ETV Bharat / city

Telangana News Today టాప్​న్యూస్ 1PM

author img

By

Published : Aug 20, 2022, 1:00 PM IST

ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలు

1PM TOPNEWS
1PM TOPNEWS

  • ఆస్పత్రి వరండాలోనే మహిళ ప్రసవం

Infant Dies in Yavatmal: మహారాష్ట్రలోని యావత్మాల్​లో దారుణం జరిగింది. ఆస్పత్రి వరండాలోనే మహిళ ప్రసవించగా.. నవజాత శిశువు కన్నుమూసింది. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యమే ఘటనకు కారణమని బాలింత తండ్రి ఆరోపించారు. తమ తప్పును కప్పిపుచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. అయితే.. వారే ఆస్పత్రికి ఆలస్యంగా వచ్చారని, అందుకే ఇలా జరిగిందని సిబ్బంది చెబుతున్నారు.

  • తమ్మినేని కృష్ణయ్య హత్య కేసు, రిమాండ్ రిపోర్టులో ఏ1 పేరు మాయం

Tammineni Krishnaiah Murder Case సంచలనం రేపిన తెరాస నేత తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో నిందితులకు ఖమ్మం న్యాయస్థానం రిమాండ్‌ విధించింది. 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధింపుతో 8 మందిని జైలుకు తరలించారు. వ్యక్తిగత కారణాలతోనే కృష్ణయ్యను హత్య చేసినట్లు పోలీసులు న్యాయస్థానానికి సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు.

  • వరుణుడి బీభత్సం, ఒకే కుటుంబంలో ఏడుగురు మృతి

LandSlides In Himachal Pradesh ఉత్తరాది రాష్ట్రాల్లో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. ఎడతెరిపి లేని వర్షాలతో అతలాకుతలం చేస్తున్నాడు. హిమాచల్​ ప్రదేశ్​లో కొండచరియలు విరిగి పడి పది మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరాఖండ్​లోని తంసా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మరోవైపు, భారీ వర్షాల కారణంగా జమ్ముకశ్మీర్​లోని మాతా వైష్ణోదేవి ఆలయం సమీపంలో భారీ వరదలు సంభవించడం వల్ల భక్తుల రాకపోకలు నిలిచిపోయాయి.

  • మరోసారి కరెంట్ ఛార్జీలు పెంచేందుకు కేసీఆర్​ కుట్ర

bandi sanjay comments on cm kcr రాష్ట్రంలో మరోసారి విద్యుత్​ ఛార్జీలు పెంచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ప్రజలపై మరో రూ.4 వేల కోట్ల భారం మోపేందుకు కుట్ర చేస్తున్నారని ఆక్షేపించారు. అందుకే కేంద్రం ఎక్స్ఛేంజీలో విద్యుత్​ విక్రయాలు ఆపేసిందని పేర్కొన్నారు. జనగామ జిల్లా ఖిలాషపూర్​లో ప్రజా సంగ్రామ యాత్రలో ఆయన ఈ మేరకు మాట్లాడారు.

  • ముంబయికి బెదిరింపులు, ఉగ్ర దాడులు చేస్తామని పాక్​ నుంచి మెసేజ్​

Mumbai Threat News: దేశ ఆర్థిక రాజధాని ముంబయిపై ఉగ్ర దాడులు చేస్తామని బెదిరింపు సందేశం వచ్చింది. ఈ మేరకు ముంబయి పోలీస్​ ట్రాఫిక్​ కంట్రోల్​ రూంకు ఒక మెసేజ్​ వచ్చినట్లు వారు వెల్లడించారు. 26/11 ఉగ్రదాడి తరహాలో విరుచుకుపడతామని, మొత్తం ఆరుగురు భారత్​లో ఈ ప్రణాళికలో భాగం అయ్యారని అందులో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ మెసేజ్​ పాకిస్థాన్​ నుంచి వచ్చినట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.

  • స్వల్పంగా తగ్గిన బంగారం ధర, ఏపీ తెలంగాణలో ఎంతంటే

Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధర స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.200 తగ్గి ప్రస్తుతం రూ.53,330 పలుకుతోంది. మరోవైపు కేజీ వెండి ధర రూ.300 తగ్గి ప్రస్తుతం రూ.57,208 వద్ద ఉంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.

  • వాట్సాప్​లో తెలియకుండా మెసేజ్​లు డిలీట్​ చేస్తున్నారా

యూజర్లకు వాట్సాప్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఫీచర్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. ఈ ఫీచర్‌తో యూజర్లు డిలీట్‌ చేసిన మెసేజ్‌లను తిరిగి పొందవచ్చు. పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్‌ను వాట్సాప్‌ ఆండ్రాయిడ్‌ బీటా యూజర్లకు అందుబాటులో ఉంది. ప్రస్తుతం వాట్సాప్‌లో పొరపాటున లేదా తొందరపాటువల్ల ఏదైనా మెసేజ్‌ లేదా మీడియాఫైల్‌ను డిలీట్ చేస్తే వాటిని తిరిగి రికవరీ చేసుకునే అవకాశంలేదు. త్వరలో తీసుకురాబోతున్న ఫీచర్‌తో డిలీట్ చేసిన మెసేజ్‌లను కూడా తిరిగి పొందవచ్చు.

  • విరాట్​ కోహ్లీ అంటే వారికి అంత భయమా

ఫామ్‌ కోల్పోయి ఇబ్బందులు పడుతోన్న టీమ్​ఇండియా మాజీ కెప్టెన్‌, బ్యాటర్​ కోహ్లీ ఆటతీరుపై కొంతకాలంగా సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ విమర్శలపై టీమ్​ఇండియా లెగ్‌ స్పిన్నర్‌ చాహల్‌ తాజాగా స్పందించాడు. ఇటీవల కోహ్లీ ఎన్నో విలువైన నాక్స్‌తో జట్టుకు మంచి సహకారం అందించాడని చాహల్‌ అభిప్రాయపడ్డాడు. కానీ, చాలా మంది విరాట్‌ సెంచరీల గురించి ఆలోచించడం వల్లే ఈ సమస్యంతా వస్తోందని అన్నాడు.

  • నలుగురికీ నచ్చినది మాకసలే ఇక నచ్చదురో

హోటళ్లు నేల మీదే కట్టాలా, భూమి, ఆకాశం మధ్యలో.. చెట్లపై ఎందుకు నిర్మించకూడదు, అనుకున్నాడు రాహుల్‌. దాన్ని చేతల్లో పెట్టి విజయం సాధించాడు. సైకిల్‌పై భారత్‌యాత్ర చేశాడు రంజిత్‌. స్నేహితుడో, ప్రేమికురాలితోనో కాదు.. పెంపుడు శునకంతో. వార్తల్లో నిలిచాడు. చదువైపోగానే కొలువులో కుదురుకోవాలనుకోలేదు అభిరాం రెడ్డి. ఆలస్యమైనా ఫరవాలేదు.. శాస్త్రవేత్త కావాలనుకున్నాడు. అనుకున్నది సాధించి రూ.2 కోట్ల వేతనం అందుకుంటున్నాడు. భిన్నదారిలో వెళ్లి, విజేతలుగా నిలిచిన ఈ స్ఫూర్తివీరులు తమ ప్రయాణాన్ని ఈటీవీ భారత్‌తో పంచుకున్నారు.

  • రాశీఖన్నా న్యూ ఫొటోషూట్​, అందాల టాప్​ లేపేసిందిగా

Raasikhanna Hot gallery ఇటీవలే థ్యాంక్యూ, పక్కా కమర్షియల్​ సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించిన టాలీవుడ్ బ్యూటీ రాశీఖన్నా.. గత కొద్ది కాలంగా గ్లామర్​ డోస్​ను పెంచేసిన సంగతి తెలిసిందే. ఫొటోషూట్స్​ను సోషల్​మీడియాలో పోస్ట్​ చేస్తూ కుర్రాళ్లను కవ్విస్తోంది. తాజాగా మరో ఫొటోషూట్​ను పోస్ట్​ చేసి కుర్రకారుకు నిద్రలేకుండా చేసింది. ఆ ఫొటోలను మీరూ చూసేయండి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.