ETV Bharat / city

అగ్నిపథ్‌ విషయంలో యువతను తప్పుదారి పట్టిస్తున్నారు: కిషన్‌రెడ్డి

author img

By

Published : Jun 17, 2022, 3:36 PM IST

Updated : Jun 17, 2022, 3:54 PM IST

Kishanreddy on Agnipath Protest: సుదీర్ఘ ఆలోచనలు, చర్చలు తర్వాత తీసుకొచ్చిన ‘అగ్నిపథ్‌’ విషయంలో యువతను తప్పుదారి పట్టించే ప్రయత్నం మంచిది కాదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సూచించారు. సికింద్రాబాద్‌లో పథకం ప్రకారమే కుట్ర చేసి విధ్వంసం సృష్టించారన్నారు. ప్రజల్లో దేశభక్తి, జాతీయ భావన పెంచే ప్రయత్నంలో భాగంగానే ‘అగ్నిపథ్‌’ను తీసుకొచ్చామని స్పష్టం చేశారు.

kishanreddy
kishanreddy

అగ్నిపథ్‌ విషయంలో యువతను తప్పుదారి పట్టిస్తున్నారు: కిషన్‌రెడ్డి

Kishanreddy on Agnipath Protest: అగ్నిపథ్‌ విషయంలో యువతను తప్పుదారి పట్టిస్తున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో విధ్వంసంపై కేంద్ర హోంశాఖమంత్రి అమిత్‌షాకు వివరించిన ఆయన.. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రజల్లో దేశభక్తి, జాతీయ భావన పెంచే ప్రయత్నమే అగ్నిపథ్‌ అని అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో అల్లర్లు సమంజసం కాదు.. సంయమనం పాటించాలని కిషన్​రెడ్డి తెలిపారు. శాంతిభద్రతలు కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని అన్నారు.

‘అగ్నిపథ్‌’ తప్పనిసరి కాదు: ‘‘ప్రపంచంలోని అనేక దేశాల్లో ‘అగ్నిపథ్‌’ వంటి పథకాలు ఏళ్లుగా అమల్లో ఉన్నాయి. స్వచ్ఛందంగా ఇష్టపడినవాళ్లే ఈ పథకంలో చేరవచ్చు.. ఇందులో బలవంతం లేదు. దేశ సేవ చేయాలన్న తపన ఉన్నవాళ్లే అగ్నిపథ్‌లో పాల్గొంటారు. ఇజ్రాయిల్‌లో 12 నెలలు, ఇరాన్‌లో 20 నెలలపాటు సైన్యంలో పనిచేసే సంప్రదాయం ఉంది. యూఏఈలోనూ ఇటువంటి పథకం ఆరేళ్ల నుంచి అమలు చేస్తున్నారు. భారత్‌లో ఈ పథకాన్ని తప్పనిసరి చేయట్లేదు. ‘అగ్నిపథ్‌’ వీరుడు బయటకు వచ్చాక 10 మందికి ఉపాధి కల్పించేలా తయారవుతారు. మోదీ ప్రధాని కాకముందు నుంచే దీనిపై చర్చలు జరుగుతున్నాయి.

'అగ్నిపథ్‌ విషయంలో యువతను తప్పుదారి పట్టిస్తున్నారు. సికింద్రాబాద్‌లో పథకం ప్రకారం విధ్వంసం సృష్టించారు. రైల్వే కోచ్‌లకు కూడా నిప్పుపెట్టారు... బోగీలన్నీ ధ్వంసమయ్యాయి. స్టేషన్‌ ప్రాంగణంలోని ప్రయాణికుల బైక్‌లు తగలబెట్టారు. సికింద్రాబాద్‌ స్టేషన్‌లో సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. ప్రయాణికులు సామాన్లు కూడా వదిలిపెట్టి భయంతో పరిగెత్తే పరిస్థితి. రాష్ట్ర పోలీసులు చూస్తూ ఉండిపోయారు... బాధ్యత లేదా? ఇన్ని జరుగుతున్నా సకాలంలో పోలీసులు ఎందుకు రాలేదు. శాంతిభద్రతలు కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది.'- కేంద్రమంత్రి కిషన్​రెడ్డి

పోలీసులు ఎందుకు రాలేదు..?: కేంద్ర ప్రభుత్వం వాలంటరీ పథకం తీసుకొస్తే దాడులు జరగడం దురదృష్టకరమన్నారు. ప్రయాణికులు సామాన్లు కూడా వదిలిపెట్టి భయంతో పరిగెత్తే పరిస్థితి తీసుకొచ్చారని వాపోయారు. పథకం ప్రకారం కుట్ర చేసి రైల్వే స్టేషన్‌ను లక్ష్యంగా ఎంచుకోవడం దారుణమని.. ఈ ఘటనలో రాష్ట్ర పోలీసులు చూస్తూ ఉండిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేషన్‌ ప్రాంగణంలోని ప్రయాణికుల బైక్‌లు తగలబెట్టడం సరికాదన్నారు. ప్రజాస్వామ్య దేశంలో అల్లర్లు సమంజసం కాదని.. సంయమనం పాటించాలని కిషన్ రెడ్డి సూచించారు. రైల్వే కోచ్‌లకు కూడా నిప్పుపెట్టడం, బోగీలన్నీ ధ్వంసమవుతన్నా... సకాలంలో పోలీసులు ఎందుకు రాలేదని ఆయన ప్రశ్నించారు.

నిన్న రాజ్‌భవన్‌ ఎదుట ఆందోళన జరుగుతున్నా రాష్ట్ర పోలీసులు సకాలంలో పట్టించుకోలేదు. శాంతిభద్రతలు కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. ‘అగ్నిపథ్‌’ పథకం ప్రకటన ఏకపక్ష నిర్ణయం కాదు. ప్రపంచ దేశాల్లో పరిస్థితులన్నీ పరిశీలించి తీసుకొచ్చాం. ‘అగ్నిపథ్‌’పై అభ్యంతరాలు ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలు, మేధావులతోనూ చర్యలకు సిద్ధమే. సికింద్రాబాద్‌ ఘటనలో రాజకీయ ప్రమేయం ఉంది. దీనిపై సమగ్ర దర్యాప్తు జరగాలి.’’ కేంద్రమంత్రి కిషన్​రెడ్డి

ఇవీ చదవండి:

Last Updated : Jun 17, 2022, 3:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.