ETV Bharat / city

Chandrababu on Akhanda movie: '"అఖండ" చూశాను.. ఏపీ పరిస్థితులకు అద్దం పడుతోంది'

author img

By

Published : Dec 11, 2021, 5:58 PM IST

Chandrababu on Akhanda movie
అఖండ సినిమాపై చంద్రబాబు స్పందన

Chandrababu on Akhanda movie: నందమూరి బాలకృష్ణ నటించిన "అఖండ" సినిమా సాధించిన విజయంపై తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. తాను కూడా సినిమా చూశానని తెలిపారు. ఏపీలో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆ చిత్రం చూస్తే చాలని అన్నారు.

Chandrababu on Akhanda movie: ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయో "అఖండ" సినిమా చూస్తే అర్థమవుతుందని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకు.. ఈ సినిమా అద్దం పడుతోందని ఆయన అన్నారు.

CBN in Mangalagiri: మంగళగిరిలోని తెదేపా రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశం అనంతరం ఆయన.. మీడియా ప్రతినిధులతో కాసేపు ముచ్చటించారు. తాను కూడా "అఖండ" సినిమా చూశానని చంద్రబాబు వెల్లడించారు. అంతకుముందు జరిగిన సమావేశంలో ఓటీఎస్​పై ఆయన విమర్శలు గుప్పించారు.

ఇదీ చూడండి: YS Sharmila Deeksha: వరి వద్దన్న ముఖ్యమంత్రి మనకు వద్దు: వైఎస్​ షర్మిల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.