ETV Bharat / business

Stock Market Today 4th October 2023 : భారీ నష్టాల్లో దేశీయ స్టాక్​ మార్కెట్లు.. 19,400 పాయింట్ల దిగువకు నిఫ్టీ!

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 4, 2023, 10:01 AM IST

Updated : Oct 4, 2023, 10:48 AM IST

Stock Market Today 4th October 2023 In Telugu : దేశీయ స్టాక్​ మార్కెట్లు బుధవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడమే ఇందుకు కారణం. ప్రస్తుతం సెన్సెక్స్​ 450 పాయింట్లు నష్టపోయి 65,061 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 134 పాయింట్లు కోల్పోయి 19,394 వద్ద కొనసాగుతోంది.

Share Market Today 4th October 2023
Stock Market Today 4th October 2023

Stock Market Today 4th October 2023 : బుధవారం దేశీయ స్టాక్​ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడం, విదేశీ పెట్టుబడులు తరలి వెళ్తుండడమే ఇందుకు కారణం.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 450 పాయింట్లు నష్టపోయి 65,061 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 134 పాయింట్లు కోల్పోయి 19,394 వద్ద ట్రేడ్​ అవుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న షేర్స్​ : నెస్లే ఇండియా, హిందూస్థాన్​ యూనీలీవర్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, ఏసియన్ పెయింట్స్​, బజాజ్​ ఫైనాన్స్​​, టైటాన్​
  • నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : ఇండస్ఇండ్ బ్యాంక్​, ఎన్​టీపీసీ, యాక్సిస్ బ్యాంక్​, మారుతి సుజుకి, టాటా స్టీల్​, ఐసీఐసీఐ బ్యాంక్​

ఒడుదొడుకులు ఉంటాయి.. జాగ్రత్త​!
శుక్రవారం ఆర్​బీఐ ద్రవ్య పరపతి విధానం (మోనిటరీ పాలసీ) ప్రకటన చేయనుంది. కనుక ఇంట్రాడే ట్రేడింగ్​లో ఒడుదొడుకులు సహజంగా ఉంటాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

ఆసియా మార్కెట్లు
సియోల్​, టోక్యో, హాంకాంగ్​ లాంటి ఆసియా మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఒక్క షాంఘై స్టాక్​ మార్కెట్ మాత్రమే స్వల్ప లాభాలతో కొనసాగుతోంది.

US Markets : యూఎస్ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి.

ట్రెండ్ ఎలా ఉందంటే?
ప్రస్తుతం యూఎస్​ బాండ్ ఈల్డ్స్​ బాగా పెరుగుతున్నాయి. అందువల్లనే విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FII).. తమ పెట్టుబడులను భారత్​ నుంచి తరలిస్తున్నారు. ఈ ట్రెండ్ మరింత కాలం కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే.. ప్రస్తుతం డాలర్​ ఇండెక్స్​ 107 పైన ఉంది. యూఎస్​ 10 సంవత్సరాల బాండ్ ఈల్డ్​ 4.83 శాతంగా ఉంది. దీని అర్థం ఏమిటంటే.. మరికొన్నాళ్లపాటు విదేశీ పెట్టుబడులు.. మన దేశం నుంచి క్రమంగా తరలివెళ్లే అవకాశం ఉంది.

ఇదే మంచి తరుణం
దేశీయ స్టాక్​ మార్కెట్లు నష్టాల్లో ఉన్నప్పటికీ.. ఇది మదుపరులకు మంచి అవకాశం అనే చెప్పవచ్చు. ఎందుకంటే.. చాలా మంచి ఈక్విటీ స్టాక్స్​ ఇప్పుడు చాలా తక్కువ ధరకే లభిస్తున్నాయి. ఇలాంటి సమయంలో వాటిని కొనుగోలు చేసుకుంటే.. భవిష్యత్​లో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

ముడి చమురు ధరలు
Crude Oil Price 4th October 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలు 0.10 శాతం తగ్గాయి. ప్రస్తుతం బ్యారెల్​ ముడిచమురు ధర 90.83 డాలర్లుగా ఉంది.

Gold Rate Today 4th October 2023 : క్రమంగా దిగివస్తున్న గోల్డ్​, సిల్వర్​ రేట్లు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

UPI Vs UPI Lite : బేసిక్​ ఫోన్​తో పేమెంట్స్​ చేయాలా?.. UPI & యూపీఐ లైట్​ వాడండిలా!

Last Updated : Oct 4, 2023, 10:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.