ETV Bharat / city

రామాయపట్నం పోర్టు పనులు నవంబర్‌లో ప్రారంభిస్తాం: గౌతమ్ రెడ్డి

author img

By

Published : Jun 25, 2021, 8:16 AM IST

ఇండియన్ పోర్టుల బిల్లు-2020 ముసాయిదాలో ప్రతిపాదించిన నిబంధనలతో రాష్ట్ర హక్కులకు భంగం కలుగుతుందని ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్​రెడ్డి అభిప్రాయపడ్డారు. బిల్లులో ప్రతిపాదించిన కొన్ని అంశాలు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.

రామాయపట్నం పోర్టు పనులు నవంబర్‌లో ప్రారంభిస్తాం: గౌతమ్ రెడ్డి
రామాయపట్నం పోర్టు పనులు నవంబర్‌లో ప్రారంభిస్తాం: గౌతమ్ రెడ్డి

ఇండియన్ పోర్టుల (Ramayapatnam Port) ముసాయిదాపై.. ఏపీ ప్రభుత్వం అభ్యంతరం తెలిపిందని ఆ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి (Goutham reddy) స్పష్టం చేశారు. ముసాయిదా వల్ల రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని చెప్పారు. మైనర్‌ పోర్టుల నియంత్రణ కేంద్రం చేతిలోకి వెళ్లడం మంచిది కాదన్నారు. ఈ అంశంపై అధ్యయనానికి కేంద్రాన్ని సమయం కోరామని చెప్పారు. ఈ అంశంపై నిపుణుల కమిటీ నియమిస్తామని తెలిపారు.

రామాయపట్నం పోర్టు పనులు నవంబర్‌లో ప్రారంభిస్తాం: గౌతమ్ రెడ్డి

అవసరమైతే తీరప్రాంత రాష్ట్రాల మద్దతు తీసుకుని పోరాడతామని స్పష్టం చేశారు. మారిటైమ్ బోర్డుకు దీర్ఘకాలిక నిధులు కేటాయించాలని కేంద్రాన్ని కోరామని గౌతమ్‌రెడ్డి తెలిపారు. రామాయపట్నం పోర్టు పనులను నవంబర్‌లో ప్రారంభిస్తామని చెప్పారు. వచ్చే ఐదేళ్లలో 6 పోర్టులను అభివృద్ధి చేసుకోవాల్సి ఉందన్నారు.

ఇదీ చదవండి: నేటి నుంచి విధుల్లోకి ఉపాధ్యాయులు, అధ్యాపకులు

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.