ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @9PM

author img

By

Published : Oct 28, 2020, 8:59 PM IST

ETV BHARAT TOP TEN NEWS
టాప్​టెన్​ న్యూస్​ @9PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు.

1. రేపటి నుంచి కొత్త రెవెన్యూ చట్టం

రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టం రేపటి నుంచి అమల్లోకి రానుంది. భూమి హక్కులు, పట్టాదారు పాసుపుస్తకాల చట్టం-2020 అమలు తేదీని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 29 నుంచి కొత్త చట్టం అమల్లోకి వస్తుందని ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

2. బంధువే... కిడ్నాపర్

రాష్ట్ర రాజధానిలో దంత వైద్యుడి అపహరణ కేసును పోలీసులు 12 గంటల్లోనే ఛేదించారు. బాధితుడిని బెంగళూరుకు తరలిస్తుండగా ఏపీలోని అనంతపురం జిల్లాలో పట్టుకొని... సైబరాబాద్‌ పోలీసులకు అప్పగించారు. కిడ్నాప్‌ సూత్రధారి ముస్తఫా... వైద్యుడు హుస్సేన్‌కు దగ్గరి బంధువేనని సీపీ సజ్జనార్‌ తెలిపారు. విలాస జీవితానికి అలవాటు పడి డబ్బు కోసం అపహరించాడని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

3. దోషికి ఉరి శిక్ష ఖరారు

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వరంగల్ గొర్రెకుంట మృత్యుబావి కేసులో దోషికి ఉరిశిక్ష పడింది. సంజయ్‌కుమార్‌కు ఉరిశిక్ష విధించడం పట్ల సర్వత్రా హర్షాతిరేకలు వ్యక్తమవుతున్నాయి. తప్పు చేసిన వాడికి శిక్ష ఖాయమన్నది.. వరంగల్ న్యాయస్ధానం మరోసారి నిరూపించిందని న్యాయవాదులు అంటున్నారు. తమ దర్యాప్తునకు గుర్తింపుగా వచ్చిన తీర్పుగా పోలీసులు అభివర్ణించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

4. ఆటవిక రాజ్యానికి రాకుమారుడు

బిహార్​ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్​జేడీ నేత తేజస్వీ యాదవ్​పై ప్రధాని నరేంద్రమోదీ విరుచుకుపడ్డారు. ఆటవిక రాజ్యానికి యువరాజు అంటూ తేజస్వీపై నిప్పులు చెరిగారు. 10 లక్షల ఉద్యోగాల హామీని ఎగతాళి చేశారు. లాలూ హయాంలో బిహార్​ను రోగగ్రస్థ రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

5. సీఎంపై సీబీఐ దర్యాప్తు

అవినీతి ఆరోపణలతో ఉత్తరాఖండ్​ సీఎం త్రివేంద్ర సింగ్​ రావత్​పై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించి ఆ రాష్ట్ర హైకోర్టు. దీంతో ముఖ్యమంత్రి పదవికి రావత్​ రాజీనామా చేయాలని ప్రతిపక్ష కాంగ్రెస్​ డిమాండ్​ చేస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

6. 13 శాతం మందే

దేశంలో వివిధ రకాల గ్రిడ్​ల నుంచి విద్యుత్​ను ఉపయోగించే ప్రజల శాతం అధికంగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సర్వేలో వెల్లడైంది. కేవలం పదమూడు శాతం మంది మాత్రమే కరెంట్​ కోసం ప్రత్యామ్నాయ వనరులపై ఆధారపడుతున్నట్లు స్పష్టమైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

7. ఎగిరే కార్లు వచ్చేస్తున్నాయ్!

గాలిలో ఎగిరే కార్లు ఐరోపా దేశాల్లో త్వరలోనే రోడ్లెక్కనున్నాయి. డచ్​ సంస్థ పాల్​-వి రూపొందించిన ప్లయింగ్ కార్లకు అధికారిక అనుమతి లభించింది. మూడు చక్రాలతో చిన్నసైజు హెలికాప్టర్​ను పోలి ఉండే ఈ వాహనాలు గంటకు 160కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. స్విచ్ విధానంతో 10 నిమిషాల్లో రోడ్డుపై నుంచి గాల్లోకి ఎగిరేలా వీటిని రూపొందించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

8. ఆర్థిక సంఘం నివేదిక సిద్ధం

15వ ఆర్థిక సంఘం 2021-26 కాలానికి సంబంధించిన నివేదికను ఈ నెల 30 లోపు సిద్ధం చేయనుంది. అనంతరం ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

9. మహిళా క్రికెట్​కు పెరిగిన ఆదరణ

ఈటీవీ భారత్​తో ముచ్చటించిన ఇంగ్లాండ్​ మహిళా జట్టు కోచ్​ రాబిన్ ​సన్​.. 2017 మహిళా ప్రపంచకప్​ను గుర్తుచేసుకున్నాడు. అప్పుడు ఫైనల్లో ఇంగ్లాండ్​పై భారత్ గెలిచి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్నాడు. దీంతోపాటు భారత మహిళా జట్టుపై ప్రశంసలు కురిపించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

10. లచ్చా గుమ్మాడీ పాట

స్టార్ హీరోయిన్​ కీర్తి సురేశ్​ ప్రధానపాత్రలో నటించిన 'మిస్​ ఇండియా' ట్రైలర్​ నెట్టింట విశేషాదరణ దక్కించుకుంటోంది. నెట్​ఫ్లిక్స్​ ద్వారా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. ఈ నేపథ్యంలో సినిమాలోని రెండో లిరికల్​ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.