ETV Bharat / city

Top news: టాప్ న్యూస్ @ 9PM

author img

By

Published : Jul 10, 2022, 8:58 PM IST

Top news
టాప్ న్యూస్

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

  • 'తెలంగాణ సర్కార్​ ఇంజిన్​ సూపర్​ స్పీడ్​

CM KCR Comments on Modi: కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీపై సీఎం కేసీఆర్​.. తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రధాని మోదీ.. దేశంలో అవివేక, అసమర్థ పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. ప్రస్తుతం దేశంలో అప్రకటిత అత్యయిక పరిస్థితి నడుస్తోందని కేసీఆర్‌ స్పష్టం చేశారు. సర్కారు నడుపుతున్నారా?.. గూండాయిజం చలాయిస్తున్నారా? అని నిలదీశారు.

  • 'మరో నాలుగైదు రోజులు జర పైలం..'

CM KCR on Heavy Rains in Telangana: రాష్ట్రంలో మరో 4, 5 రోజులు భారీ నుంచి అతిభారీ వర్ష సూచన ఉందని.. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్​ సూచించారు. దయచేసి పిల్లలు, యువకులు బయటకు వెళ్లొద్దని సూచించారు. రాష్ట్రంలో ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. జనసంచారం తగ్గించేందుకు 3 రోజులపాటు అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించామని తెలిపారు.

  • మూడు రోజులు సెలవులు

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రేపటి నుంచే మూడు రోజుల పాటు అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. వర్షాలపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. సోమ, మంగళ, బుధవారాల్లో అన్ని విద్యాసంస్థలకు సెలవు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.

  • హిమాయ‌త్ సాగ‌ర్, ఉస్మాన్‌సాగ‌ర్‌ నుంచి నీటి విడుదల

3 రోజులుగా కురుస్తున్న భారీవర్షాలతో హైదరాబాద్ జంట జలాశయాలకు ప్రవాహం పెరిగింది. ఎగువ నుంచి వస్తున్న వరదనీటితో హిమాయ‌త్ సాగ‌ర్, ఉస్మాన్‌సాగ‌ర్‌ జలాశయాలు కళకళలాడుతున్నాయి. వరద తీవ్రత పెరిగి అవకాశం ఉన్నందున అప్రమత్తమైన అధికారులు రెండు జలాశయాల గేట్లు ఎత్తి మూసీలోకి నీటి విడుదల ప్రారంభించారు. మూసీలోకి వరద ప్రవాహం పెరగడంతో లోతట్టు ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

  • ఉద్యమం పేరుతో మోసం చేశారు

Revanthreddy On CM KCR: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడంతో పాటు భారీ ఎత్తున ఆస్తులను కూడబెట్టారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ఉద్యమం చేశానని ప్రజలను కేసీఆర్ మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్​లోని ప్రెస్​క్లబ్​లో టీజేఏసీ ఛైర్మన్, ప్రొఫెసర్​ పురుషోత్తం రచించిన 'డాలి అండ్ చేదునిజం' పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

  • పోలీసుల అదుపులో మాజీ ఇన్​స్పెక్టర్ నాగేశ్వరరావు

అత్యాచారం ఆరోపణలతో సస్పెండైన మారేడ్‌పల్లి మాజీ ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వరరావును అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. బాధితురాలి ఫిర్యాదు, సాంకేతిక ఆధారాలను సరిపోల్చిన వనస్థలిపురం పోలీసులు ఆయనను ఎల్బీనగర్ ఎస్‌వోటీ కార్యాలయంలో విచారిస్తున్నారు.

  • ఘనంగా ఏకాదశి, బక్రీద్ వేడుకలు

దేశంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. ముస్లింలు భక్తిశ్రద్ధలతో బక్రీద్‌ పర్వదినాన్ని జరుపుకొంటున్నారు. ఈద్‌ ఉల్ అదా సందర్భంగా మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మరోవైపు, తొలి ఏకాదశిని పురస్కరించుకొని భక్తులు.. దేవాలయాలకు పోటెత్తారు. ఈ పండగల సందర్భంగా రాష్ట్రపతి, ప్రధాని, పలువురు రాజకీయ నాయకులు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

  • 'నేను జయలలిత సోదరుడ్ని.. ఆస్తిలో సగం వాటా నాదే'.

Jayalalitha Brother Vasudevan: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు తాను సోదరుడినని పేర్కొంటూ కర్ణాటకకు చెందిన ఓ వృద్ధుడు కోర్టు మెట్లెక్కారు. ఆమె ఆస్తిలో సగం వాటా తనకు ఇవ్వాలని మద్రాసు హైకోర్టులో పిటిషన్​ దాఖలు వేశారు.

  • 'సినీ పరిశ్రమకు భూతంలా 'ఓటీటీ''

Raghavendra Rao OTT: ప్రస్తుత రోజుల్లో థియేటర్లకు ప్రజలను రప్పించడం చాలా కష్టమవుతోందని అన్నారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. సినీ పరిశ్రమ పాలిట ఓటీటీ ఓ భూతంగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. తాను సమర్పించిన 'పండుగాడ్'​ చిత్ర టీజర్​ను విడుదల చేశారు.

  • డైనోసర్‌లా 'పంత్‌'.. ఐసీసీ సర్​ప్రైజ్​!

ICC Promo Panth Video: తనదైన శైలిలో బ్యాట్​తో అదరగొడుతున్న టీమ్​ఇండియా బ్యాటర్​ రిషభ్​ పంత్​కు అరుదైన గౌరవం దక్కింది. ఐసీసీ రిలీజ్​ చేసిన 2022 టీ20 వరల్డ్​కప్​ ప్రోమోలో పంత్​ను​ డైనోసర్​లా పైకి లేచి వస్తున్నట్లు చూపించింది. అభిమానులకు తెగ నచ్చేస్తున్న ఆ వీడియోను మీరూ చూసేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.