ETV Bharat / city

Sekhar Kammula : 'లవ్​స్టోరీ సినిమా తీయడానికి వాళ్లే ప్రధాన కారణం'

author img

By

Published : Nov 14, 2021, 1:05 PM IST

పిల్లలపై లైంగిక వేధింపుల(sexual harassment of children) గురించి మాట్లాడ్డానికి ఎవరూ ధైర్యం చేయరని.. అది చాలా సంక్లిష్టమైన అంశమని టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల(Tollywood director sekhar kammula) అన్నారు. అందుకే ఇలాంటి అంశాన్నే ప్రధానంగా తీసుకుని తాను లవ్​స్టోరీ(Love Story) సినిమా తీశానని చెప్పారు. తాను ఈ చిత్రం తీయడానికి ప్రధాన కారణం పిల్లలేనని తెలిపారు. వారు పడుతున్న క్షోభ అందరికీ తెలియాలని.. వాళ్ల కోసం మనమంతా ఉన్నామని చెప్పడానికి ఈ మూవీ ఉపయోగపడిందన్నారు. ఈ సినిమా చూసి చాలా మంది తాము ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకోవడానికి ధైర్యంగా ముందడుగేస్తున్నారని వెల్లడించారు.

Sekhar Kammula
Sekhar Kammula

లవ్​స్టోరీ సినిమా(Love story movie) తీయడానికి ప్రధాన కారణం పిల్లలే అని టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల(Tollywood director sekhar kammula) అన్నారు. పిల్లల పట్ల జరుగుతున్న లైంగిక వేధింపులే(child abuse) తనను ఆ సినిమా తీయడానికి ప్రేరేపించాయని తెలిపారు. తన సినిమా ద్వారా చాలా మంది తాము ఎదుర్కొన్న, ఎదుర్కొంటున్న విషయాలను బయటకు చెప్పగలిగారని హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి సమస్యను సినిమాగా తీయడం చాలా కష్టమని.. కానీ ఆ విషయంలో తాను సక్సెస్ అయ్యానని చెప్పారు.

బాలల దినోత్సవం(Children's day 2021) సందర్భంగా హైదరాబాద్ ప్రెస్​క్లబ్​లో లర్నింగ్ స్పేస్ ఫౌండేషన్​(learning space foundation) ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి డైరెక్టర్ శేఖర్ కమ్ముల(director sekhar kammula) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిల్డ్రన్ సేఫ్టీ ప్లెడ్జ్​(children's safety pledge)ను ఆవిష్కరించారు. పిల్లల భద్రతపై లర్నింగ్ స్పేస్ ఫౌండేషన్ చేపడుతున్న కార్యక్రమాలను అభినందించారు. ఇలాంటి సంక్లిష్టమైన విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా వివరిస్తున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు.

చిన్నారుల భద్రత(child safety) చాలా ముఖ్యమని శేఖర్ కమ్ముల(director sekhar kammula) అన్నారు. వారికి సురక్షితమైన వాతావరణాన్ని కల్పించాలని చెప్పారు. పిల్లలపై లైంగిక వేధింపుల సమస్యపై అవగాహన కల్పించేందుకు సినిమా మంచి మార్గమని తెలిపారు. కానీ.. ఇలాంటి సమస్య సినిమాగా తీయడం చాలా కష్టమని.. తాను ఆ విషయంలో సక్సెస్ అయ్యానన్నారు. లైంగిక వేధింపులు(sexual harassment) అమ్మాయిలకే కాదని.. అబ్బాయిల(sexual abuse on boys)పై కూడా పెరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయని వెల్లడించారు.

"పిల్లలపై లైంగిక వేధింపులు సర్వసాధారణమయ్యాయి. వేధింపులు పిల్లల జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. మానసికంగా వారిని చాలా కుంగదీస్తాయి. నేను లవ్​స్టోరీ సినిమా తీశాక.. చాలా పాఠశాలలకు వెళ్లాను. అక్కడ చాలా మంది విద్యార్థులతో మాట్లాడాను. 100లో 70 శాతం పిల్లలు లైంగిక వేధింపులకు గురవుతున్నారని తెలిసి చాలా బాధేసింది. ఇలా వేధింపులకు గురవుతున్న వారు.. ఎవరికి తెలియాలో చెప్పక.. చెబితే ఏమంటారోనని భయపడుతూ.. వారిలోనే మథనపడుతున్నారు. కొన్నిసార్లు ఇంట్లో వాళ్లకి చెప్పినా.. వారు నమ్మకపోవడం.. సపోర్ట్ చేయకపోవడం వల్ల ఇంకా మానసిక వేదనకు గురవుతున్నారు."

- శేఖర్ కమ్ముల, టాలీవుడ్ డైరెక్టర్

పిల్లలు ఎప్పటిలా హుషారుగా లేకపోతే ఏమైందోనని తల్లిదండ్రులు ఆరా తీయాలని శేఖర్ కమ్ముల(director sekhar kammula) చెప్పారు. వారి మనసులో ఉన్న మాట పంచుకునేలా అమ్మానాన్న.. ఇంట్లో వాతావరణం సృష్టించాలని అన్నారు. పిల్లలు చెప్పిన మాటలు విని.. మేమున్నాం మీకేం కాదని భరోసానివ్వడమే కాదు.. ఆ భరోసా నిజమనేలా సురక్షితమైన వాతావరణాన్ని అందించాలని సూచించారు.

"నేను పాఠశాలలకు వెళ్లినప్పుడు ఇలాంటి చేదుఅనుభవాలు ఎదుర్కొన్న పిల్లలు బయటకు చెప్పడానికి ముందుకు రాలేదు. నువ్వే ధీరా అనే పేరుతో ఓ ప్లే చేశాం. ఎవరైతే తమ భయాన్ని వీడి వాళ్లు ఎదుర్కొన్న ఇబ్బందులు చెబుతారో వాళ్లే హీరో అని ఒక అట్మాస్పియర్ క్రియేట్ చేశాం. అలా చెప్పగానే.. చాలా మంది పిల్లలు వారికి ఎదురైన చేదు అనుభవాల(sexual abuse)ను మాతో పంచుకున్నారు. ఇంట్లో వాళ్లకి చెప్పాలంటే భయంగా ఉందన్నారు. వారికి మేం ధైర్యం చెప్పాం. వాళ్ల తల్లిదండ్రులతో మాట్లాడి.. ఇంట్లో వాళ్లతో ప్రతి విషయం పంచుకునే పరిస్థితులు కల్పించాలని చెప్పాం. ఎప్పుడు ఎవరి నుంచి వేధింపులు ఎదురవుతాయో చెప్పలేని దుస్థితి ఉంది. అందుకే పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్​కు ఉన్న తేడా వివరించాలని.. ఎవరైనా తమతో అసభ్యంగా ప్రవర్తించినా.. లైంగికంగా(sexual harassment) వేధించినా.. ముందు తల్లిదండ్రులకు చెప్పేలా వారిలో ధైర్యం నింపాలని చెప్పాం."

- శేఖర్ కమ్ముల, టాలీవుడ్ డైరెక్టర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.