ETV Bharat / business

ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డ్​ బెనిఫిట్స్​లో కోత - ఇకపై వారికి మాత్రమే లాంజ్‌ యాక్సెస్‌!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 6, 2024, 11:15 AM IST

ICICI Credit card reward points
ICICI Credit card benefits

ICICI Bank Slashes Airport Lounge Access Benefits In Telugu : ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు వాడుతున్నవారికి అలర్ట్​. ఐసీఐసీఐ బ్యాంక్‌ తమ క్రెడిట్ కార్డు యూజర్లకు ఇచ్చే ప్రయోజనాల్లో పలు మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది. దీనితో లాంజ్‌ యాక్సెస్‌, రివార్డు పాయింట్లలో చాలా మార్పులు రానున్నాయి. పూర్తి వివరాలు మీ కోసం.

ICICI Bank Slashes Airport Lounge Access Benefits : భారతదేశంలో రెండో అతిపెద్ద ప్రైవేట్​ రంగ బ్యాంక్ అయిన​ ఐసీఐసీఐ బ్యాంక్‌ తమ క్రెడిట్​కార్డులపై ఇచ్చే బెనిఫిట్స్​లో పలు మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా డొమెస్టిక్‌ ఎయిర్‌పోర్ట్‌ లాంజ్‌ యాక్సెస్‌ నిబంధనల్లో ఈ మార్పులు తీసుకొస్తున్నట్లు స్పష్టం చేసింది. 21 రకాల ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డుల విషయంలో ఈ మార్పులు చోటుచేసుకోనున్నాయి. లాంజ్‌ యాక్సెస్‌ కోసం, రివార్డ్ పాయింట్ల కోసం కొత్తగా కనీస వ్యయ పరిమితిని తీసుకొస్తున్నారు.

లాంజ్ యాక్సెస్ పొందాలంటే?
ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డ్ యూజర్లు ఇకపై దేశీయ విమానాశ్రయాల్లో లాంజ్‌ యాక్సెస్‌ పొందాలంటే, త్రైమాసికానికి కనీసం రూ.35,000 వరకు క్రెడిట్ కార్డు ద్వారా ఖర్చు చేయాల్సి ఉంటుంది. 2024 ఏప్రిల్‌ 1 నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి రానుంది. ఉదాహరణకు జనవరి - మార్చి నెలల్లో రూ.35,000 ఖర్చు చేస్తే, ఏప్రిల్‌ -జూన్‌ త్రైమాసికంలో లాంజ్‌ యాక్సెస్‌ పొందడానికి అవకాశం కల్పిస్తారు. ప్రస్తుతం ఐసీఐసీఐ బ్యాంక్‌ ఎక్స్‌ప్రెషన్‌ క్రెడిట్‌ కార్డ్‌ లేదా ఐసీఐసీఐ బ్యాంక్‌ కోరల్‌ క్రెడిట్ కార్డ్‌ వినియోగదారులకు రూ.5,000 కనీస ఖర్చు నిబంధన ఉంది.

ఏయే ఐసీఐసీఐ క్రెడిట్​కార్డులకు?

  1. ఐసీఐసీఐ బ్యాంక్‌ కోరల్‌ క్రెడిట్‌ కార్డ్‌
  2. ఐసీఐసీఐ బ్యాంక్‌ ఎన్నారై సెక్యూర్డ్‌ కోరల్‌ క్రెడిట్‌ కార్డ్‌
  3. ఐసీఐసీఐ కోరల్‌ అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ క్రెడిట్‌ కార్డ్‌
  4. ఐసీఐసీఐ బ్యాంక్‌ సెక్యూర్డ్‌ కోరల్‌ క్రెడిట్‌ కార్డ్‌
  5. ఐసీఐసీఐ బ్యాంక్‌ కోరల్‌ కాంటాక్ట్‌ లెస్‌ క్రెడిట్‌ కార్డ్‌
  6. ఐసీఐసీఐ బ్యాంక్‌ ఎన్నారై కోరల్‌ క్రెడిట్‌ కార్డ్‌
  7. ఐసీఐసీఐ బ్యాంక్‌ లీడ్‌ ద న్యూ కోరల్‌ క్రెడిట్ కార్డ్‌
  8. ఐసీఐసీఐ కోరల్‌ రూపే క్రెడిట్‌ కార్డ్‌
  9. ఐసీఐసీఐ బ్యాంక్‌ మాస్టర్‌కార్డ్‌- కోరల్‌ క్రెడిట్‌ కార్డ్
  10. ఐసీఐసీఐ బ్యాంక్‌ ఎక్స్‌ప్రెషన్‌ క్రెడిట్‌ కార్డ్‌
  11. మైన్‌ క్రెడిట్‌ కార్డ్‌ బై ఐసీఐసీఐ బ్యాంక్‌ వీసా కార్డ్‌
  12. మైన్‌ క్రెడిట్‌ కార్డ్‌ బై ఐసీఐసీఐ బ్యాంక్‌ మాస్టర్‌ కార్డ్‌
  13. ఐసీఐసీఐ బ్యాంక్‌ హెచ్‌పీసీఎల్‌ సూపర్‌ సేవర్‌ వీసా క్రెడిట్‌ కార్డ్‌
  14. ఐసీఐసీఐ బ్యాంక్‌ హెచ్‌పీసీఎల్‌ సూపర్‌ సేవర్‌ మాస్టర్‌ క్రెడిట్‌ కార్డ్‌
  15. మేక్‌ మై ట్రిప్‌ ఐసీఐసీఐ బ్యాంక్‌ ప్లాటినమ్‌ క్రెడిట్‌ కార్డ్‌
  16. ఐసీఐసీఐ బ్యాంక్‌ మాంచెస్టర్‌ యునైటెడ్‌ ప్లాటినమ్‌ క్రెడిట్‌ కార్డ్‌
  17. చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఐసీఐసీఐ బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌
  18. స్పీడ్జ్‌ ఐసీఐసీఐ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌
  19. ఐసీఐసీఐ బ్యాంక్‌ పరాక్రమ్‌ సెలక్ట్‌ క్రెడిట్ కార్డ్‌
  20. ఐసీఐసీఐ బ్యాంక్‌ బిజినెస్‌ బ్లూ అడ్వాంటేజ్‌ కార్డ్‌
  21. ఐసీఐసీఐ బ్యాంక్‌ మేక్‌ మై ట్రిప్‌ మాస్టర్‌ బిజినెస్‌ ప్లాటినమ్‌ క్రెడిట్‌ కార్డ్‌

ఛార్జీలు, మినహాయింపులు

  • ఐసీఐసీఐ బ్యాంకు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఒక శాతం డైనమిక్‌ కరెన్సీ కన్వర్షన్‌ ఫీజు+ ట్యాక్స్‌ను వసూలు చేయనుంది. విదేశాల్లో భారతీయ రూపాయల్లో జరిపే ఆర్థిక లావాదేవీలపై ఈ ఛార్జీలు విధిస్తారు.
  • ఐసీఐసీఐ బ్యాంక్‌ రెంట్‌ పేమెంట్‌, ఈ-వ్యాలెట్‌ లోడింగ్‌లపై ఫిబ్రవరి 1 నుంచి రివార్డు పాయింట్లను నిలిపివేస్తోంది. అయితే ఐసీఐసీఐ అమెజాన్‌ క్రెడిట్ కార్డులకు మాత్రం దీని నుంచి మినహాయింపు ఇచ్చారు.
  • ఐసీఐసీఐ బ్యాంక్‌ ఫిబ్రవరి 1 నుంచి యుటిలిటీ చెల్లింపుల విషయంలోనూ కొత్త రూల్స్‌ తీసుకొస్తోంది. యుటిలిటీ బిల్లుల చెల్లింపులపై మునుపటిలానే రివార్డు పాయింట్లు ఇస్తారు. కానీ స్టాంప్‌ డ్యూటీ, ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ పే లాంటి ప్రభుత్వ చెల్లింపులపై రివార్డ్ పాయింట్లు లభించవు.

సేఫ్​గా UPI పేమెంట్స్ చేయాలా? ఈ టాప్​-7 టిప్స్​ మీ కోసమే!

స్టాక్​ మార్కెట్​లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఈ టాప్​-8 టిప్స్​ పాటిస్తే లాభాలు గ్యారెంటీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.