ETV Bharat / city

'ఎన్టీఆర్, పీవీపై భాజపా నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారు'

author img

By

Published : Nov 26, 2020, 4:09 PM IST

ఎన్టీఆర్​, పీవీ నరసింహారావుపై భాజపా నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్​.రమణ మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ఆ రెండు పార్టీలు జీహెచ్​ఎంసీ మేనిఫెస్టోలో హామీలివ్వడాన్ని తప్పుపట్టారు. ఇప్పటివరకు ఆ పనులన్నీ ఎందుకు చేయలేక పోయారని ఎల్​.రమణ ప్రశ్నించారు.

tdp-leader-lramana-comments-on-trs-bjp-and-mim-leaders
'ఎన్టీఆర్, పీవీపై భాజపా నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారు'

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో తెరాస, భాజపా, మజ్లిస్ పార్టీల నేతలు ప్రజల సమస్యలను విస్మరించి మాట్లాడుతున్నారని తెతెదేపా అధ్యక్షుడు ఎల్​.రమణ విమర్శించారు. ఓట్లు అడిగేందుకు మొహం చెల్లక కొత్త ప్రయోగాలు చేస్తున్నారని ఆయన అన్నారు. వరదలకు నగరం నీటమునిగితే... ఒక్కరు పట్టించుకోలేదన్నారు. దుబ్బాక ఫలితాలకు కేసీఆర్​కు నిజం తెలిసి రావడం వల్ల... 10 వేలు వరద సాయం ప్రకటించారన్నారు. అందులోనూ అక్రమాలకు పాల్పడ్డారని రమణ ఆరోపించారు. ప్రభుత్వానికి అనుగుణంగా ఈసీ ముందుకు వెళ్లిందని ఆయన పేర్కొన్నారు. ప్రజల మధ్య ఉండే అభ్యర్థులతో తెదేపా జీహెచ్​ఎంసీ ఎన్నికలకు వెళ్తుంటే, భాజపా, తెరాస, ఎంఐఎం నేరచరితులకు సీట్లు ఇచ్చిందన్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామన్న విషయాన్ని మరిచారని ఆయన మండిపడ్డారు. అక్బరుద్దీన్ మాటలు రజాకార్ల ప్రతినిధిలా ఉన్నాయన్నారు.

ఎన్టీఆర్​, పీవీ నరసింహారావుపై భాజపా నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎల్​.రమణ మండిపడ్డారు. ఎన్నిసార్లు చెప్పినా ఎన్టీఆర్​కు భారతరత్న ఇవ్వని భాజపా... ఇప్పుడు కపట ప్రేమ చూపుతోందన్నారు. ఎన్టీఆర్​ ఘాట్​ను కాపాడుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తామన్నారు. ఒకరు సర్జికల్ స్ట్రైక్ అంటారు.. మరొకరు విగ్రహాల మీద మాట్లాడతారు.. ప్రజలు విజ్ఞులు, చదువుకున్న వారని.. అనవసరంగా ఆవేశాలకు గురికారన్నారు. బండి సంజయ్ తీరులో మార్పు రావాలని.. ఇలాంటివి కేవలం తాత్కాలిక ప్రయోజనాలు మాత్రమే చేకూరుస్తాయన్నారు. కృష్ణా జలాలూ హైదరాబాద్​కు తెచ్చిన ఘనత తెదేపాదేనని ఎల్​.రమణ వివరించారు.

ఇవీ చూడండి: సొంత రాష్ట్రం నడుపుకునే సత్తా ఉందా అని అడిగారు: కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.