ETV Bharat / city

Viral Image: బీరువాల నిండా నోట్ల కట్టలు.. ఇంత డబ్బు ఎవరిది.. వాళ్లదేనా..?

author img

By

Published : Oct 12, 2021, 5:38 PM IST

Updated : Oct 12, 2021, 5:44 PM IST

బీరువాలు, సెల్ఫుల నిండా నోట్ల కట్టలతో ఉన్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అసలు ఆ ఫొటోలు ఎక్కడివీ..? అందులోని డబ్బు ఎవరిదీ..? అసలు ఆ ఫొటోలు ఎవరు రిలీజ్​ చేశారు. అసలు అంత డబ్బు.. ఎక్కడుంది..?

huge money photos viral in all social medias
huge money photos viral in all social medias

సెల్ఫుల నిండా పేర్చిన పైసలు.. బీరువా నిండా కుక్కిన నోట్ల కట్టలు... ఎక్కడా అనుకుంటున్నారా..? ఇదే ప్రశ్న ఇప్పుడు నెటిజన్ల మొదళ్లను తొలుస్తోంది. సోమవారం నుంచి సామాజిక మాధ్యమాలన్నింటిలో.. రెండు ఫొటోలు తెగ వైరల్​ అవుతున్నాయి. ఫేస్​బుక్​, వాట్సప్​, ఇన్​స్టాగ్రామ్​, యూట్యూబ్​ అని తేడా లేకుండా.. అన్నింటా చక్కర్లు కొడుతున్నాయి.

ఈడీ స్వాధీనం చేసుకున్నవేనా..?

కోట్లకు కోట్ల నోట్ల కట్టలు.. బీరువాలో, సెల్ఫుల్లో పేర్చి ఉన్న ఈ ఫొటోలు చూసి.. అందరూ అవాక్కవుతున్నారు. ఇన్ని నోట్ల కట్టలను ఒకేసారి చూసేందుకు కళ్లను పెద్దవి చేసి మరీ చూస్తున్నారు. ఇటీవల.. ఓ సంస్థలో ఎన్​ఫోర్స్​మెంట్​ డైెరెక్టరేట్​ అధికారులు చేసిన సోదాల్లో స్వాధీనం చేసుకున్న డబ్బే.. ఇదంతా..! అనే మరో వార్త... ఈ ఫొటోల వెంటే వైరల్​ అవుతోంది. ఇవి రూ.143 కోట్లని.. ఆ సంస్థ తమ కార్యాలయంలో దాచిన డబ్బులనే వార్తలు హల్​చల్​ చేస్తున్నాయి.

huge money photos viral in all social medias
huge money photos viral in all social medias

ధ్రువీకరణ కాలేదు..

అసలు ఈ డబ్బంతా.. సోదాల్లో స్వాధీనం చేసుకున్నదేనా..? లేక వేరే వాళ్ల డబ్బా..? అన్నది మాత్రం అధికారికంగా ధ్రువీకరణ కాలేదు. అటు.. ఈడీ అధికారులు కూడా ఈ ఫొటోలపై స్పందించలేదు. ఇప్పటివరకు అధికారులు ఎటువంటి ప్రకటన విడుదల చేయకపోవటం చర్చనీయాంశమైంది. ఈ డబ్బుపై ఎలాంటి ధ్రువీకరణ లేకపోయినప్పటికీ.. ఈ ఫొటోలు మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తూ.. అన్ని సామాజికమాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

అధికారుల స్పందించే దాకా..

మరీ ఈ ఫొటోలు ఎక్కడి నుంచి వచ్చాయి...? అందులోని డబ్బు ఎవరిదీ..? అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది..? మొత్తం ఎంత ఉడొచ్చు..? అనే ప్రశ్నలపై నెటిజన్లు ఇప్పటికే.. రీసెర్చ్​ మొదలుపెట్టేశారు. ఎవరికి తోచిన విధంగా వాళ్లు.. వాటికి సమాధానాలు చెప్తున్నారు. మొత్తానికి.. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు దొరకాలంటే.. అధికారులు స్పందించేవరకు వేచిచూడాల్సిందే.. మరీ..!

ఇదీ చూడండి:

Last Updated : Oct 12, 2021, 5:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.