Top News: టాప్ న్యూస్​ @5PM

author img

By

Published : May 13, 2022, 4:54 PM IST

టాప్ న్యూస్​

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

  • బండి సంజయ్‌పై మంత్రి కేటీఆర్​ పరువు నష్టం దావా..

బండి సంజయ్‌పై కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. న్యాయవాది చేత బండి సంజయ్‌కి నోటీసులు పంపించారు.

  • కాంగ్రెస్​కు 'లీకుల' భయం.. 'చింతన్ శిబిర్​'లో ఫోన్లు బ్యాన్!

పార్టీ నేతలంతా తమ అభిప్రాయాలను నిక్కచ్చిగా చెప్పాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పిలుపునిచ్చారు. చింతన్ శిబిర్ సమావేశాల సందర్భంగా ప్రారంభోపన్యాసం చేసిన సోనియా.. మోదీ పాలన కొనసాగితే... భవిష్యత్​లో తీవ్ర పరిణామాలు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

  • పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై ఈ నెల 18న సీఎం సమీక్ష

CM Review Meeting: ఈనెల 18న ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్​ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరగనుంది. రాష్ట్రంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై మంత్రి వర్గం, అధికారులతో కేసీఆర్‌ చర్చించనున్నారు.

  • 'పబ్​లు, బార్​ల యజమానులు బాధ్యతాయుతంగా మెలగాలి.. లేకపోతే..'

హైదరాబాద్​ బంజారాహిల్స్‌లోని ఫుడింగ్​ అండ్‌ మింక్‌ పబ్‌ వ్యవహారం నేపథ్యంలో నగర కమిషనర్‌ సీవీ ఆనంద్‌ నగరంలోని పబ్‌, బార్‌, డ్రైవ్‌ ఇన్‌ రెస్టారెంట్ల యజమాన్యాలతో సమావేశం నిర్వహించారు. పబ్‌, బార్‌, డ్రవ్‌ ఇన్‌ రెస్టారెంట్ల యజమానులు బాధ్యతాయుతంగా మెలగాలని సీపీ హెచ్చరించారు.

  • 'డబ్బులు ఇమ్మని కరాటే కల్యాణి బెదిరించింది.. ఇవ్వనంటే కొట్టింది..'

కరాటే కల్యాణి, యూట్యూబర్​ శ్రీకాంత్​రెడ్డి మధ్య జరిగిన దాడి వివాదం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. శ్రీకాంత్​రెడ్డి చేసే వీడియోలపై అభ్యంతరం వ్యక్తం చేసిన కల్యాణి.. అతడి ఇంటి వద్దకు వెళ్లి నిలదీయటంతో.. ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది.

  • బ్యాంకులో నగదు మాయం కేసు.. క్యాషియర్ ప్రవీణ్ వాహనం గుర్తింపు

Bank Of Baroda Cashier case: వనస్థలిపురం బ్యాంక్​ ఆఫ్​ బరోడాలో నగదు మాయం కేసులో నిందితుడిగా ఉన్న క్యాషియర్​ ప్రవీణ్​ బైక్​ను పోలీసులు గుర్తించారు. నాలుగు రోజులుగా కనిపించకుండా పోయిన ప్రవీణ్​ కోసం పోలీసులు గాలిస్తుండగా.. నల్గొండ జిల్లా చిట్యాల వద్ద ప్రవీణ్​ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

  • 'జ్ఞాన్​వాపీ కేసుతో భయంగా ఉంది'.. కుటుంబ భద్రతపై జడ్జి ఆందోళన

Gyan vapi case: జ్ఞాన్​వాపీ కేసు విచారణ చేపడుతున్న న్యాయమూర్తి జస్టిస్​ రవికుమార్​ దివాకర్​ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు భయానక వాతావరణాన్ని నెలకొల్పిందని, దీంతో తన కుటుంబసభ్యుల భద్రతపై ఆందోళన కలుగుతోందని వ్యాఖ్యానించారు.

  • మరో బాంబు పేల్చిన మస్క్- ట్విట్టర్ డీల్​కు బ్రేక్​!

Elon Musk Twitter deal: ట్విట్టర్​ కొనుగోలుకు సంబంధించి వ్యాపార దిగ్గజం ఎలాన్ మస్క్.. మరో కీలక ప్రకటన చేశారు. ట్విట్టర్​లో ఫేక్​ అకౌంట్ల లెక్కపై స్పష్టత వచ్చే వరకు ఈ డీల్​ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు చెప్పారు.

  • స్టేట్​ బ్యాంక్​కు లాభాల సునామీ

SBI profit 2022: భారతీయ స్టేట్ బ్యాంక్​కు లాభాల పంట పండింది. నాలుగో త్రైమాసికంలో ఎస్​బీఐ ఏకంగా రూ.9,114 కోట్లు లాభం ఆర్జించింది. అంతకుముందు ఏడాదితో పోల్చితే ఇది 41శాతం అధికం కావడం విశేషం.

  • పింక్‌ చుడిదార్‌లో బొద్దుగా కత్రినా.. ప్రెగ్నెంట్​ అయ్యిందంటూ..!

బాలీవుడ్​ బ్యూటీ కత్రినా కైఫ్‌ గర్భవతి అంటూ మరోసారి వార్తలు చక్కర్లు కొడతున్నాయి. తాజాగా ఆమె కనిపించిన తీరు.. ఆ అనుమానాలకు మరింత బలం చేకూర్చింది. అయితే ఈ వార్తలపై కత్రినా టీమ్​ ఏమన్నదంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.