'జ్ఞాన్​వాపీ కేసుతో భయంగా ఉంది'.. కుటుంబ భద్రతపై జడ్జి ఆందోళన

author img

By

Published : May 13, 2022, 4:16 PM IST

Updated : May 13, 2022, 4:52 PM IST

d

Gyan vapi case: జ్ఞాన్​వాపీ కేసు విచారణ చేపడుతున్న న్యాయమూర్తి జస్టిస్​ రవికుమార్​ దివాకర్​ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు భయానక వాతావరణాన్ని నెలకొల్పిందని, దీంతో తన కుటుంబసభ్యుల భద్రతపై ఆందోళన కలుగుతోందని వ్యాఖ్యానించారు. మరోవైపు, జ్ఞాన్​వాపీ మసీదు ప్రాంతంలో సర్వేపై స్టే విధించాలన్న విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది.

Gyan vapi case: జ్ఞాన్​వాపీ మసీదు, శృంగార్​ గౌరీ ప్రాంగణంలో సర్వే చేపట్టాల్సిందేనని స్పష్టం చేస్తూ ఆదేశించిన సివిల్​ జడ్డ్ జస్టిస్​​ రవికుమార్​ దివాకర్​ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సివిల్​ కేసును కీలకమైన అంశంగా మారడం వల్ల భయానక వాతావరణం నెలకొందన్నారు. దీని వల్ల తన కుటుంబసభ్యుల భద్రతపై ఆందోళన కలుగుతోందని పేర్కొన్నారు. సర్వేకు నియమితులైన అడ్వకేట్​ కమిషనర్​ను మార్చాలని దాఖలైన పిటిషన్​పై గురువారం జరిగిన విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ పిటిషన్​ను జస్టిస్​ రవికుమార్​ తిరస్కరించారు.

"ఈ కేసు కీలకంగా మారడం వల్ల భయానక వాతావరణం నెలకొంది. నేను నా కుటుంబం గురించి.. వాళ్లు నా గురించి ఆందోళన చెందే స్థాయికి ఈ పరిస్థితి చేరింది. నేను ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టిన ప్రతిసారి నా భార్య నా గురించి కంగారు పడుతోంది. నిన్న నేను మా అమ్మతో మాట్లడినప్పుడు కూడా తను నా గురించి ఆందోళన చెందుతున్నట్లు కనిపించింది. నేను కూడా కమిషనర్​గా సర్వేకు వెళ్లే అవకాశం ఉంటుందని మీడియా కథనాల ద్వారా ఆమె తెలుసుకుంది. నేను అక్కడికి వెళ్లకూడదని.. అది క్షేమం కాదని సూచించింది."
-జస్టిస్ రవి కుమార్​ దివాకర్, సివిల్​ జడ్జ్​

స్టేకు నో: ఉత్తరప్రదేశ్‌ వారణాసిలోని జ్ఞాన్‌వాపీ మసీదు, శృంగార్‌ గౌరీ ఆలయ ప్రాంగణంలో సర్వేపై స్టే విధిస్తూ తాత్కాలిక ఆదేశాలు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ముస్లింల తరపున దాఖలైన పిటిషన్‌ను పరిశీలించిన జస్టిస్ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం.. దీనిని విచారణ జాబితాలో ఉంచే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపింది. ఈ పిటిషన్‌ను తాను చదవాల్సి ఉందని జస్టిస్‌ ఎన్‌వీ రమణ స్పష్టం చేశారు.

జ్ఞాన్‌వాపీ మసీదు, శృంగార్‌ గౌరీ ఆలయ ప్రాంగణంలో ప్రస్తుతం ఏడాదికి ఒక్కసారి మాత్రమే పూజలకు అనుమతి ఇస్తున్నారు. నిత్య పూజలు చేసుకునేందుకు అనుమతించాలని కోరుతూ దిల్లీకి చెందిన మహిళలు వారణాసి జిల్లా కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ఈనెల 17లోగా సర్వే పూర్తి చేయాలని గురువారమే ఆదేశించింది.

ఇదీ చూడండి : కాంగ్రెస్​కు 'లీకుల' భయం.. 'చింతన్ శిబిర్​'లో ఫోన్లు బ్యాన్!

Last Updated :May 13, 2022, 4:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.