Man sets his bike on fire Adilabad : 'ఊకె చలాన్ వేస్తుర్రని.. బండి తగులబెట్టిన'

author img

By

Published : Nov 27, 2021, 1:52 PM IST

Updated : Nov 27, 2021, 5:53 PM IST

బైక్​కు నిప్పుబెట్టిన వాహనదారుడు, బైక్​కు చలాన్లు, ఆదిలాబాద్ న్యూస్, man burns his bike, man set his bike on fire, adilabad news

Man sets his bike on fire Adilabad : సాధారణంగా ద్విచక్రవాహనానికి ట్రాఫిక్ పోలీసులు చలానా విధిస్తే ఏం చేస్తారు. చలానా కడతారు.. లేదా కట్టకుండా తప్పించుకుంటారు కొందరు. కానీ ఓ వ్యక్తి తరచూ తన బైక్​కు చలానాలు విధిస్తున్నారని కోపంతో తన వాహనానికి తానే నిప్పు పెట్టుకున్నాడు. ఈ ఘటన ఆదిలాబాద్​లో చోటుచేసుకుంది.

Man sets his bike on fire Adilabad : ఆదిలాబాద్‌లో తన ద్విచక్రవాహనానికి పోలీసులు తరచూ చలానాలు విధిస్తున్నారని... ఓ వాహనదారుడు బైక్‌ను తగలబెట్టుకున్నాడు. ద్విచక్రవాహనంపై చలాన్లు ఉండగా.. వారం క్రితం వెయ్యి రూపాయలు కట్టినట్లు వాహనాదారుడు తెలిపాడు.

పట్టణంలోని ఖానాపూర్​కు చెందిన మాక్బూల్​.. తరచూ చలానాలు విధిస్తున్నారని ఈ ఘటనకు పాల్పడ్డాడు. ఆదిలాబాద్​లోని కిసాన్​ చౌక్​ చౌరస్తాలో తనిఖీల్లో భాగంగా అధికారులు ఇవాళ మరోసారి పరిశీలించి.. చలాన్లు పెండింగ్‌లో ఉండడంతో కొంత డబ్బు కట్టాలని అడిగారు. వారం కిందటే చలాను కట్టానని.. మరోసారి ఎక్కడినుంచి డబ్బులు తేవాలంటూ.. వాహనదారుడు అసహనానికి గురై బైక్‌కు నిప్పుపెట్టాడు. ట్రాఫిక్​ పోలీసులు నీళ్లు తీసుకొచ్చి మంటలార్పారు. విధుల్లో భాగంగానే జరిమానా విధిస్తున్నట్లు ట్రాఫిక్​ సీఐ ఫణీంద్ర తెలిపారు.

తనిఖీలు చేసేటప్పుడు బండి పేపర్లు ఇవ్వమని అతనిని అడిగాం. లేవు అని చెప్పాడు. వెళ్లి తీసుకురమ్మన్నాం. లేదంటే జరిమానా వేస్తామని చెప్పాం. అంతలోనే బైక్​ను తగలబెట్టుకున్నాడు. అతనిపై కేసు నమోదు చేశాం. -ఫణీంద్ర, ట్రాఫిక్​ సీఐ

అదే చౌరస్తాలో రైతులు ఆందోళన కొనసాగిస్తుండగా .. నడి రోడ్డుపై ఈ ఘటన జరిగింది. సదరు వాహనదారుడిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

ఆదిలాబాద్ కిసాన్‌ చౌక్‌లో తన బైక్‌కు నిప్పుపెట్టిన వాహనదారుడు

ఇవీ చదవండి :

  • మద్యం మత్తులో... తన ద్విచక్రవాహనంపై పోలీసులు తరచూ చలాన్లు విధిస్తున్నారని వాహనాన్ని తుగులబెట్టుకున్నాడో యువకుడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా పెద్దేముల్​లో జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
  • చాలా మంది వాహనదారులు ఈ-చలాన్ల నుంచి తప్పించుకునేందుకు నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్​ చేయడం, నంబర్ ప్లేట్​ను తీసివేయడం, తప్పుడు ప్లేట్​ను పెట్టుకుని తిరుగుతున్నారని కరీంనగర్ జిల్లా ఎల్​ఎండీ పోలీసులు గుర్తించారు. ఇలాంటి వాహనాలు గుర్తించేందుకు తనిఖీలు చేపట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
  • నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై వాహనాలను నడిపిన వ్యక్తులను ఈ-చలాన్లు భయపెడుతున్నాయి. పెండింగ్ చలాన్లు(pending challans vehicle seize) ఉన్న వాహనాల్లో ప్రభుత్వ వెహికిల్స్ కూడా ఉండడం గమనార్హం. ఓ కలెక్టర్ వాహనంపై ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 28 చలాన్లు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
  • చాలా మంది వాహనచోదకులు ఈ-చలాన్ల నుంచి తప్పించుకునేందుకు నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్​ చేయడం, నంబర్ ప్లేట్​ను తీసివేయడం, తప్పుడు ప్లేట్​ను ఉపయోగించడం, సిగ్నల్​ పట్టించుకోకపోడం తదితరాలు చేస్తుండడం చూస్తున్నాం. అలా చలాన్లు కట్టకుండా తప్పించుకొని తిరురుగుతున్న ద్విచక్ర వాహన దారుడు మహ్మద్ ఫరిద్ ఖాన్ చివరికి ఇలా చిక్కాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
  • వాహనం వేగంగా నడిపినా.. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోయినా సాధారణంగా చలాన్లు విధిస్తారు. సాధారణ పౌరులు నిబంధనలు ఉల్లంఘిస్తే చలాన్లు విధించడం పరిపాటే. కానీ ఓ అధికారి వాహనమే రూల్స్ పాటించకపోతే ఏం చేస్తారు? తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
Last Updated :Nov 27, 2021, 5:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.