ETV Bharat / city

బాబోయ్​ పులి.. వణికిపోతున్న విజయనగరం జిల్లా ప్రజలు

author img

By

Published : Sep 18, 2022, 10:18 PM IST

బాబోయ్​ పులి.. వణికిపోతున్న విజయనగరం జిల్లా ప్రజలు
బాబోయ్​ పులి.. వణికిపోతున్న విజయనగరం జిల్లా ప్రజలు

Tiger Roaming in Vizianagaram District: ఏపీలోని విజయనగరం జిల్లాలో పులి సంచరిస్తోంది. ఉదయం పూట కూలీకి వెళ్లినవారు.. పులి పాదాల గుర్తులు చూసి భయంతో ఇళ్లకెళ్లిపోయారు. విషయం తెలుసుకుని అటవీశాఖ అధికారులు అక్కడకు చేరుకుని పులి పాదముద్రల నమూనాలు సేకరించి.. రాత్రిపూట ఎవరూ బయటకు రావొద్దని హెచ్చరించారు.

Tiger Roaming in Vizianagaram District: ఆంధ్రప్రదేశ్​లోని విజయనగరం జిల్లా బొబ్బిలి పారిశ్రామికవాడలో పులి సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. పారిశ్రామికవాడ పంప్​హౌస్ సమీపంలోని మెట్టవలస, భోజరాజుపురం ప్రాంతంలో పులి పాదముద్రికలు బయటపడ్డాయి. దీంతో కూలీలు, క్వారీల్లో పనిచేసే కార్మికులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే వారు వెనుదిరిగి ఇంటికి వెళ్లిపోయారు. సమాచారం తెలుసుకున్న ఆటవీ శాఖ అధికారులు.. ఘటనా స్థలానికి చేరుకుని పాదముద్రల నమూనాలు సేకరించారు.

స్థానికులు అనవసరంగా బయటకు రావొద్దని అధికారులు అవగాహన కల్పించారు. రాత్రి పూట బయటకు వెళ్లకూడదని.. తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఇవీ చదవండి:

తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు.. 26 మందిపై కేసు.. నలుగురు అదుపులోకి..

వాగు దాటుతూ ప్రవాహంలో కొట్టుకుపోయిన యువకుడు.. సెకన్లలో అదృశ్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.