ETV Bharat / city

'మరో నాలుగైదు రోజులు అతిభారీ వర్షాలున్నాయి.. జర పైలం..'

author img

By

Published : Jul 10, 2022, 6:51 PM IST

Updated : Jul 10, 2022, 7:56 PM IST

CM KCR on Heavy Rains in Telangana: రాష్ట్రంలో మరో 4, 5 రోజులు భారీ నుంచి అతిభారీ వర్ష సూచన ఉందని.. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్​ సూచించారు. దయచేసి పిల్లలు, యువకులు బయటకు వెళ్లొద్దని సూచించారు. రాష్ట్రంలో ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. జనసంచారం తగ్గించేందుకు 3 రోజులపాటు అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించామని తెలిపారు.

CM KCR Request to people about Heavy Rains in Telangana
CM KCR Request to people about Heavy Rains in Telangana

CM KCR on Heavy Rains in Telangana: భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఉంటుందన్నారు. అధికారులు, పోలీసులతో సమీక్ష సమావేశం నిర్వహించిన అనంతరం సీఎం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మరో 4, 5 రోజులు భారీ నుంచి అతిభారీ వర్ష సూచన ఉందని సీఎం తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. దయచేసి పిల్లలు, యువకులు బయటకు వెళ్లొద్దని సూచించారు. ఎలాంటి సాహసాలు చేయొద్దని సీఎం విజ్ఞప్తి తెలిపారు. జనసంచారం తగ్గించేందుకు 3 రోజులపాటు అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించామని స్పష్టం చేశారు. సహాయ చర్యల కోసం హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచామన్నారు.

"రోడ్లు, కల్వర్టులపై నీరు ప్రవహిస్తుంటే కొంత మంది సాహసాలు చేస్తుంటారు. అలాంటివి చేయెద్దు. కల్వర్టులపై వరద ఉంటే బస్సులు నడపవద్దని ఆర్టీసీ ఆధికారులకు చెప్పాం. రాష్ట్రంలో శిథిలావస్థకు చేరిన చాలా ఇళ్లను కూలగొట్టాం.. మరికొన్ని కోర్టు స్టేలతో ఆగిపోయాయి. జనసంచారం తగ్గించేందుకు విద్యాశాఖ సూచనల మేరకు మూడు రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాం. మంత్రులు, ప్రజాప్రతినిధులు నియోజకవర్గాల్లోనే అందుబాటులో ఉండి రక్షణ చర్యలు చేపట్టాలని సూచించాం. సచివాలయం, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌శాఖ, జీహెచ్‌ఎంసీలో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశాం. అత్యవసరమైతే కాల్‌ సెంటర్లకు ఫోన్‌ చేస్తే వెంటనే అధికారులు స్పందిస్తారు. గ్రామాల్లో ప్రజలు ఎవరి జాగ్రత్తలు వాళ్లు పాటించాలి." - సీఎం కేసీఆర్‌

'మరో నాలుగైదు రోజులు అతిభారీ వర్షాలున్నాయి.. జర పైలం..'

ఇవీ చూడండి:

Last Updated :Jul 10, 2022, 7:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.