ETV Bharat / business

UPI Vs UPI Lite : బేసిక్​ ఫోన్​తో పేమెంట్స్​ చేయాలా?.. UPI & యూపీఐ లైట్​ వాడండిలా!

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 3, 2023, 7:51 PM IST

UPI Vs UPI Lite In Telugu : భారతదేశంలో ఇప్పుడు యూపీఐ పేమెంట్స్ బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. సులువుగా డిజిటల్ పేమెంట్స్ చేసుకోవడానికి వీలుగా ఉండడమే ఇందుకు కారణం. అయితే యూపీఐతో పాటు ఇప్పుడు యూపీఐ లైట్​ కూడా అందుబాటులోకి వచ్చింది. మరి ఈ రెండింటి గురించి ఇప్పుడు తెలుసుకుందామా?

UPI Lite vs UPI
UPI Vs UPI Lite

UPI Vs UPI Lite : డిజిటల్ ఇండియా కల సాకారం అయ్యే సూచనలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. నేడు ప్రతి ఒక్కరూ యునైటెడ్ పేమెంట్స్​ ఇంటర్ఫేస్​ (యూపీఐ), యూపీఐ లైట్​లను ఉపయోగించి సులువుగా డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నారు.

  • యూపీఐ అనేది ఒక సమగ్రమైన వేదిక అని చెప్పవచ్చు. ముఖ్యంగా వివిధ బ్యాంక్ అకౌంట్లను లింక్​ చేసుకుని.. యూపీఐ పేమెంట్స్ చేయవచ్చు. అలాగే ఎలాంటి అడ్డంకులు లేకుండా సులువుగా డిజిటల్​ పేమెంట్స్​ చేయవచ్చు. అలాగే ఎన్నో బ్యాంకింగ్ సర్వీసులను కూడా పొందవచ్చు.
  • యూపీఐ లైట్ అనేది ఒక సింప్లిఫైడ్ వెర్షన్​. దీనిని బేసిక్ ఫోన్​లో కూడా ఉపయోగించుకోవచ్చు. కాల్​ లేదా టెక్ట్స్​ చేసి యూపీఐ పేమెంట్స్ చేయడానికి కూడా ఇది వీలు కల్పిస్తుంది.

యూపీఐ అంటే ఏమిటి?
What is UPI : యూపీఐ అనేది 24x7 పనిచేసే పేమెంట్ సిస్టమ్​. దీనిని ఉపయోగించి రియల్​ టైమ్​లో మనీ ట్రాన్స్​ఫర్ చేయవచ్చు.

యూపీఐ లైట్ అంటే ఏమిటి?
What is UPI Lite : యూపీఐ లైట్ అనేది ఒక ఆన్​-డివైజ్​ వాలెట్ ఫీచర్​. దీనిని ఉపయోగించి రియల్​ టైమ్​లో.. చిన్న మొత్తాల్లో మనీ ట్రాన్స్​ఫర్ చేయవచ్చు.

యూపీఐ లైట్​ Vs యూపీఐ​
Difference Between UPI Lite and UPI : యూపీఐ, యూపీఐ లైట్​ మధ్య కొన్ని కచ్చితమైన భేదాలు ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • యూపీఐ లైట్​ ద్వారా చిన్న మొత్తాల్లో ఫండ్​ ట్రాన్స్​ఫర్, పేమెంట్స్​ చేసుకోవచ్చు. అయితే దీనిలో కొన్ని అధునాతన ఫీచర్లు ఉండవు. అయితే ఇంటర్నెట్​ సదుపాయం లేని ప్రాంతాల్లో కూడా దీని ద్వారా సులువుగా పేమెంట్స్ చేసుకోవడానికి వీలవుతుంది. అలాగే బేసిక్​ ఫోన్​తో కూడా ఆర్థిక లావాదేవీలు చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది.
  • యూపీఐ అనేది ఒక సమగ్రమైన ప్లాట్​ఫారం. దీనిలో పేమెంట్స్, ఫండ్ ట్రాన్స్​ఫర్​ సహా అన్ని బ్యాంకింగ్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి.

అన్ని యాప్​ల్లోనూ ఇవి పనిచేస్తాయా?

  • ఎన్​పీసీఐలో సభ్యత్వం ఉన్న అన్ని బ్యాంకులు కూడా యూపీఐ ఫెసిలిటీని అందిస్తున్నాయి. అలాగే BHIM, గూగుల్ పే, పేటీఎం, ఫోన్​పే లాంటి TPAP అప్లికేషన్​లు కూడా యూపీఐ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి.
  • BHIM, పేటీఎం, సహా కొన్ని యాప్​ల్లో.. యూపీఐ లైట్​ ఫీచర్​ అందుబాటులో ఉంది. ప్రస్తుతానికి 8 బ్యాంకులు మాత్రమే తమ కస్టమర్లకు యూపీఐ లైట్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి.

ట్రాన్సాక్షన్స్ ఎలా చెక్ చేసుకోవాలి?

  • యూపీఐ లైట్ కస్టమర్లు ఒక రోజులో చేసిన ట్రాన్సాక్షన్స్ వివరాలు అన్నీ SMS ద్వారా తెలుసుకోగలుగుతారు.
  • యూపీఐ కస్టమర్లు తమ ఆర్థిక లావాదేవీలను .. యూపీఐ మొబైల్ అప్లికేషన్​లోని ట్రాన్సాక్షన్​ హిస్టరీలో చూసుకోవచ్చు.

ట్రాన్సాక్షన్​ లిమిట్ ఎంత?
UPI vs UPI Lite Transaction Limit :

  • యూపీఐ ద్వారా ఒక రోజులో గరిష్ఠంగా రూ.2 లక్షలు వరకు పంపించవచ్చు. అలాగే ఒక రోజులో (24 గంటల్లో) 20 ట్రాన్సాక్షన్స్ వరకు చేసుకోవచ్చు.
  • యూపీఐ లైట్​ యూజర్లు ఒక రోజులో గరిష్ఠంగా రూ.4,000 వరకు ట్రాన్స్​ఫర్ చేసుకోవచ్చు. అలాగే ఒక రోజులో ఎన్నైనా ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. అయితే ఒకసారికి గరిష్ఠంగా రూ.500 వరకు మాత్రమే పంపించడానికి వీలు అవుతుంది.

యూపీఐ పిన్​

  • యూపీఐ పేమెంట్స్ చేయాలంటే.. 4 లేదా 6 అంకెల పిన్​ను కచ్చితంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
  • యూపీఐ లైట్​ ద్వారా చేసే పేమెంట్స్​కు ఎలాంటి పిన్​ ఎంటర్​ చేయాల్సిన అవసరం ఉండదు.

నోట్​ : వాస్తవానికి యూపీఐతో డబ్బులను స్వీకరించవచ్చు. అయితే యూపీఐ లైట్​తో.. మీ వాలెట్​ నుంచి కేవలం డబ్బులు పంపించడానికి మాత్రమే వీలు అవుతుంది.

Google Payలో యూపీఐ లైట్‌ని యాక్టివేట్ చేసుకోండిలా!

  • మొదట మీరు ఫోన్​లో Google Pay యాప్‌ను ఇన్​స్టాల్ చేసుకుని దానిని ఓపెన్ చేయాలి.
  • యాప్​లోని ప్రొఫైల్ ఐకాన్​పై క్లిక్ చేయాలి.
  • అప్పుడు కాస్త దిగువకు వస్తే 'యూపీఐ లైట్‌ యాక్టివేషన్‌కు సంబంధించిన ఆప్షన్‌' ఉంటుంది.
  • దానిపై క్లిక్ చేసి.. మీ యూపీఐ లైట్ యాక్టివేషన్​కు సంబంధించిన సూచనలు పాటించి దీనిని యాక్టివేట్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత డబ్బును జోడించడానికి UPI లైట్‌కి మద్దతిచ్చే అర్హత గల బ్యాంక్ ఖాతాను ఎంచుకొని మనీ యాడ్ చేసుకోవాలి.
  • ఇలా గూగుల్ పే ద్వారా మీరు పిన్ నమోదు చేయకుండానే మీ చెల్లింపులు చేయవచ్చు.

PhonePeలో యూపీటై లైట్‌ని యాక్టివేట్ చేసుకోండిలా!

  • ఫోన్‌పే యాప్‌ ఓపెన్ చేయగానే మీకు హోమ్‌ స్క్రీన్‌పై 'UPI Lite' ఆప్షన్‌ కనిపిస్తోంది. అప్పుడు దానిపై క్లిక్‌ చేయాలి.
  • ఆ తర్వాత మీరు యూపీఐ లైట్‌ అకౌంట్​లో జమ చేయదలచుకున్న మొత్తాన్ని అక్కడ ఎంటర్ చేసి బ్యాంక్‌ అకౌంట్‌ను ఎంచుకోవాలి.
  • అనంతరం మీ యూపీఐ పిన్‌ ఎంటర్‌ చేయగానే మీ 'UPI Lite' ఖాతా యాక్టివేట్‌ అవుతుంది.
  • ఆ తర్వాత మీరు ఎక్కడైనా ఏ క్యూర్‌ కోడ్‌నైనా స్కాన్‌ చేసి మీ పేమెంట్‌ను పూర్తి చేయొచ్చు.

Paytmలో UPI లైట్‌ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే..

  • మొదట మీరు Paytm యాప్‌ని ఓపెన్ చేయాలి.
  • హోమ్ పేజీలో కనిపిస్తున్న 'Introducing UPI Lite'పై క్లిక్ చేయాలి.
  • Paytm UPI Lite ద్వారా సపోర్ట్ చేసే లింక్ చేయబడిన బ్యాంక్ అకౌంట్ ఎంచుకొని.. UPI లైట్‌కి డబ్బుని యాడ్ చేయాలి.
  • ఇలా మీరు మనీ యాడ్ చేసుకున్న తర్వాత.. ఎక్కడైనా QR కోడ్‌ని స్కాన్ చేయడం ద్వారా లేదా UPI IDతో లింక్ చేయబడిన మొబైల్ నంబర్‌కు డబ్బులు చెల్లించవచ్చు.

యూపీఐతో.. ఇంటర్నెట్ లేకున్నా.. పేమెంట్స్ చేయండిలా!
UPI Payments Without Active Internet :

1. UPI 123Pay : స్మార్ట్​ఫోన్, ఇంటర్నెట్ సౌకర్యంలేని వ్యక్తులు ఈ యూపీఐ 123పే ద్వారా ఆర్థిక లావాదేవీలు (మనీ ట్రాన్స్​ఫర్​) చేసుకోవచ్చు. ఇంటరాక్టివ్​ వాయిస్​ రెస్పాన్స్​ (IVR) ద్వారా కస్టమర్లు ఆర్థిక లావాదేవీలను పూర్తి చేయవచ్చు. ఇందుకోసం కస్టమర్లు ముందుగా యూపీఐ నంబర్​ 080 4516 3571కు కాల్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ విధానం ద్వారా కసమర్లు ఒకసారికి కేవలం రూ.5000 మాత్రమే ట్రాన్స్​ఫర్ చేయగలరు. మొత్తంగా చూసుకుంటే.. ఒక రోజులో రూ.1,00,000 లిమిట్​ వరకు యూపీఐ పేమెంట్స్​ చేయవచ్చు.

2. UPI plug in Service : సాధారణంగా ఆన్​లైన్​లో ఏదైనా కొనుగోలు చేసినప్పుడు.. పేమెంట్స్ చేయడం కోసం ఇతర యాప్​లకు డైవర్ట్ అవుతాం. కానీ యూపీఐ ప్లగ్​-ఇన్​ సర్వీస్ ద్వారా ఇతర యాప్​ల్లోకి వెళ్లకుండానే.. నేరుగా పేమెంట్స్ చేయవచ్చు.

3. Autopay on QR code : ఆటోమేటిక్​గా చెల్లింపులు చేయడానికి వీలుగా హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ 'ఆటోపే' ఫెసిలిటీని అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యంగా స్ట్రీమింగ్ సర్వీస్​, సబ్​స్క్రిప్షన్స్​లను మరలా రెన్యూవల్ చేసుకునేటప్పుడు ఇది ఉపయోగపడతుంది. ఇందు కోసం యూపీఐ క్యూఆర్​ కోడ్​ను స్కాన్ చేసి.. ఆటోమేటిక్ పేమెంట్స్​ను ముందుగానే సెట్​చేసుకోవాలి. దీని వల్ల ప్రతిసారీ మాన్యువల్​గా ఆర్థికలావాదేవీలు చేయాల్సిన అవసరం తప్పుతుంది.

Loan Default : ఒకసారి లోన్‌ డిఫాల్డ్‌ అయితే.. మళ్లీ బ్యాంక్ రుణం మంజూరు అవుతుందా?​

How Is Gold Price Calculated In India : భారతదేశంలో బంగారు ఆభరణాల విలువను ఎలా లెక్కిస్తారో.. మీకు తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.