ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్ @1pm

author img

By

Published : Jun 16, 2020, 1:01 PM IST

top ten 1pm
టాప్​టెన్​ న్యూస్ @1pm

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ఏం చేద్దాం

ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్​ ప్రగతి భవన్​లో అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశమయ్యారు. ఈ భేటీలో మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కలెక్టర్లతోపాటు జిల్లా పంచాయతీ అధికారులు సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో ఈ అంశాల గురించి చర్చించనున్నారు.

ఆరోగ్యమంత్రికి కరోనా లక్షణాలు

దిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్​.. కరోనా అనుమానిత లక్షణాలతో సోమవారం రాత్రి ఆసుపత్రిలో చేరారు. తీవ్ర జ్వరం, శ్వాస సంబంధిత సమస్యలతో రాజీవ్​ గాంధీ సూపర్​ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు ఆయన ట్విట్టర్​లో వెల్లడించారు. కరోనా లక్షణాల నేపథ్యంలో.. ఆయన నుంచి నమూనాలను సేకరించారు వైద్యులు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే..

ఆయుధాల డంప్​

అసోంలోని బోడోల్యాండ్ టెరిటోరియల్ కౌన్సిల్​కు మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న వేళ.. చిరాంగ్​లో బయటపడిన భారీ ఆయుధాల డంప్ కలకలం రేపింది. భారత్​-భూటాన్ సరిహద్దు అసోంలోని చిరాంగ్ వద్ద భారీ ఆయుధాల డంప్​ను రక్షణ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు అసోం ఎస్పీ సుధాకర్ సింగ్ ప్రకటన విడుదల చేశారు. అందులో ఈ విధంగా పేర్కొన్నారు.

నాకు కరోనా లేదు​

తనకు కరోనా సోకలేదని... తాను ఆరోగ్యంగా ఉన్నానని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో పద్మాదేవేందర్ రెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు గుర్తు తెలియని వ్యక్తులు పెట్టిన పోస్టులపై ఆమె స్పందించారు. అసలు ఏమి జరిగిందంటే..

దారి కుదిరిందా..?

తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర సర్వీసులు నడిపేందుకు వీలుగా ఒప్పందానికి అడుగులు పడ్డాయి. ఈ మేరకు తెలంగాణ ఆర్టీసీ ఇం‌ఛార్జీ ఎండీ సునీల్‌శర్మ, ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మాదిరెడ్డి ప్రతాప్‌ల మధ్య ఫోన్‌లో మంతనాలు జరిగాయి. ఇంతకీ ఏమి తేలిందంటే..

పాక్​ తీరును ఎండగట్టిన భారత్​

ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్థాన్​ తీరును భారత్‌ మరోసారి ఎండగట్టింది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి 43వ సమావేశంలో కశ్మీర్‌ అంశాన్ని పాక్‌ మరోసారి లేవనెత్తగా... భారత్‌ తీవ్రంగా ప్రతిస్పందించింది. పాక్​లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై భారత ప్రతినిధి సెంథిల్​ కుమార్ ఈ విధంగా స్పందించారు.​

కొవిడ్​ ఆస్పత్రుల తనిఖీలకు కేంద్ర బృందాలు

దిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో దేశ రాజధానిలో కొవిడ్​ ఆస్పత్రులను తనిఖీ చేయడానికి నిపుణులతో కూడిన మూడు బృందాలను నియమించింది కేంద్రం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. వైరస్​ నిర్ధరణ కోసం జూన్​ 20 నుంచి రాపిడ్​ యాంటిజెన్​ కిట్​లను ఉపయోగించనున్నట్లు అధికారులు తెలిపారు. పూర్తి కథనం కోసం క్లిక్​ చేయండి.

జియోకు విదేశీ నిధుల జల్లు

జియో ప్లాట్​ఫామ్స్​కు విదేశీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. సౌదీకి చెందిన ప్రముఖ పెట్టుబడుల సంస్థ పీఐఎఫ్​ దాదాపు రూ.11 వేల కోట్లకుపైగా పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందానికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఇది కరోనా క్రికెట్​

కరోనా కారణంగా క్రికెట్ సిరీస్​లన్నీ వాయిదా పడ్డాయి. ప్రస్తుతం కొన్ని సడలింపుల కారణంగా మళ్లీ టోర్నీలు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ కరోనా సమయంలో మ్యాచ్​లు జరిగితే ఎలాంటి మార్పులు చూడబోతున్నామో తెలుసుకుందాం.

ఎవరూ పర్​ఫెక్ట్​గా లేరు

కథానాయకుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య నేపథ్యంలో కథానాయిక అనుష్క శెట్టి భావోద్వేగ సందేశం‌‌ పోస్ట్ చేశారు. ఈ ప్రపంచంలో ఎవరూ పర్‌ఫెక్ట్‌ కాదని తెలిపారు. బాధల నుంచి బయట పడాలంటే ఏమి చేయాలో ఇలా చెప్పుకొచ్చింది స్వీటీ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.