టీనేజర్ల కోసం ఇన్​స్టా సరికొత్త ఫీచర్.. వారి ప్రైవసీనే ముఖ్యం!

author img

By

Published : Oct 12, 2021, 9:15 AM IST

Instagram new features 2021

యువత కోసం కొత్త ఫీచర్లను(Instagram new features for youth) తీసుకువస్తున్నట్లు ప్రకటించింది ఇన్​స్టాగ్రామ్. హాని కలిగించే కంటెంట్​కు టీనేజ్​​ దూరంగా ఉండేలా ప్రోత్సహించడానికి ఈ ఫీచర్స్​ ఉపయోగపడనున్నాయి.

ఇన్​స్టాగ్రామ్​ను యువతకు సురక్షిత ప్లాట్​ఫామ్​గా తీర్చిదిద్దేందుకు ఆ సంస్థ యాజమాన్యం (Instagram new features 2021) నూతన ఫీచర్స్​ను తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. హాని కలిగించే కంటెంట్​కు దూరంగా ఉండే విధంగా ఎంచుకునే వెసులుబాటును యూజర్​కు కల్పించనుంది. ప్లాట్​ఫామ్​ నుంచి కాసేపు విరామం తీసుకునేలా యువతను ప్రోత్సహించే ఫీచర్​నూ (Instagram features 2021) ప్రవేశపెట్టనుంది. ఇన్​స్టా ద్వారా యువతకు ఫేస్​బుక్​ హాని కలిగిస్తోందని ఫేస్​బుక్ మాజీ ఉద్యోగిని ఆరోపించిన వెంటనే ఈ ఫీచర్స్​ను తీసుకువస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.

సురక్షితం కాని కంటెంట్​ను యువత (Instagram new features for youth) తరచుగా చూస్తున్నట్లయితే.. అలాంటివారిని వేరే కంటెంట్ చూసే విధంగా ప్రోత్సహించనున్నారు. హానికరమైన సమాచారాన్ని యువత చూస్తున్నట్లయితే.. ప్లాట్​ఫామ్​ నుంచి కాసేపు విశ్రాంతి తీసుకోమని పాప్అప్​ వస్తుంది. దీంతో అతడు తమ విలువైన సమయాన్ని వృథా చేస్తున్నట్లు తెలుసుకోగలడని వెల్లడించింది ఆ సంస్థ.

యువతను ఫేస్​బుక్​ తప్పుదోవ పట్టిస్తుందని ఫ్రాన్సిస్ హాగెన్​ అనే ఫేస్​బుక్ మాజీ ఉద్యోగిని ఆరోపించారు. ఇన్​స్టాగ్రామ్ ద్వారా విషపూరితమైన కంటెంట్​తో యువతకు చేటుచేసే ప్రమాదం ఉందని సంబంధిత అధికార వర్గాల దృష్టికి తీసుకెళ్లారు. ఇన్​స్టాలో యువతకు హానికలిగే ప్రమాదం ఉందని ఫేస్​బుక్​కు తెలిసినా ఎలాంటి నివారణ చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఈమె ఆరోపణల వెంటనే ఫేస్​బుక్​ చర్యలకు ఉపక్రమించింది. పలు విమర్శల నేపథ్యంలో 13 ఏళ్లలోపు పిల్లల కోసం తీసుకురానున్న 'ఇన్​స్టాగ్రామ్ కిడ్స్​' లాంచింగ్​ను కూడా ఆ సంస్థ నిలుపుదల చేసింది.

ఇదీ చదవండి:మీ వాట్సాప్ రద్దయిందా?.. ఇలా చేయండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.