ETV Bharat / city

TSRTC: ఆర్టీసీ నంబర్‌తో ప్రైవేట్ బస్సు.. ఇన్ని రోజులు గుర్తించలేదా..?

author img

By

Published : Nov 4, 2021, 5:42 AM IST

tsrtc
tsrtc

ఒకే నంబర్‌తో మూడు, నాలుగు ప్రైవేట్ బస్సులు తిరగడం చూశాం. బస్సులపై సరైన పర్యవేక్షణ లేక, కొందరు పన్నులు ఎగవేసేందుకు అలా తిప్పుతుంటారు. కానీ... పూర్తిస్థాయిలో పర్యవేక్షణ ఉండే ఆర్టీసీలోనూ ఇలా జరుగుతుందంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆర్టీసీ బస్సు నంబర్‌తో ప్రైవేట్ బస్సు ఈవిధంగా తిరుగుతున్నా.. ఇన్ని రోజులు ఎవరూ గుర్తించలేదు. దీనిపై ఓ డిపో మేనేజర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది.

TSRTC: ఆర్టీసీ నంబర్‌తో ప్రైవేట్ బస్సు.. ఇన్ని రోజులు గుర్తించలేదా..?

ఒకే నంబరుతో రెండు బస్సులు తిరుగుతున్నాయి. అవి కూడా ఏ ప్రైవేటు సంస్థకు చెందినవో కావు. ఆర్టీసీ స్టిక్కర్లు వేసుకుని తిరుగుతున్న బస్సులు. TS-08-Z-0208 నంబరుతో గరుడ ప్లస్‌, ఎక్స్‌ప్రెస్‌ బస్సులు రాష్ట్రంలో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో గరుడ ప్లస్‌ ఆర్టీసీది కాగా... ఎక్స్‌ప్రెస్‌ బస్సు మాత్రం ఆర్టీసీకి చెందినది కాదని తెలుస్తోంది.

ఈ- చలాన్లతో విషయం వెలుగులోకి..

రోడ్డు రవాణ సంస్థ బస్సులను కొన్ని లక్షల కిలోమీటర్లు తిప్పిన తర్వాత వాటిని ప్రైవేట్ వారికి అమ్మేస్తారు. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలల వారికి విక్రయిస్తారు. అలా కొనుగోలు చేసిన వారెవరైనా ఈ విధంగా నడుపుతున్నారేమోనని ఆర్టీసీ యాజమాన్యం అనుమానం వ్యక్తంచేస్తోంది. TS-08-Z-0208 నంబరుతో రెండు బస్సులు తిరుగుతున్నాయని 15 రోజుల క్రితం హైదరాబాద్ -1 డిపో మేనేజర్... శంషాబాద్, అప్జల్ గంజ్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు విచారణ కూడా చేస్తున్నారు. ఐతే... ఈ విషయాలు ఇటీవల ఈ-చలాన్లతో బయటకు వచ్చాయి.

'ఆర్టీసీలో అలా జరగదే..!'

ప్రతి ఆర్టీసీ బస్సు డిపోలోకి వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు దానికి సంబంధించిన రికార్డులను లాగ్​బుక్‌లో నమోదు చేస్తారు. డిపోలోకి వెళ్లిన తర్వాత మెకానిక్, సూపర్ వైజర్, అసిస్టెంట్ ఇంజినీర్‌లు బస్సును పూర్తిగా పరిశీలిస్తారు. బస్​టైర్లు మార్చినప్పుడు, డీజిల్ పోయించినప్పుడు.... ఇలా ప్రతి సమయంలోనూ బస్సుకు ప్రతి కదలికలు నమోదు అవుతుంటాయని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. అందువల్ల ఒకే నంబరుతో రెండు బస్సులు నడిపే ప్రసక్తే ఉండదంటున్నారు.

ఆర్టీసీ బస్సును టికెట్ల ఆదాయంతో మాత్రమే చూస్తారు కానీ... కట్టే పన్నులతో చూడరని అధికారులు పేర్కొంటున్నారు. పూర్తి స్థాయిలో విచారిస్తే అసలు విషయాలు బయటకు వస్తాయని అభిప్రాయపడుతున్నారు.

ఇదీచూడండి: దీపావళికి జియో కొత్త స్మార్ట్​ఫోన్ రిలీజ్​- ఎప్పుడు, ఎక్కడ, ఎలా కొనాలి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.