ETV Bharat / business

Stock Market Today 15th September 2023 : భారీ లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. జీవనకాల గరిష్ఠాలను చేరిన సూచీలు!

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 15, 2023, 10:06 AM IST

Updated : Sep 15, 2023, 4:29 PM IST

Share Market Today 15th September 2023 :
Stock Market Today 15th September 2023 :

16:26 September 15

జీవనకాల గరిష్ఠాలను నమోదు చేసిన సెన్సెక్స్​, నిఫ్టీ

శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. ఆటో, టెక్​, టెలికాం షేర్లు మంచి లాభాలను నమోదుచేశాయి. అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ కావడం, విదేశీ పెట్టుబడులు పెరగడం, దేశీయ వృద్ధి అంచనాలు ఆశాజనకంగా ఉండడం వల్ల.. దేశీయ స్టాక్​ మార్కెట్లు వరుసగా 11వ రోజు కూడా భారీ లాభాలను మూటగట్టుకున్నాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 319 పాయింట్లు లాభపడి 67,838 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 89 పాయింట్లు వృద్ధి చెంది 20,192 వద్ద స్థిరపడింది.

  • లాభపడిన షేర్స్​ : ఎం అండ్​ ఎం, భారతీ ఎయిర్​టెల్​, టాటా మోటార్స్​, టెక్​ మహీంద్రా, హెచ్​సీఎల్​ టెక్, విప్రో, టీసీఎస్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, మారుతి సుజుకి, ఇన్ఫోసిస్​, రిలయన్స్​
  • నష్టపోయిన స్టాక్స్​ : ఏసియన్​ పెయింట్స్​, బజాజ్​ ఫిన్​సెర్వ్​, ఎన్​టీపీసీ, ఐటీసీ, టైటాన్​, కోటక్​బ్యాంక్​, పవర్​గ్రిడ్​, ఎల్ అండ్ టీ

ఆసియా మార్కెట్లు
ఆసియా మార్కెట్లలో సియోల్​, టోక్యో, హాంకాంగ్​ మార్కెట్లు మంచి లాభాలతో స్థిరపడ్డాయి. షాంఘై స్టాక్​ మార్కెట్​ మాత్రం నష్టాలతో ముగిసింది.

గ్లోబల్ మార్కెట్స్​
ప్రస్తుతం యూరోపియన్ ఈక్విటీలు మంచి లాభాలతో ట్రేడవుతున్నాయి. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్​ కీలక వడ్డీ రేట్ల పెంపును వాయిదా వేయడమే ఇందుకు కారణం. కాగా, గురువారం యూఎస్​ మార్కెట్లు లాభాలతో ముగిసిన విషయం తెలిసిందే.

15:47 September 15

వరుసగా 11వ రోజు భారీ లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. ఆటో, టెక్​ షేర్లు మంచి లాభాలను నమోదుచేశాయి. అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ కావడం, విదేశీ పెట్టుబడులు పెరగడం, దేశీయ వృద్ధి అంచనాలు ఆశాజనకంగా ఉండడమే ఇందుకు కారణం.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 319 పాయింట్లు లాభపడి 67,838 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 89 పాయింట్లు వృద్ధి చెంది 20,192 వద్ద స్థిరపడింది.

లాభపడిన షేర్స్​ : ఎం అండ్​ ఎం, భారతీ ఎయిర్​టెల్​, టాటా మోటార్స్​, టెక్​ మహీంద్రా, హెచ్​సీఎల్​ టెక్, విప్రో, టీసీఎస్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, మారుతి సుజుకి, ఇన్ఫోసిస్​, రిలయన్స్​

నష్టపోయిన స్టాక్స్​ : ఏసియన్​ పెయింట్స్​, బజాజ్​ ఫిన్​సెర్వ్​, ఎన్​టీపీసీ, ఐటీసీ, టైటాన్​, కోటక్​బ్యాంక్​, పవర్​గ్రిడ్​, ఎల్ అండ్ టీ

15:14 September 15

రికార్డ్​ల మీద రికార్డులు బ్రేక్​.. దూకుడు పెంచుతున్న బుల్​!

రోజు గడుస్తున్న కొద్దీ దేశీయ స్టాక్ మార్కెట్ల దూకుడు మరింతగా పెరుగుతోంది. దేశీయ స్టాక్​ మార్కెట్ సూచీలు జీవనకాల గరిష్ఠాలను తాకాయి.

ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 333 పాయింట్లు లాభపడి 67,852 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 94 పాయింట్లు వృద్ధి చెంది 20,197 వద్ద హై రికార్డ్​తో ట్రేడ్​ అవుతోంది.

14:52 September 15

రికార్డ్​ల మీద రికార్డులు బ్రేక్​.. దూకుడు పెంచుతున్న బుల్​!

దేశీయ స్టాక్ మార్కెట్ల దూకుడు మరింతగా పెరుగుతోంది. ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 290 పాయింట్లు లాభపడి 67,809 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 83 పాయింట్లు వృద్ధి చెంది 20,186 వద్ద హైరికార్డ్​తో ట్రేడ్​ అవుతోంది.

14:13 September 15

కొనసాగుతున్న బుల్ జోరు.. ఆల్​టైమ్ హైరికార్డ్స్​ నమోదు

దేశీయ స్టాక్ మార్కెట్ల దూకుడు మరింతగా పెరుగుతూ ఉంది. ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 276 పాయింట్లు లాభపడి 67,795 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 79 పాయింట్లు వృద్ధి చెంది 20,182 వద్ద రికార్డ్​ హైతో ట్రేడ్​ అవుతోంది.

13:27 September 15

స్పైస్​జెట్​ షేర్స్​ 4% జంప్​ .. లాభాల జోరులో టెక్​, ఆటో షేర్స్​!

శుక్రవారం స్పైస్​జెట్​ షేర్​ ధరలు 4 శాతానికి పైగా పెరిగాయి. స్పైస్​జెట్ కంపెనీ.. గ్లోబల్ ఇన్వెస్ట్​మెంట్ బ్యాంకు క్రెడిట్​ సూయిస్​కు ఇవ్వాల్సిన 1.5 మిలియన్​ డాలర్ల రుణాన్ని పూర్తిగా చెల్లించింది. దీనితో మదుపరులు ఈ షేర్స్ కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

దేశీయ స్టాక్ మార్కెట్ల దూకుడు ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 251 పాయింట్లు లాభపడి 67,770 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 75 పాయింట్లు వృద్ధి చెంది 20,179 వద్ద ట్రేడ్​ అవుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న షేర్స్​ : ఎం అండ్ ఎం, హెచ్​సీఎల్​ టెక్​, టీసీఎస్​, టెక్​ మహీంద్రా, టాటా మోటార్స్​, విప్రో, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, మారుతి సుజుకి, స్పైస్​ జెట్​
  • నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : ఏసియన్​ పెయింట్స్​, పవర్​గ్రిడ్​, టాటాస్టీల్​, ఎన్​టీపీసీ, ఎల్​ అండ్ టీ, ఎస్​బీఐ

12:49 September 15

దూకుడుమీదున్న దేశీయ స్టాక్​ మార్కెట్లు.. లాభాల జోరులో ఆటో సెక్టార్​!

దేశీయ స్టాక్ మార్కెట్ల దూకుడు కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 152 పాయింట్లు లాభపడి 67,671 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 40 పాయింట్లు వృద్ధి చెంది 20,143 వద్ద ట్రేడ్​ అవుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న షేర్స్​ : హెచ్​సీఎల్​ టెక్​, టీసీఎస్​, టాటా మోటార్స్​, విప్రో, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, మారుతి సుజుకి
  • నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : ఏసియన్​ పెయింట్స్​, పవర్​గ్రిడ్​, టాటాస్టీల్​, ఎన్​టీపీసీ, ఎల్​ అండ్ టీ

11:16 September 15

తగ్గేదేలే.. అంటున్న దేశీయ స్టాక్​ మార్కెట్లు!

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ట్రేడవుతున్నాయి. ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 263 పాయింట్లు లాభపడి 67,782 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 81 పాయింట్లు వృద్ధి చెంది 20,184 వద్ద ట్రేడ్​ అవుతోంది.

స్టాక్ మార్కెట్​ సూచీలు బీఎస్​ఈ సెన్సెక్స్​, ఎన్​ఎస్​ఈ నిఫ్టీలు.. ఇవాళ తమ జీవనకాల గరిష్ఠాలను పదేపదే బ్రేక్​ చేస్తూనే ఉన్నాయి.

09:37 September 15

Stock Market Today 15th September 2023 : వరుసగా 11వ రోజు కూడా భారీ లాభాలతో ట్రేడవుతున్న దేశీయ స్టాక్​మార్కెట్లు!

Stock Market Today 15th September 2023 : దేశీయ స్టాక్​ మార్కెట్లు వరుసగా 11వ రోజు కూడా భారీ లాభాలతో దూసుకుపోతున్నాయి. దేశీయ వృద్ధి అంచనాలు చాలా ఆశాజనకంగా ఉండడమే దీనికి ప్రధాన కారణం. కాగా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడం సహా, విదేశీ పెట్టుబడులు భారీగా పెరగడంతో.. శుక్రవారం దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు.. జీవనకాల గరిష్ఠాలను నమోదుచేశాయి.

ఆల్​టైమ్​ రికార్డ్​ : శుక్రవారం ఉదయం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 67,774 పాయింట్లతో జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. అలాగే నేషనల్​ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 20,173 పాయింట్లతో లైఫ్​లైట్​ హైరికార్డ్​ను నమోదు చేసింది.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ ప్రస్తుతం 159 పాయింట్లు లాభపడి 67,678 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 44 పాయింట్లు వృద్ధి చెంది 20,148 వద్ద ట్రేడ్​ అవుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న షేర్స్​ : హెచ్​సీఎల్​ టెక్​, టాటా మోటార్స్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, విప్రో, సన్​ఫార్మా, టీసీఎస్​
  • నష్టాల్లో కొనసాగుతున్న షేర్స్​ : ఏసియన్​ పెయింట్స్​, టైటాన్​, యాక్సిస్​ బ్యాంక్​, పవర్​గ్రిడ్​, భారతీ ఎయిర్​టెల్​

ఆసియా మార్కెట్లు
Asian Markets Today 15th September 2023 : ఆసియా మార్కెట్లలో.. సియోల్​, టోక్యో, షాంఘై, హాంకాంగ్​ మార్కెట్లు అన్నీ ప్రస్తుతం లాభాలతో ట్రేడవుతున్నాయి. మరోవైపు గురువారం యూఎస్​ మార్కెట్లు కూడా మంచి లాభాలతో ముగిశాయి. ఇవి మన దేశీయ మార్కెట్లపై సానుకూల ప్రభావాన్ని చూపాయి.

విదేశీ పెట్టుబడుల వెల్లువ
స్టాక్ ఎక్స్ఛేంజీల డేటా ప్రకారం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు గురువారం మొత్తంగా రూ.294.69 కోట్ల మేర భారతదేశంలో ఇన్వెస్ట్ చేశారు. ఇది మదుపరుల సెంటిమెంట్​ను మరింత పెంచింది.

బ్లూచిప్ స్టాక్స్​
ఇన్ఫోసిస్​, రిలయన్స్​, ఎల్​ అండ్ టీ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, ఐసీఐసీఐ బ్యాంక్​ లాంటి బ్లూచిప్​ స్టాక్స్​ కూడా ఈ ర్యాలీలో మంచిగా పెర్ఫార్మ్​ చేస్తున్నాయి.

మదుపరులు .. కాస్త జాగ్రత్త!
దేశీయ మార్కెట్లు మంచి లాభాలతో దూసుకుపోతున్నప్పటికీ.. మదుపరులు చాలా జాగ్రత్తగా ఉండాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే, ఇప్పటికే చాలా స్టాక్స్​.. హై వాల్యూషన్​లోకి వెళ్లిపోయాయి. కనుక అలాంటి స్టాక్స్​ నుంచి లాభాలు స్వీకరించడం మంచిదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు ముడిచమురు ధరలు, డాలర్ ఇండెక్స్ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇదే గనుక జరిగితే మార్కెట్​పై నెగిటివ్​ ఇంపాక్ట్ పడే అవకాశం ఉందని వారు స్పష్టం చేస్తున్నారు.

Last Updated : Sep 15, 2023, 4:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.