ETV Bharat / city

కార్యకర్త ఒంటిపై చెయ్యేస్తే తిరుగుబాటు తప్పదు, ఇంటికొచ్చి మరీ కొడతామన్న చంద్రబాబు

author img

By

Published : Aug 25, 2022, 10:33 PM IST

కార్యకర్త ఒంటిపై చెయ్యేస్తే తిరుగుబాటు తప్పదు, ఇంటికొచ్చి మరీ కొడతామన్న చంద్రబాబు
కార్యకర్త ఒంటిపై చెయ్యేస్తే తిరుగుబాటు తప్పదు, ఇంటికొచ్చి మరీ కొడతామన్న చంద్రబాబు

Chandrababu Warning తెలుగుదేశం కార్యకర్త ఒంటిపై చెయ్యి వేస్తే దాడి చేసిన వాడి ఇంటికి వెళ్లి మరీ కొడతామని తెదేపా అధినేత చంద్రబాబు హెచ్చరించారు. ఏపీలోని కుప్పంలో వైకాపా నేతల దాడిపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. జగన్ అరాచక పాలనకు కాలం చెల్లిందన్న చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా ధర్మపోరాటానికి నాంది పలుకుతున్నామన్నారు. వైకాపా దాడులను ఇకపై ఉపేక్షించేది లేదన్న ఆయన దాడికి ప్రతిదాడి తప్పదన్నారు.

కార్యకర్త ఒంటిపై చెయ్యేస్తే తిరుగుబాటు తప్పదు, ఇంటికొచ్చి మరీ కొడతామన్న చంద్రబాబు

Chandrababu Warning: పోలీసులు సరిగా పనిచేయకుంటే ప్రజా తిరుగుబాటు ఖాయమని తెదేపా అధినేత చంద్రబాబు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్​లోని కుప్పంలో తన రెండో రోజు పర్యటనకు వైకాపా అడ్డంకులు సృష్టించడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా కార్యకర్తలు అన్నా క్యాంటీన్‌ను ధ్వంసం చేయడం, తెదేపా ఫ్లెక్సీల చించివేయడంపై చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బస్టాండ్‌ వద్ద రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపిన అనంతరం ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా వైకాపా, పోలీసుల తీరుపై మండిపడ్డారు.

...

తప్పు చేసిన పోలీసులను దోషులుగా నిలబెడతామమని చంద్రబాబు హెచ్చరించారు. కుప్పం ప్రజలెప్పుడూ ప్రశాంత జీవితం గడిపారని చెప్పారు. ఎప్పుడూ ఈ తరహా దాడులు కుప్పంలో చూడలేదని.. ఈ పోలీసుల కంటే బ్రిటీష్‌ వాళ్లే నయమని వ్యాఖ్యానించారు. ప్రజా వ్యతిరేకతను తట్టుకోలేకే వైకాపా ఈ తరహా ఘటనలకు పాల్పడుతోందన్నారు. వైకాపా పతనానికి కౌంట్‌డౌన్‌ ప్రారంభమైందని.. కుప్పం నుంచే ధర్మపోరాటానికి నాంది పలుకుతున్నట్లు చంద్రబాబు చెప్పారు.

బుధవారం రామకుప్పం మండలంలో జరిగిన తన సమావేశం వద్ద వైకాపా జెండాలు ఎగురవేస్తారా? అని మండిపడ్డారు. దమ్ముంటే తనను అరెస్ట్‌ చేయాలన్నారు. పట్టణంలో శాంతిభద్రతలు కాపాడాలని.. వైకాపా గూండాలకు వత్తాసు పలకొద్దని పోలీసులను కోరారు. రౌడీలు, గూండాలను అణచివేసిన పార్టీ తెదేపా అని చెప్పారు.

ఇవీ చూడండి..

డీజీపీ కార్యాలయం ముట్టడికి తెదేపా యత్నం, ఉద్రిక్తత

హైకోర్టుల్లో 224 మంది న్యాయమూర్తులను నియమించిన సీజేఐ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.