ETV Bharat / city

Top News: టాప్ న్యూస్ @ 7PM

author img

By

Published : May 24, 2022, 7:00 PM IST

Top News
టాప్ న్యూస్ @ 7PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

  • అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తత

ఏపీలోని కోనసీమ జిల్లా అమలాపురం గడియారం స్తంభం సెంటర్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జిల్లా పేరు మార్చవద్దంటూ కోనసీమ జిల్లా సాధన సమితి ఆందోళన చేపట్టింది. 'కోనసీమ జిల్లా ముద్దు.. వేరే పేరు వద్దు' అంటూ వందలాది యువకులు నినాదాలు చేశారు.

  • మోదీ ​ పర్యటన.. ట్రాఫిక్​ ఆంక్షలివే..

Traffic Restrictions In PM Tour: హైదరాబాద్​లో ప్రధాని మోదీ పర్యటన దృష్ట్యా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని పర్యటించే మార్గంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గచ్చిబౌలిలోని ఐఎస్‌బీ వార్షికోత్సవానికి ప్రధాని హాజరు కానున్నారు.

  • 'కేసీఆర్​ చెక్కులపై నాకు డౌటనుమానమే!!'

Bandi Sanjay Comments: రేపు కరీంనగర్​లో నిర్వహించబోయే హిందూ ఏకతా యాత్ర ఏర్పాట్లను బండి సంజయ్ పరిశీలించారు. రెండేళ్ల తర్వాత యాత్ర నిర్వహిస్తున్న దృష్ట్యా జిల్లాలోని హిందువులంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. పంజాబ్​ రైతులు సీఎం కేసీఆర్​ చెక్కులు ఇవ్వటంపై స్పందించిన బండి సంజయ్​.. వ్యంగ్యారోపణలు చేశారు.

  • 'అమ్మాయికి బాక్సింగ్ ఎందుకన్నారు.. ఇప్పుడు జేజేలు కొడుతున్నారు'

Nikhat Zareen Interview: ప్రపంచ ఛాంపియన్​గా అవతరించి సంచలనం సృష్టించింది తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్. ఒలింపిక్స్​లో భారత్​కు పతకం తేవడమే తన లక్ష్యమంటోంది. అయితే బాక్సర్ కావాలని కలలుకన్న నిఖత్ ప్రయాణం అంత సాఫీగా ఏం సాగలేదు. ఆమె విజయంలో తండ్రిదే కీలకపాత్ర. చిన్ననాటి నుంచి నిఖత్ బాక్సింగ్ జర్నీపై ఆమె తండ్రి మాటల్లో..

  • రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ట్రోగ్రత ఎక్కడంటే..!

రాష్ట్రంలో మండుతున్న ఎండలు.. ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. భానుడి భగభగలతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. వడగాల్పుల భయంతో బయటకు రావాలంటేనే జంకుతున్నారు. పగటిపూటే కాదు రాత్రి ఉష్ణోగ్రతలూ అసాధారణంగా పెరుగుతున్నాయి.

  • అక్షరాలతో చిత్రం.. ఆనంద్ మహీంద్ర ఫిదా..

Anand Mahindra Tamil portrait: తమిళనాడుకు చెందిన ఓ యువకుడు ఆనంద్ మహీంద్రాను మంత్రముగ్ధుడ్ని చేశాడు. చూడచక్కని బొమ్మలు గీసే అతడు.. ఇటీవల ఆనంద్ మహీంద్ర చిత్రాన్ని తమిళ అక్షరాలతో రూపొందించాడు. దీన్ని చూసిన ఆనంద్ మహీంద్ర.. చిత్ర పటాన్ని తన ఇంట్లో పెట్టుకుంటానని చెప్పారు.

  • కానిస్టేబుల్​ను కాల్చి చంపిన ఉగ్రవాదులు..

constable death: జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఓ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయాడు. అతని ఏడేళ్ల కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

  • ఫోన్ కొట్టేశాడని.. లారీకి కట్టేసి..

మొబైల్ ఫోన్ దొంగిలించాడనే కారణంతో ఓ వ్యక్తి పట్ల పైశాచికంగా ప్రవర్తించారు లారీ డ్రైవర్లు. అతని మెడలో చెప్పుల దండ వేసి, లారీ ముందుభాగంలో తాళ్లతో కట్టేశారు.

  • సిబిల్ స్కోర్ ఎంత ఉంటే బెటర్?

Cibil score: రుణం మంజూరు చేయాలంటే బ్యాంకులు సిబిల్​ స్కోర్​ను పరిగణిస్తాయి.​ ఒకవేళ సిబిల్​ స్కోర్​ తక్కువ ఉంటే వారికి లోన్​ రావడం కష్టం అవుతుంది. మరి ఇంతకీ సిబిల్​ స్కోర్ ఎంత ఉండాలి? ఈ క్రెడిట్​ స్కోరును ఎలా పెంచుకోవాలి?

  • 'నాగేశ్వరరావు'గా చైతూ..!

శంకర్​తో చేస్తున్న సినిమాలో రామ్​చరణ్​ నటిస్తున్నది ద్విపాత్రాభినయంలో కాదని త్రిపాత్రాభినయం అని జోరుగా ప్రచారం సాగుతోంది. మరోవైపు పరశురామ్​-నాగచైతన్య సినిమా టైటిల్​ ఖరారు అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ వివరాలు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.