ETV Bharat / business

వారాంతంలో 'బుల్'​ జోరు.. సెన్సెక్స్​ 630, నిఫ్టీ 180 ప్లస్​

author img

By

Published : May 27, 2022, 3:40 PM IST

Stock Market Close
Stock Market Close

Stock Markets Close: స్టాక్​ మార్కెట్లలో వరుసగా రెండో సెషన్​లోనూ లాభాల జోరు కొనసాగింది. అంతర్జాతీయంగా బలమైన సంకేతాలతో సెన్సెక్స్ 630, నిఫ్టీ 180 పాయింట్లకుపైగా లాభపడ్డాయి. ​

Stock Markets Close: దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు వరుసగా రెండో సెషన్​లో దూసుకెళ్లాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 632 పాయింట్లు పెరిగి.. 54 వేల 885 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్​ దాదాపు 700 పాయింట్ల లాభంతో 54 వేల 937 వద్ద సెషన్​ గరిష్ఠాన్ని నమోదుచేసింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 182 పాయింట్ల లాభంతో 16 వేల 352 వద్ద సెషన్​ను ముగించింది. గత సెషన్​లో సెన్సెక్స్​ 503, నిఫ్టీ 144 పాయింట్లు పెరిగాయి.

ఆయిల్​ అండ్​ గ్యాస్​, లోహ రంగ సూచీలు మినహా అన్నీ లాభాల్లో ట్రేడయ్యాయి. మిడ్​, స్మాల్​ క్యాప్​ సూచీలు ఒక శాతం చొప్పున పుంజుకున్నాయి. అపోలో హాస్పిటల్, టెక్​ మహీంద్రా, హెచ్​డీఎఫ్​సీ లైఫ్​, ఇండస్​ఇండ్​ బ్యాంక్​, హీరో మోటోకార్ప్​ రాణించాయి. ఓఎన్​జీసీ, ఎన్​టీపీసీ, భారతీ ఎయిర్​టెల్​, పవర్​గ్రిడ్​ కార్పొరేషన్​, టాటా స్టీల్​ పతనమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూలతలు దేశీయ సూచీలపై ప్రభావం చూపాయి. అమెరికా మార్కెట్లు గురువారం సెషన్​లో లాభాలతో ముగిసిన నేపథ్యంలో.. మన సూచీలు పుంజుకున్నట్లు మార్కెట్​ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అక్కడి టెక్‌ స్టాక్‌లలో కొనుగోళ్లు వెల్లువెత్తడం కలిసొచ్చింది. చమురు ధరలు పెరగడం మాత్రం మదుపర్లను కలవరపెడుతోంది. ఆసియా-పసిఫిక్‌ సూచీలు సైతం అన్నీ లాభాల్లోనే ఉన్నాయి.

ఇవీ చూడండి: మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. భారీగా పతనమైన క్రిప్టో.. నేటి లెక్కలు ఇలా

ఒక ఛార్జింగ్‌తో 590 కి.మీ. ప్రయాణం.. బీఎండబ్ల్యూ ఐ4 సెడాన్​ ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.