ETV Bharat / state

'కేసీఆర్​ ఇచ్చిన చెక్కులు అసలు చెల్లుతాయా..? నాకు డౌటనుమానమే!!'

author img

By

Published : May 24, 2022, 6:08 PM IST

Bandi Sanjay Comments: రేపు కరీంనగర్​లో నిర్వహించబోయే హిందూ ఏకతా యాత్ర ఏర్పాట్లను బండి సంజయ్ పరిశీలించారు. రెండేళ్ల తర్వాత యాత్ర నిర్వహిస్తున్న దృష్ట్యా జిల్లాలోని హిందువులంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. పంజాబ్​ రైతులు సీఎం కేసీఆర్​ చెక్కులు ఇవ్వటంపై స్పందించిన బండి సంజయ్​.. వ్యంగ్యారోపణలు చేశారు.

bjp state president bandi sanjay satirical comments on cm kcr cheques distribution to punjab farmers
bjp state president bandi sanjay satirical comments on cm kcr cheques distribution to punjab farmers

'కేసీఆర్​ ఇచ్చిన చెక్కులు అసలు చెల్లుతాయా..? నాకు డౌటనుమానమే..!!'

Bandi Sanjay Comments: పంజాబ్‌ రైతులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన చెక్కులు చెల్లుతాయో..? లేదో..? అనుమానంగానే ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ వ్యంగ్యారోపణలు చేశారు. రాష్ట్రంలోని ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో సర్కారు ఉందని బండి సంజయ్​ ఆరోపించారు. రేపు కరీంనగర్​లో నిర్వహించబోయే హిందూ ఏకతా యాత్ర ఏర్పాట్లను బండి సంజయ్ పరిశీలించారు. రెండేళ్ల తర్వాత యాత్ర నిర్వహిస్తున్న దృష్ట్యా జిల్లాలోని హిందువులంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

తెరాస నాయకులు జైహనుమాన్ అంటున్నారంటే అది కేవలం భాజపా వల్లే అన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. సీఎం కేసీఆర్‌కు రాష్ట్రాన్ని అభివృద్ది చేయాలన్న ఆలోచనే లేదని.. కేవలం పేరు ప్రఖ్యాతుల కోసం పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. గరీబ్ కల్యాణ్‌ యోజన కింద సెప్టెంబర్ వరకు కేంద్రం ఉచితంగా బియ్యం సరఫరా చేస్తుంటే.. ఇక్కడ కిలోకు ఒక్క రూపాయి వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం సహకరించడం లేదని చెప్పుకోవడమే తప్ప.. రాష్ట్రానికి కేసీఆర్‌ చేసిందేమీ లేదని బండి సంజయ్‌ ఆరోపించారు.

"రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రగతిభవన్​ నుంచో.. ఫాంహౌస్​ నుంచో బయటకు రావటమే పెద్ద సంచలనం. వేరే సంచలనమేమీ లేదు. పంజాబ్​ వెళ్లి చెక్కులిచ్చారు. అవి చెల్లుతాయో లేదోనని భయపడతున్నారు. ఇక్కడ రాష్ట్రం ఆత్మహత్యల తెలంగాణగా మారింది. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కొనుగోళ్లు ప్రారంభం కాక.. ధాన్యం రోడ్ల మీదే ఉంది. యువకులు ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్ని ఏం పట్టించుకోకుండా.. ఇక్కడేదో ఉద్దరించానని వేరే రాష్ట్రాలకు వెళ్తున్నారు. వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్లింది అన్న చందంగా ఉంది కేసీఆర్​ పర్యటన." - బండి సంజయ్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.