మరో బాంబు పేల్చిన మస్క్- ట్విట్టర్ డీల్​కు బ్రేక్​!

author img

By

Published : May 13, 2022, 3:44 PM IST

Updated : May 13, 2022, 3:55 PM IST

elon musk twitter deal

Elon Musk Twitter deal: ట్విట్టర్​ కొనుగోలుకు సంబంధించి వ్యాపార దిగ్గజం ఎలాన్ మస్క్.. మరో కీలక ప్రకటన చేశారు. ట్విట్టర్​లో ఫేక్​ అకౌంట్ల లెక్కపై స్పష్టత వచ్చే వరకు ఈ డీల్​ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు చెప్పారు.

Elon Musk Twitter deal: టెస్లా గ్రూప్-ట్విట్టర్​ డీల్​కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. టెస్లా అధినేత, దిగ్గజ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ స్వయంగా ఈ విషయం వెల్లడించారు. ట్విట్టర్​లో స్పామ్​/ఫేక్​ ఖాతాలు మొత్తం యూజర్ల సంఖ్యలో 5శాతంకన్నా తక్కువ ఉన్నాయన్న లెక్కలపై మరింత స్పష్టత వచ్చేవరకు ట్విట్టర్​ కొనుగోలు ప్రక్రియను హోల్డ్​లో పెడుతున్నట్లు ట్వీట్ చేశారు.

ట్విట్టర్​ డీల్​పై స్టే ప్రకటనతోపాటు.. ఫేక్ ఖాతాల లెక్కలపై ఓ కథనాన్ని పోస్ట్ చేశారు మస్క్. ప్రస్తుతం సంస్థకు ఉన్న యూజర్లు, వాటిలో ఫేక్​ ఖాతాలకు సంబంధించి అమెరికాలోని స్టాక్​మార్కెట్లకు ట్విట్టర్ సోమవారం​ సమర్పించిన నివేదికలోని వివరాలు అందులో ఉన్నాయి. "ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 229 మిలియన్ యూజర్లకు యాడ్​లు పంపి, ఆదాయం ఆర్జించాం. ఫేక్​ లేదా స్పామ్ అకౌంట్ల సంఖ్య.. రోజువారీ యాక్టివ్ యూజర్ల సంఖ్యలో 5శాతంకన్నా తక్కువే ఉంది. మస్క్​తో డీల్ పూర్తయ్యే వరకు ట్విట్టర్​కు అనేక సవాళ్లు పొంచి ఉన్నాయి. మా భవిష్యత్​ ప్రణాళికలపై అనిశ్చితి దృష్ట్యా అడ్వర్టైజర్లు ట్విట్టర్​కు ఇంకా యాడ్​లు ఇస్తారా లేదా అనే విషయాలపై స్పష్టత లేదు" అని రెగ్యులేటరీ ఫైలింగ్​లో పేర్కొంది ట్విట్టర్.

44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్​ను కొనుగోలు చేసేందుకు ఇటీవలే ఆ సంస్థలో ఒప్పందం చేసుకున్నారు ఎలాన్ మస్క్. భావ ప్రకటనా స్వేచ్ఛకు పెద్ద పీట వేసేలా ఆ సామాజిక మాధ్యమంలో కీలక మార్పులు చేయనున్నట్లు సంకేతాలిచ్చారు. ముఖ్యంగా.. ట్విట్టర్​ నుంచి స్పామ్ బాట్స్​ను పూర్తిగా నిర్మూలించడం తన ప్రాధాన్యాల్లో ఒకటని ఓసారి ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో స్పామ్​/ఫేక్ ఖాతాలపై ట్విట్టర్​ లెక్కలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ.. డీల్​ను తాత్కాలికంగా హోల్డ్​లో పెట్టారు మస్క్.

Last Updated :May 13, 2022, 3:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.