ETV Bharat / state

ఒకే వాహనానికి 54 చలాన్లు పెండింగ్‌..

author img

By

Published : Mar 23, 2021, 9:47 AM IST

54 e-challans for a vehicle in karimnagar
పెండింగ్ చలాను కడితేనే.. బండి ఇచ్చేది!

చాలా మంది వాహనాదారులు ఈ-చలాన్లు తప్పించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది గమనించిన పోలీసులు అలాంటి వాహనాలు గుర్తించేందుకు తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా కరీంనగర్​కు చెందిన ఓ వ్యక్తి వాహనానికి 54 చలాన్లు పెండింగ్​ ఉండటం గమనించారు.

చాలా మంది వాహనదారులు ఈ-చలాన్ల నుంచి తప్పించుకునేందుకు నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్​ చేయడం, నంబర్ ప్లేట్​ను తీసివేయడం, తప్పుడు ప్లేట్​ను పెట్టుకుని తిరుగుతున్నారని కరీంనగర్ జిల్లా ఎల్​ఎండీ పోలీసులు గుర్తించారు. ఇలాంటి వాహనాలు గుర్తించేందుకు తనిఖీలు చేపట్టారు.

పెండింగ్ చలాను కడితేనే.. బండి ఇచ్చేది!

ఈ క్రమంలో కరీంనగర్​ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి వాహనానికి 54 చలాన్లు పెండింగ్ ఉండటం గుర్తించారు. పెండింగ్​లో ఉన్న రూ.15,884 నగదును క్లియర్ చేయించారు. ఈ స్పెషల్ డ్రైవ్​లో నంబర్ ప్లేట్ లేని 25 వాహనాలకు పెండింగ్ ఉన్న రూ.65,975లను వాహనదారులు చెల్లించిన తర్వాతే వాహనాలు అప్పగించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.