ETV Bharat / bharat

ప్రపంచ రికార్డ్​.. 11కి.మీ పొడవైన వస్త్రం.. అమ్మవారికి సమర్పించిన సీఎం

author img

By

Published : May 24, 2022, 4:24 PM IST

Longest chunari: 300 మంది మహిళలు 11 కిలోమీటర్ల పొడవైన వస్త్రాన్ని తయారుచేసి రికార్డు సృష్టించారు. అత్యంత పొడవైన వస్త్రంగా గోల్డెన్​ బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో చోటు దక్కింది. ఈ వస్త్రాన్ని సీఎం భూపేశ్ భఘేల్ దంతేశ్వరి అమ్మవారికి సమర్పించారు.

వస్త్రం
వస్త్రం

Longest chunari: ఛత్తీస్​గఢ్​ దంతేవాడకు చెందిన మహిళలు 11 కిలోమీటర్ల పొడవు ఉన్న వస్త్రాన్ని తయారు చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు. దంతేవాడలోని డెనెక్స్​ అనే టెక్స్​టైల్​ ఫ్యాక్టరీకి చెందిన మహిళలు ఈ వస్త్రాన్ని రూపొందించారు. ఈ వస్త్రాన్ని.. ముఖ్యమంత్రి భూపేశ్​ భఘేల్​ చేతుల మీదుగా స్థానికంగా ఉన్న దంతేశ్వరి ఆలయానికి సమర్పించారు. ఇదివరకు మధ్యప్రదేశ్​లోని మందసూర్​ నర్మదా మైయా ఆలయానికి అక్కడి ప్రజలు 8 కిలోమీటర్ల పొడవు ఉన్న వస్త్రాన్ని సమర్పించారు. తాజాగా దీనిని బద్దలు కొట్టి సరికొత్త రికార్డును నెలకొల్పారు దంతేవాడ మహిళలు. గోల్డెన్​ బుక్​ ఆఫ్​ వరల్డ్​ రికార్డ్​లో దీనికి చోటు దక్కింది.

Longest chunari
11 కిలోమీటర్లు పొడవు గల వస్త్రం
Longest chunari
అమ్మవారికి వస్త్రాన్ని సమర్పిస్తున్న సీఎం

శోభాయత్ర..: ప్రత్యేకంగా రూపొందించిన ఈ వస్త్రానికి ఆదివారం శోభాయత్ర నిర్వహించారు స్థానికులు. డెనెక్స్​ ఫ్యాక్టరీకి చెందిన 300 మంది మహిళలు కేవలం ఏడు రోజుల్లో రూపొందించిన ఈ వస్త్రాన్ని దంతేవాడ పట్టణంలో 11 కిలోమీటర్లు ఊరేగించారు. ఇది చూసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. మంగళవారం.. దంతేవాడకు చేరుకున్న ముఖ్యమంత్రి భుపేశ్​ భఘేల్​ ఆ వస్త్రాన్ని అమ్మవారికి సమర్పించారు.

మహిళలకు ఉపాధి కల్పనే లక్ష్యంగా డెనెక్స్​ పేరుతో 2021 జనవరి 31న వస్త్ర పరిశ్రమను ప్రారంభించారు సీఎం. ఈ క్రమంలో ఇప్పటివరకు 500 మందికిపైగా మహిళలకు ఉపాధి లభిస్తోంది. 1200లకుపైగా కుటుంబాలకు ఉపాధిని కల్పించడమే లక్ష్యంగా ఈ సంస్థ కృషి చేస్తోందని అధికారులు వెల్లడించారు.

Longest chunari
గోల్డెన్​ బుక్​ ఆఫ్ వరల్డ్​​ రికార్డ్స్ అవార్డును ​అందుకుంటున్న ముఖ్యమంత్రి

ఇదీ చూడండి : కాంగ్రెస్​ కోసం 'టాస్క్​ఫోర్స్​'.. మూడు బృందాలతో ఎన్నికలకు రెడీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.