ETV Bharat / city

Jagan cases: జగన్ డిశ్చార్జ్ పిటిషన్‌పై వాదనలు ఈనెల 25కు వాయిదా

author img

By

Published : Oct 12, 2021, 7:37 PM IST

Jagan cases news
Jagan cases news

ఏపీ సీఎం జగన్​ అక్రమాస్తుల కేసుల విచారణ సీబీఐ, ఈడీ కోర్టులో జరిగింది. డిశ్చార్జ్ పిటిషన్‌పై వాదనలను కోర్టు.. ఈనెల 25కు వాయిదా వేసింది. ఎమ్మార్ కేసులో కోనేరు మధుపై ఎల్ఓఆర్‌ వివరాలు తెలపాలని సీబీఐని ఆదేశించింది.

సీబీఐ, ఈడీ కోర్టులో ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ (ap cm Jagan cases) జరిగింది. జగతి పబ్లికేషన్స్​ను ఈడీ కేసు నుంచి తొలగించాలన్న పిటిషన్‌పై జగన్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. డిశ్చార్జ్ పిటిషన్‌పై వాదనలను ఈనెల 25కు కోర్టు వాయిదా వేసింది.

దర్యాప్తు పూర్తయింది: ఈడీ

ఎమ్మార్ కేసులో దర్యాప్తు పూర్తయిందని సీబీఐ కోర్టుకు ఈడీ తెలిపింది. అభియోగాల నమోదుపై నిందితుల వాదనల కోసం విచారణను కోర్టు ఈనెల 27కు వాయిదా వేసింది. ఎమ్మార్ కేసులో కోనేరు మధుపై ఎల్ఓఆర్‌ వివరాలు తెలపాలని సీబీఐని ఆదేశించింది .

ఇదీచూడండి: Viral Image: బీరువాల నిండా నోట్ల కట్టలు.. ఇంత డబ్బు ఎవరిది.. వాళ్లదేనా..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.