ETV Bharat / city

భూముల సమగ్ర సర్వేపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష

author img

By

Published : Jun 2, 2021, 11:03 AM IST

Updated : Jun 2, 2021, 11:53 AM IST

Chief Minister KCR review on land survey
సమగ్ర సర్వేపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష

11:01 June 02

భూముల సమగ్రసర్వేపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష

భూముల సమగ్ర సర్వే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారమే ధ్యేయంగా రాష్ట్రంలోని భూములన్నింటినీ సమగ్రంగా సర్వే చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. అందుకు అనుగుణంగా బడ్జెట్​లో భూ సర్వే కోసం రూ.400 కోట్ల కేటాయించారు. వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల సహకారంతో వీలైనంత త్వరగా సర్వే పూర్తి చేయాలని సర్కార్​ లక్ష్యంగా పెట్టుకొంది.  

ఈ నేపథ్యంలో భూముల సమగ్ర సర్వేపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.  సీఎస్ సోమేశ్ కుమార్, ఐటీ, స్టాంపులు-రిజిస్ట్రేషన్లు, ఆర్థిక, రెవెన్యూ, సర్వే, టీఎస్టీఎస్ అధికారులతో పాటు వివిధ సంస్థల ప్రతినిధులతో ప్రగతిభవన్​లో సమావేశమయ్యారు. భూముల డిజిటల్ సర్వే చేసేందుకు ఆసక్తి కనబర్చిన వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ప్రతినిధులూ సమావేశానికి హాజరయ్యారు.  

ఆయా కంపెనీల ప్రతినిధులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్.. మంగళవారమే.. ప్రాథమికంగా సమావేశమై సర్వే సంబంధిత అంశాలపై చర్చించారు.    

ఇవీచూడండి: Dharani : భూసమస్యల పరిష్కారానికి 5 రోజులపాటు ప్రత్యేక డ్రైవ్

Last Updated :Jun 2, 2021, 11:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.