వాగు దాటుతూ ప్రవాహంలో కొట్టుకుపోయిన యువకుడు.. సెకన్లలో అదృశ్యం

By

Published : Sep 18, 2022, 7:57 PM IST

thumbnail

ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటేందుకు ప్రయత్నించి ఓ యువకుడు ప్రవాహంలో కొట్టుకుపోయాడు. ఉత్తరాఖండ్​లోని హల్ద్వానీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సుమారు 6 గంటల సమయంలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న భాక్రా వాగును దాటేందుకు ప్రయత్నించాడు ఆ వ్యక్తి. ఒక్కసారిగా పట్టు కోల్పోయి ప్రవాహంతోపాటే కొట్టుకుపోయాడు. పోలీసుల సమాచారం ప్రకారం ఛర్యాల్ నాయక్ గ్రామానికి చెందిన​ 27 ఏళ్ల పంకజ్​ థాపా తన స్నేహితులతో కలిసి బన్సాయ్​ అనే గ్రామానికి బైక్​పై వెళ్లాడు. సుమారు ఆరుగంటల సమయంలో భాక్రా వాగును దాటేందుకు వారు ప్రయత్నిస్తుండగా, పంకజ్​ వాగులో పడిపోయాడు. స్నేహితులు ఎంత ప్రయాత్నించినా అతన్ని కాపాడలేకపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, వారు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. మూడు కిలోమీటర్ల మేర గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ యువకుడి ఆచూకీ లభించలేదని పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.