme
భాగ్యనగరానికి 'అగ్నిపథ్' సెగ

మరోవైపు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ బయట ఉన్న ఆర్టీసీ బస్సులను నిరసనకారులు ధ్వంసం చేశారు. రైల్వేస్టేషన్‌లో లోపలికి చొచ్చుకెళ్లి ఫ్లాట్‌ఫారమ్ మీద ఉన్న రైళ్లపై రాళ్లు విసిరారు. పట్టాల మధ్యలో నిప్పు పెట్టారు. దీంతో ప్రయాణికులు రైళ్లను వదిలి పరుగులు పెట్టారు. రైళ్లన్నింటినీ నిలిపివేసిన అధికారులు.. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు రైల్వే పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. అగ్నిపథ్ రద్దు చేసి ఆర్మీ పరీక్షలు యధాతథంగా నిర్వహించాలని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. అగ్నిపథ్‌ను రద్దు చేసి వెంటనే నియామకప్రక్రియ యథాతథంగా కొనసాగించాలంటూ నిరుద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు.

  • The violent protests against #AgniveerScheme is an eye-opener & acute indicator of the magnitude of unemployment crisis in the country

    Pehle Desh ke Kisan Ke Saath खिलवाड़ Aur Ab Desh ke Jawan Ke Saath खिलवाड़

    From One Rank - One Pension to proposed No Rank - No Pension!

    — KTR (@KTRTRS) June 17, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అగ్నిపథ్‌ పథకానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు దేశంలో ఉన్న నిరుద్యోగతకు నిదర్శనమని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా విమర్శించారు. తొలుత రైతులను ఇబ్బంది పెట్టిన మోదీ సర్కార్‌... ఇప్పుడు సైనికులను గందరగోళ పరుస్తోందని ఆరోపించారు. వన్‌ ర్యాంక్‌-వన్‌ పెన్షన్‌ నుంచి నో ర్యాంక్‌- నో పెన్షన్‌ వరకు తీసుకొచ్చారని కేటీఆర్‌ దుయ్యబట్టారు.

Last Updated :Jun 17, 2022, 12:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.