ETV Bharat / science-and-technology

నయా వాట్సాప్ స్కామ్​.. గిఫ్ట్​ పేరుతో ఖాతా లూటీ!

author img

By

Published : Oct 12, 2021, 3:54 PM IST

వాట్సాప్​లో ఇటీవల ఓ స్కామ్​ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అమూల్ డైరీ వార్షికోత్సవాల పేరుతో ఈ కింది లింక్​ను క్లిక్ చేస్తే ఆరు వేలు గెలుచుకోవచ్చు అంటూ ఓ ఫేక్ మెసేజ్ (whatsapp scam messages) చక్కర్లు కొడుతోంది. ఈ లింక్​పై క్లిక్ చేస్తే అంతే సంగతి!

whatsapp scam messages
వాట్సప్ స్కామ్​

అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్​ యాప్ వాట్సాప్. దీనికి దాదాపు రెండు బిలియన్ల (whatsapp scam messages) పైనే యూజర్లు ఉన్నారు. ఇంత ఎక్కువ ట్రాఫిక్ కలిగిన వాట్సాప్​ హ్యాకర్లకు టార్గెట్​గా మారింది. యాప్ యూజర్లకు హ్యాకర్లు మాల్​వేర్​ను పంపిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో వాట్సాప్​లో ఇలాంటి (whatsapp scam messages) స్కామ్​ జరిగింది. ఇండియన్ డైరీ కంపెనీ అమూల్​ 75వ వార్షిక ఉత్సవాల పేరుతో ఆరువేల గిఫ్ట్​ అంటూ ఓ ఫేక్ లింక్ చక్కర్లు కొడుతోంది. లింక్​ను క్లిక్​ చేస్తే ఆరువేలు (whatsapp scam messages) గెలుచుకోవచ్చు అనే సందేశం ఉంటోంది. ఒకవేళ కనుక ఈ మెసేజ్​కు మీరు స్పందిస్తే ప్రమాదకరమైన మాల్​వేర్ మీ ఫోన్​లో చేరినట్లే. ఎందుకంటే ఆ మెసేజ్​తో పాటు లింక్​ కూడా ఫేక్​.

whatsapp scam messages
స్కామ్​పై ఓ యూజర్ ట్వీట్​

క్యాష్​ రివార్డ్​ పేరుతో యూజర్లను ట్రాప్​ చేయడానికి హ్యాకర్లు ఇలాంటి మెసేజ్​ సెండ్ చేస్తున్నారు. యూజర్లకు తెలియక ఆ లింక్​పై క్లిక్​ చేసి ఈ స్కామ్​లో చిక్కుకుపోతున్నారు. రివార్డ్​ ఏమీ రాకపోగా.. 10 లేక 15 గ్రూపులకు ఫార్వర్డ్ చేస్తే రివార్డ్​ గెలుచుకునే అవకాశం ఉందని యూజర్లకు గాలం వేస్తున్నారు.

జాగ్రత్త సుమా!

ఇలాంటి ఫేక్ మెసేజ్​లు చాలామంది ఫోన్లలో దర్శనమిస్తుంటాయి. వాట్సాప్, ఫేస్​బుక్, ఇన్​స్టాగ్రామ్, డైరెక్ట్​ మెసేజ్​ల రూపంలో కనిపిస్తుంటాయి. వీటికి వీలైనంత వరకూ దూరంగా ఉండండి. అలాంటి సందేశాలు కనిపిస్తే వెంటనే సైబర్ క్రైమ్ అధికారులకు తెలియజేయండి. మీతో పాటు మీ కుటుంబ సభ్యులు, స్నేహితులకూ ఇలాంటి లింక్​లపై అవగాహన కల్పించండి.

ఇదీ చదవండి: టీనేజర్ల కోసం ఇన్​స్టా సరికొత్త ఫీచర్.. వారి ప్రైవసీనే ముఖ్యం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.