ETV Bharat / city

Telangana News Today: టాప్​న్యూస్ @ 1PM

author img

By

Published : Aug 10, 2022, 12:58 PM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

1pm
1pm

  • చైనాలో మరో కొత్త వైరస్..

చైనాలో మరో కొత్తవైరస్ వెలుగులోకి వచ్చింది. జంతువుల నుంచి సోకే హెనిపావైరస్ కేసులు షాంగ్‌డాంగ్‌, హెనాన్‌ ప్రావిన్స్‌ల్లో వెలుగులోకి వచ్చాయి. ఈ వైరస్ నివారణకు టీకాలు లేవు.

  • ప్రేమికులు అనే ముద్ర.. తట్టుకోలేక యువతి, యువకుడు ఆత్మహత్యాయత్నం..

ఓ యువతి, యువకుడు కొంచె చనువుగా మెలిగితే చాలు.. ప్రేమికులు అనే సందేహం వస్తోంది. అంతేందుకు అన్నా చెల్లెలు బైక్‌పై వెళ్లినా... ఈ సోసైటీ లవర్స్‌ అంటూ ట్యాగ్‌ ఇచ్చేస్తారు. అయితే వీటిని చాలా మంది లైట్ తీసుకున్నా... సున్నిత మనస్కులు తీసుకోలేరు. ఇలాంటి ఘటనే నిజామాబాద్‌లో చోటుచేసుకుంది.

  • క్రికెట్‌ ఆడుతూ కుప్పకూలిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి..

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లో క్రికెట్‌ ఆడుతూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి చెందాడు. సన్‌సిటీ ఎస్‌బీఐ మైదానంలో క్రికెట్‌ ఆడుతూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కుప్పకూలాడు. వెంటనే స్థానికులు ఆయన్ను సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు.

  • విమాన టికెట్లతో పోటీ పడుతున్న క్యాబ్‌ ఛార్జీలు

హైదరాబాద్​లో క్యాబ్‌ ఛార్జీలను చూస్తే ప్రయాణికులు హడలెత్తిపోతున్నారు. విమానాశ్రయానికి వెళ్లాలంటే రూ. వేలల్లో చెల్లించాల్సి వస్తోంది. వర్షం పడిన సమయంలో క్యాబ్‌ సంస్థలు ప్రయాణికుల నుంచి ఛార్జీల పేరుతో ఇష్టారీతిన దండుకుంటున్నాయి.

  • కంట్లో ఆరు అంగుళాల కత్తి..

కంట్లో నుంచి ఆరు అంగుళాల కత్తిని వైద్యులు బయటకు తీశారు. అతి క్లిష్టమైన సర్జరీ విజయవంతంగా పూర్తి చేసి ప్రశంసలు అందుకుంటున్నారు. మహారాష్ట్రలోని ధూలేలో ఈ ఘటన జరిగింది.

  • అజాతశత్రువు... వెంకయ్య నాయుడు!

ఉపరాష్ట్రపతిగా, రాజ్య సభాధ్యక్షులుగా దీక్షాదక్షతలు కనబరచి నేడు అన్ని పక్షాల ప్రశంసలకు పాత్రులవుతున్నారు వెంకయ్య నాయుడు. ఉపరాష్ట్రపతిగా ఆయన పదవీ కాలం నేటితో ముగుస్తుండటంతో- 'ఒక మంచి మనిషి నిష్క్రమిస్తున్నారు' అన్న బాధాతప్త భావన పార్టీలకు అతీతంగా అందరిలో గూడు కట్టుకుంది.

  • స్థిరంగా బంగారం.. తగ్గిన వెండి ధర..

దేశంలో బంగారం ధర స్థిరంగా ఉంది. వెండి ధర స్వల్పంగా పడిపోయింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పది గ్రాముల పసిడి, కిలో వెండి ధరలు ఎంత ఉన్నాయంటే?

  • దాదా, అజారుద్దీన్​ కాంట్రవర్సీ ట్వీట్స్​..

కామన్వెల్త్​ గేమ్స్​ ఫైనల్స్​లో ఓడి రజతంతో సరిపెట్టుకున్న భారత మహిళా క్రికెట్​ జట్టు ప్రదర్శనపై కాంట్రవర్సీ కామెంట్స్​ చేశారు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, మరో మాజీ క్రికెటర్​ మహ్మద్​ అజారుద్దీన్. దీంతో వారిద్దరిపై నెటిజన్లు మండిపడుతున్నారు.

  • అప్పుడు సామ్​ అలా.. ఇప్పుడు చైతూ ఇలా..

నాగచైతన్య తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఓ విషయాన్ని బయటపెట్టారు. ఈ వ్యాఖ్యలతో సమంతపై ఆయనకు ఇంకా ప్రేమ తగ్గలేదా అనే అనుమానం అభిమానుల్లో కలుగుతోంది.

  • ఆండ్రాయిడ్, యాపిల్.. ఫోన్ ఏదైనా ఒకటే ఛార్జర్! కేంద్రం కొత్త రూల్స్​!!

'సన్న పిన్​ ఛార్జర్​ ఉందా?'.. 10-15ఏళ్ల క్రితం బాగా వినిపించిన మాట. ఇప్పుడు కూడా పెద్దగా ఏం మారలేదు. ఐఫోన్​ ఛార్జర్​ ఉందా? సీ-పోర్ట్ ఛార్జర్ ఉందా? అంటూ మన ఫోన్​కు సరిపోయే ఛార్జర్ కోసం వెతుక్కోవాల్సిందే. అలా కాకుండా అన్ని ఫోన్స్​కూ ఒకటే ఛార్జర్ పనిచేస్తే? ఈ ప్రశ్నకు జవాబు వెతికే పనిలో ఉంది కేంద్రప్రభుత్వం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.