ETV Bharat / city

Restrictions in Hyderabad: న్యూ ఇయర్​ సెలబ్రేషన్స్​కు సిద్ధమవుతున్నారా.. అయితే ఇవి మీకోసం!

author img

By

Published : Dec 31, 2021, 8:16 PM IST

New Year Restrictions in Hyderabad:
New Year Restrictions in Hyderabad:

New Year Restrictions in Hyderabad: కొత్త సంవత్సరానికి ఉత్సాహంగా స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారా? అయితే... ఈ నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందే. నూతన సంవత్సర వేడుకలపై హైదరాబాద్​, రాచకొండ, సైబరాబాద్​ కమిషనరేట్ల​ పోలీసులు ఆంక్షలు విధించారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు. ఓఆర్​ఆర్​పై కార్లకు అనుమతి నిరాకరించారు. పలు ప్రాంతాల్లో పైవంతెనలు మూసివేస్తున్నట్లు ప్రకటించగా.. కొన్ని చోట్ల దారి మళ్లించినట్లు చెప్పారు.

హైదరాబాద్​ కమిషనరేట్​ పరిధిలో పోలీసుల ఆంక్షలు..

  • రాత్రి 11 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్​ బండ్, నెక్లెస్​ రోడ్​ రహదారులు మూసివేత
  • నెక్లెస్​రోడ్​, ఎన్టీఆర్​ మార్గ్​ నుంచి వచ్చే వాహనాలు ఖైరతాబాద్, రాజ్​భవన్​ రోడ్​ మీదుగా మళ్లింపు
  • బీఆర్కే భవన్​ నుంచి ఎన్టీఆర్​ మార్గ్​ వైపు నుంచి వచ్చే వాహనాలు ఇక్బాల్ మినార్ మీదుగా లక్డీకపూల్​ వైపు మళ్లింపు
  • లిబర్టీ నుంచి వచ్చే వాహనాలకు అప్పర్​ ట్యాంక్​ బండ్​కు అనుమతి లేదు. అంబేడ్కర్​ విగ్రహం మీదుగా లక్డీకపూల్​ వెళ్లాలని సూచన
  • మింట్​ కాంపౌండ్​ రోడ్డు మూసివేత
  • నల్లగుట్ట రైల్వే వంతెన మీదుగా సంజీవయ్య పార్కు వైపు వచ్చే వాహనాలు కర్బాల మైదానం వైపు మళ్లింపు
  • సికింద్రాబాద్ నుంచి వచ్చే వాహనాలు సెయిలింగ్ క్లబ్ వద్ద మళ్లించి కవాడిగూడ, లోయర్​ట్యాంక్​ బండ్, అశోక్​నగర్, ఆర్టీసీ క్రాస్​ రోడ్​ వైపు మళ్లింపు
  • బేగంపేట పైవంతెన మినహా అన్ని వంతెనలు మూసివేత
  • ట్రావెల్​ బస్సులు, లారీలు నగరంలోకి అనుమతి నిరాకరణ

రాచకొండ కమిషనరేట్​ పరిధిలో పోలీసుల ఆంక్షలు

  • సాధ్యమైనంత వరకూ ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచన
  • డిసెంబర్ 31 రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఓఆర్‌ఆర్​పై కార్లకు అనుమతి నిరాకరణ. కేవలం లారీలు, గూడ్స్ వాహనాలకు మాత్రమే అనుమతి
  • విమానాశ్రయాలకు ఓఆర్​ఆర్​పై వెళ్లేవారు వారు టికెట్లు చూపిస్తేనే అనుమతి
  • రాచకొండ పరిధిలో ఉన్న అన్ని పైవంతెనలు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5గంటల వరకు మూసివేత
  • క్యాబ్, డ్రైవర్లు యూనిఫారం ధరించాలి
  • రాత్రి వేళల్లో క్యాబ్​ బుక్​చేస్తే క్యాన్సిల్​ చేయకూడదు. చేస్తే రూ.500 జరిమానా
  • 9490617111కి వాట్సాప్ ద్వారా ఈ తరహా ఫిర్యాదు చేయవచ్చు
  • బార్లు, పబ్బులు, క్లబ్బుల నుంచి బయటకు వచ్చిన కస్టమర్లు తాగివాహనం నడపకుండా చూసే పూర్తి బాధ్యత యజమానులదే. వారికోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
  • రాచకొండ కమిషనరేట్​ పరిధిలో డిసెంబర్​ 31 రాత్రి.. ప్రతి చోటా డ్రంక్​ అండ్​ డ్రైవ్​ తనిఖీలు
  • వేడుకల్లో డీజేలకు అనుమతి నిరాకరణ
  • ట్రాఫిక్​ వైలేషన్​కు పాల్పడితే.. డ్రైవింగ్ లైసెన్స్​ రద్దు

సైబరాబాద్ కమిషనరేట్​ పరిధిలో పోలీసుల ఆంక్షలు

  • అన్ని పైవంతెలు మూసివేత
  • రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఓఆర్ఆర్​పై కార్లకు అనుమతి నిరాకరణ
  • సైబరాబాద్​ పరిధిలో 200 చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
  • విధుల్లో సుమారు 2 వేల మంది పోలీసులు
  • శబ్ద కాలుష్యానికి పాల్పడితే కమాండ్​ కంట్రోల్​ వద్ద వాహనాలను గుర్తించి జరిమానా
  • ప్రమాదకరంగా వాహనాలు నడిపితే కఠిన చర్యలు
  • నిబంధనలు తెలిసీ.. అతిక్రమిస్తే జైలు శిక్ష
  • పబ్, బార్ల యజమానులకు మార్గదర్శకాలు
  • ట్రాఫిక్​ అంతరాయానికి కారణమైతే చట్టపరమైన చర్యలు

ఇవీచూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.