ETV Bharat / city

Vice President Venkaiah Naidu tour: విశాఖలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటన

author img

By

Published : Nov 22, 2021, 8:50 AM IST

Venkaiah Naidu Visakha Tour‌
Venkaiah Naidu Visakha Tour‌

నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు(Vice President Visakha Tour‌) ఏపీలోని విశాఖకు చేరుకున్నారు. విశాఖ ఎయిర్ పోర్ట్​లో ఉపరాష్ట్రపతికి అధికారులు ఘనస్వాగతం పలికారు. నేడు విశాఖ నుంచి అరకుకు విస్టా డోమ్ కోచ్​లతో ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలును వెంకయ్యనాయుడు ప్రారంభించనున్నారు.

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు(Venkaiah Naidu Visakha Tour‌) నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ఏపీలోని విశాఖ చేరుకున్నారు. విశాఖ ఎయిర్ పోర్ట్​లో జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం విశాఖ పోర్ట్ అతిథి గృహంలో బస చేశారు. నేడు అరకు వెళ్లే పర్యాటకుల కోసం విశాఖ నుంచి అరకుకు విస్టా డోమ్ కోచ్​లతో ప్రత్యేక రైలును వెంకయ్యనాయుడు ప్రారంభించనున్నారు.

ఉదయం 11 గంటలకు విశాఖ రైల్వే స్టేషన్​లో ఒకటో నెంబర్ ప్లాట్ ఫారం మీద గల విస్టా డోమ్ కోచ్​లతో కూడిన ప్రత్యేక రైలును ఉపరాష్ట్రపతి(Vice President Visakha Tour‌) ప్రారంభించనున్నారు. ఈ ప్రత్యేక రైలు సింహాచలం, కొత్తవలస, ఎస్.కోట, బొర్రా స్టేషన్​లలో ఆగనుంది. తిరిగి అరకు నుంచి మధ్యాహ్నం 3.30 గంటలకు బయలుదేరి సాయంత్రం 6.45 గంటలకు విశాఖ చేరుతుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.