ETV Bharat / state

Revanthreddy On CM KCR: ఉద్యమం పేరుతో ఆస్తులు కూడబెట్టుకున్నారు: రేవంత్

author img

By

Published : Jul 10, 2022, 7:57 PM IST

Revanthreddy On CM KCR: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడంతో పాటు భారీ ఎత్తున ఆస్తులను కూడబెట్టారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ఉద్యమం చేశానని ప్రజలను కేసీఆర్ మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్​లోని ప్రెస్​క్లబ్​లో టీజేఏసీ ఛైర్మన్, ప్రొఫెసర్​ పురుషోత్తం రచించిన 'డాలి అండ్ చేదునిజం' పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

Revanthreddy On CM KCR
ఉద్యమం పేరుతో ఆస్తులు కూడబెట్టుకున్నారు: రేవంత్

Revanthreddy On CM KCR: కేసీఆర్ తెలంగాణ ఉద్యమం నిజం లాంటి అబద్ధమని టీపీసీసీ రేవంత్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలను మోసం చేసి ఉద్యమం పేరుతో రాజకీయాలు చేసిన కేసీఆర్‌.. ఆస్తులు కూడబెట్టుకున్నారని ఆరోపించారు. హైదరాబాద్​లోని ప్రెస్​క్లబ్​లో టీజేఏసీ ఛైర్మన్, ప్రొఫెసర్​ పురుషోత్తం రచించిన 'డాలి అండ్ చేదునిజం' పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీతో కలిసి పాల్గొన్నారు.

నాడు నిజాం కూడా విద్య, వైద్యం, సకల సౌకర్యాలు కల్పించినా కూడా తెలంగాణ ప్రజలు స్వేచ్ఛను కోరుకున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. ఆంధ్ర పాలకులు కూడా తెలంగాణ సంక్షేమ పథకాలు చేపట్టినా.. అణచివేతకు ఎదురు తిరిగారని వివరించారు. ఇప్పడు కేసీఆర్ రైతు బంధు, కల్యాణ లక్ష్మి, పెన్షన్లు ఇస్తున్నామంటే ప్రజలు ఒప్పుకోరని పేర్కొన్నారు. వాటి కోసం తెలంగాణ ప్రజలు ఉద్యమం చేయలేదని స్పష్టం చేశారు.

కేసీఆర్​ ఎప్పుడు మాట్లాడినా డబుల్ బెడ్ రూమ్, దళితులకు మూడెకరాల భూమి, కల్యాణ లక్ష్మి, రైతు వేదికలు కట్టించినా చెబుతున్నారు. నిజాం పాలకుల కంటే, ఉమ్మడి పాలకుల కంటే కేసీఆర్ అదనంగా​ ఇచ్చింది ఏం లేదు. రాష్ట్ర ఆదాయం పెరిగినందుకే పింఛన్లు, ఉచిత కరెంట్, ఆరోగ్య శ్రీ పెంచినవ్. అంతేగానీ ఇళ్లకోసం, పింఛన్ల కోసం 1200 మంది యువత చావాల్సిన అవసరముందా? ఆయన పిల్లలేమో రాజ్యాలు ఏలాలే.. మన పిల్లలేమో గొర్రెలు, బర్రెలు కాసుకోవాలా?.

- రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

ఎస్సీని సీఎం చేస్తానన్న కేసీఆర్.. ఆయన ముఖ్యమంత్రి అయ్యారని ఎద్దేవా చేశారు. అరశాతం ఉన్నోళ్లంతా క్యాబినెట్‌లో ఉంటే.. 16 శాతంగా ఉన్న ఎస్సీలకు కేబినెట్‌లో చోటు ఎక్కడ ఉందని ప్రశ్నించారు. సీఐ నాగేశ్వరరావు కేసును తప్పుదోవ పట్టించే కుట్ర జరుగుతోందని రేవంత్ ఆరోపించారు. ఆ అమ్మాయి మీద వ్యభిచారం కేసు పెట్టేందుకు కుట్ర చేస్తున్నట్లు తనకు తెలిసిందన్నారు. సీఐ నాగేశ్వరరావు కేసీఆర్‌ కుటుంబానికి ఎంతో సన్నిహితుడని.. రాడిసన్‌ బ్లూ పబ్‌ విరాలన్ని ఆ సీఐ దగ్గరనే ఉన్నాయని ఆరోపించారు. దీంతో యువరాజు చిట్టా బయట పడుతుందని.. దానిని అడ్డుపెట్టుకుని కేసును నీరుగార్చేందుకు యత్నిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

ఉద్యమం పేరుతో ఆస్తులు కూడబెట్టుకున్నారు: రేవంత్

ఇవీ చదవండి: హిమాయ‌త్ సాగ‌ర్, ఉస్మాన్‌సాగ‌ర్‌ నుంచి నీటి విడుదల

కాస్ట్​లీ మామిడి తోటలో దొంగలు.. సూపర్​ డాగ్స్​ సెక్యూరిటీ వృథా.. లక్షలు నష్టం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.